అన్వేషించండి

Satyabhama Serial Today October 10th: సత్యభామ సీరియల్: రేణుకని మేడ మీద నుంచి తోసేసిన రుద్ర.. ఇక మహదేవయ్యకు వారసుడు కష్టమే!

Satyabhama Today Episode మహదేవయ్య మీద అటాక్ చేసింది రుద్ర అని తెలుసుకున్న రేణుకని రుద్ర మేడ మీద నుంచి నెట్టేయడంతో తన బిడ్డని పొగొట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Satyabhama Serial Today Episode క్రిష్‌ తన బుగ్గు మీద సత్య పెట్టిన ముద్దు మార్క్ అందరికీ చూపిస్తానని పరుగులు తీస్తాడు. పరువు తీసేస్తున్నాడని సత్య వెనకాలే పరుగులు పెడుతుంది. క్రిష్‌ఆగకుండా బామ్మ బామ్మ అని పిలుస్తాడు. ఇక క్రిష్ సత్యని హగ్ చేసుకుంటాడు. ఇంతలో బామ్మ వస్తుంది.

జయమ్మ: అయ్యో దేవుడా ఈ ఘోరం చూపించడానికేనా నన్ను పిలిచింది. ఏరా అంత పెద్దగా ఉన్న బెడ్ రూం సరిపోవడం లేదా మీకు. హాల్‌లో సరసాలు ఏంట్రా. ఏంటమ్మా పద్ధతిగా ఉండేదానివి వీడితో కలిసి ఏంటమ్మా నువ్వు కూడా.
క్రిష్‌: నీ మనవరాలు పద్ధతిగా ఉంటుందా.
జయమ్మ: కాదా.
క్రిష్‌: అబ్బో..
జయమ్మ: ఏంట్రా ఆ వెటకారం. 
క్రిష్‌: ఎంత పద్ధతిగా ఉంటుందో చూపించమని అంటావా. ఎవరిది తింగరి వేషాలో ఎవరివి అల్లరి వేషాలో చూపించాలా ఒక్కసారి కళ్లు మూసుకో. ఇప్పుడు కళ్లు తెరు.
జయమ్మ: అయ్యో అని సిగ్గు పడుతుంది. నా మనవరాలు పద్దతి అయినది అని తెలుసు కానీ మరీ ఇంత పద్ధతి అని తెలీదు. బుగ్గ మీద స్టాంప్ వేసేసిందిగా నా బంగారమే.

ఇంతలో మహదేవయ్య, భైరవి వస్తారు. సత్య క్రిష్ బుగ్గు మీద చేయి వేస్తుంది. ఇక మహదేవయ్య బుగ్గ మీద ఏమైందని అడిగితే సత్య నెప్పి వస్తుందని అందుకే అలా చేయి పెట్టుకున్నారని చెప్తుంది. పెళ్లికి వెళ్తున్నామని మహదేవయ్య చెప్పడంతో క్రిష్ అన్న వస్తున్నాడా అని అడుగుతాడు. దానికి మహదేవయ్య వాడికి ఏదో పని ఉంది అని చెప్తే క్రిష్ నేను వస్తా అంటాడు. ఎందుకని మహదేవయ్య అడిగితే క్రిష్‌సెక్యూరిటీ అంటాడు. దానికి సత్య ఇక భయం లేదులే క్రిష్ మామయ్య మీద ఎవరూ అటాక్ చేయరు అంటుంది. ఎందుకని క్రిష్ అడిగితే మామయ్య కాన్ఫిడెన్స్ చూసి అలా అనిపించిందని అంటుంది. మహదేవయ్య సత్య ఒకర్ని ఒకరు కోపంగా చూసుకుంటారు.   

మరోవైపు శాంతమ్మ కాలు నొప్పులతో ఇబ్బంది పడుతుంటే మైత్రి వచ్చి అమ్మమ్మా అని కాళ్లు నొక్కుతుంది. శాంతమ్మ మైత్రిని పొగిడేస్తుంది. మా ఇంటి మనిషివి కాకపోయినా బాగా కలిసి పోయావని అంటుంది. దానికి మైత్రి నేను ఇంటి మనిషిని కానా అని అడుగుతుంది. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. ఇక హర్ష, నందిని కలిసి రావడం చూసిన విశ్వనాథం మనసులో వీళ్లిద్దరూ కలిసి వచ్చారని అంటే ఏదో  అగ్రిమెంట్ అయింటుందని అనుకుంటాడు. ఇక నందిని నవ్వుతూ మైత్రికి జీవితం అది ఇది అని ఫిలాసఫీ చెప్తుంది. 

హర్ష: మైత్రి కోరుకున్నట్లు తనకు ఫారెన్ యూనివర్సిటిలో చోటు వచ్చింది. నెలాఖరికి వెళ్లి జాయిన్ అవ్వాలి.
మైత్రి: అవునా నిజమా అని సంతోషం నటిస్తుంది. 
విశాలాక్షి: పెళ్లి ఫిక్స్ అవ్వడం కంటే పెద్ద శుభవార్త చెప్పావురా.
నందిని: ఇక మైత్రికి ఈ దేశంతో పని లేదు.
మైత్రి: మనసులో.. నన్ను పంపించేసి నువ్వు రిలాక్స్ అయిపోవాలి అనుకుంటున్నావా. అమ్మమ్మ మీ కాళ్లు పట్టుకున్నా శుభవార్త విన్నా. మా అమ్మానాన్న ఉన్నా నా కోసం ఇంత ఆలోచించరు. ఎందుకు హర్ష నేను అంటే ఇంత అభిమానం.
నందిని: ఇది మళ్లీ షురూ చేసింది మాట్లాడటానికి హర్ష తప్ప వేరే ఆలోచన లేదా. నువ్వేం ఆలోచించకు మైత్రి మేం దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిస్తా.
హర్ష: ఫారెన్ వెళ్లాక మమల్ని మర్చిపోవు కదా.. నందని కోపంగా చూడటంతో.. వెధవ నోరు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసి చావదు. 
నందిని: పోనీ నువ్వు పై చదువులు చదువుతావా.
శాంతమ్మ: వాడు చదివింది చాల్లే ముందు ఈ ఇంటికి ఓ వారసుడిని ఇవ్వండి చాలు. ( అందరూ నవ్వుకుంటారు)

రుద్రకి నర్శింహ ఫోన్ చేస్తాడు. నిజం చెప్పానని  కోపంగా ఉందా అని అంటాడు. ఇప్పుడు మీ బాపు పెళ్లికి వెళ్లావ్ కదా ఇప్పుడు స్పాట్ పెట్టానని అంటాడు. రుద్ర వద్దని తన తండ్రికి తాను చంపాలనుకున్న విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అంటాడు. ఇంతలో రేణుక ఆ మాటలు వినేసి ఇన్నేళ్లు మామని చంపాలి అనుకున్నది నువ్వా అని షాక్ అయిపోతుంది. రేణుకని ఎక్కువ మాట్లాడొద్దని అరుస్తుంది. రెచ్చ గొట్టొద్దని రేణుకతో అంటాడు. వేలెత్తి చూపించొద్దని అంటాడు. నీ మాట వినను అని మొత్తం చిన్నాకు చెప్పేస్తా నని అంటుంది. రేణుక వెళ్తుంటే రుద్ర అడ్డుకుంటాడు. ఆ పోట్లాటతో రేణుకని కొట్టేస్తాడు. రేణుక మెట్ల మీద నుంచి పడిపోతుంది. ఇంతలో సత్య వెళ్లి ఏమైందని అడిగి రుద్రని చూస్తుంది. రేణుకని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. 

రుద్ర కూడా హాస్పిటల్‌కి వస్తాడు. టెన్షన్ పడుతుంటే సత్య రుద్రతో ఎందుకు టెన్షన్ పడుతున్నారు అక్క బతికేస్తుందని అంటుంది. రుద్ర సత్యని గొడవ చేయకుండా వెళ్లమని అంటే రేణుకని తీసుకెళ్తానని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి రేణుకకి ప్రమాదం ఏం లేదు అని కానీ బిడ్డ చనిపోయిందని అంటుంది. లోపలికి వెళ్లి చూడమని అంటే సత్య వెళ్లబోతే రుద్ర ఆపేస్తాడు. తాను వచ్చిన వరకు రావొద్దని తిడతాడు. సత్య ఆగిపోతుంది. రుద్ర రేణుక దగ్గరకు వెళ్లి రేణుక తల నిమురు తాడు. రేణుక రుద్రని చూసి ఏడుస్తుంది. వెళ్లిపోమని నిన్ను చూడాలని అని లేదని ఏడుస్తుంది.

మన బిడ్డ చనిపోయింది కొంచెం కూడా బాధ లేదా అని ఏడుస్తుంది. అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది. దానికి రుద్ర ఇక నిజం చెప్తే నిన్ను చంపేస్తా సత్యని కూడా చంపేస్తా అంటాడు. ఇక సత్య డాక్టర్‌ని కలుస్తుంది. మీ అక్క బిడ్డని కోల్పోవడమే కాదు గర్బసంచి కూడా పోయిందని పొట్టకు బలమైన గాయం కావడం వల్ల బిడ్డని కోల్పోయిందని డాక్టర్ చెప్తుంది. దాంతో సత్య షాక్ అయిపోతుంది. మరోవైపు హర్ష మైత్రిని పంపడానికి లోన్ కోసం ట్రై చేస్తాడు అది మైత్రి వినేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర, విహారి నిశ్చితార్థం జరుగుతుందా? కనకాన్ని విహారి చూస్తాడా? ఏర్పాట్లు మాత్రం అదుర్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget