Satyabhama Serial Today November 30th: సత్యభామ సీరియల్: మహదేవయ్యనే వణికించేసిన సత్య.. డీఎన్‌ఏ టెస్ట్‌కి వెళ్తాడా.. క్రిష్ కొడుకు కాదని చెప్తాడా..!
Satyabhama Today Episode డాక్టర్లు ఇంటికి వచ్చి గంగ, క్రిష్, మహదేవయ్య సాంపిల్స్ డీఎన్ఏ టెస్ట్ కోసం తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode ఆస్తిలో సగం వాటా ఇస్తే ఇంటి నుంచి వెళ్లిపోతా అని గంగ అంటుంది. బంటి నీ కొడుకే అని నీ కొడుకుకి నీ రెండో పెళ్లానికి ఆస్తిలో సగం వాటా ఇస్తుంది కదా గంగ మొగుడు గారు అని మహదేవయ్యని అంటుంది. ఆశకైనా హద్దుండాలి అని భైరవి అంటే అయితే ఆస్తిలో వాటా ఇవ్వకపోతే నీ బెడ్ రూంలో సగం ఇవ్వాలని అంటుంది.
సత్య: అలా కాదు గంగ మామయ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకో ప్రశాంతంగా ఈ ఇష్యూని పరిష్కరిద్దాం.
గంగ: సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇంకొక్క అవకాశం ఇస్తున్నా నువ్వు క్రిష్ ఇద్దరూ కలిసి ఈ ఇంటిని వదిలేసి నాతో వచ్చేయాలి.
క్రిష్: చచ్చినా అది జరగదు.
గంగ: ఎందుకు జరగదు. నీకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు నాన్న.
క్రిష్: ఇంకోసారి ఆ మాట ఆడితే చంపేస్తా. ఆమె ఏం మాట్లాడుతుందో విన్నారా నేను బాపు కొడుకుని కాదట.
గంగ: నేను అనడం కాదు నాన్న డీఎన్‌ఏ టెస్ట్ తర్వాత తేలేది అదే. ఒక వేళ అది నిజం కాకపోతే మీ అందరి ముందు నేను ప్రాణ త్యాగం చేస్తా.
జయమ్మ: ఏంట్రా అది అలా తెగించి మాట్లాడుతుంది.
గంగ: ఎవరు ఎవరికి కొడుకు అవుతారో ఎవరు ఎవరికి ఏం కారో తేలిపోవాల్సిందే. డీఎన్ఏ టెస్ట్ జరగాల్సిందే ఇదే ఫైనల్ గంగ మొగుడా
భైరవి: నాకు ఎందుకో గుబులైతుంది అత్తమ్మా.
జయమ్మ: నీకే కాదు నాకు అలాగే ఉందే.
మహదేవయ్య: ఏయ్ ఇక ఆపండి నాకు దానికి ఏం సంబంధం లేదు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు.
క్రిష్: ఇంకా నీకు నమ్మకం లేదా అమ్మ.
భైరవి: అంత గట్టిగా చెప్పాడు కదా నమ్ముతున్నానులేరా.
సంధ్య సంజయ్ చెప్పినా ఆ విధిరాత గురించి ఆలోచిస్తుంది. శాంతమ్మకు విధి గురించి అడుగుతుంది. దైవ నిర్ణయం అని శాంతమ్మ చెప్తుంది. దానికి సంధ్య నేను ఈ రోజు ఎక్కడికీ వెళ్లనని అనుకుంటుంది. ఇక విశ్వనాథం మందులు అయిపోయాయని హర్షని తీసుకురమ్మని చెప్తే హర్ష సంధ్యని వెళ్లమని అంటాడు. దాంతో సంధ్య వెళ్లను అని అంటుంది. తర్వాత విశ్వనాథం వెళ్తాను అంటే సంధ్య వెళ్తానని అనుకుంటుంది. ఇళ్లు దాటను అనుకుంటే ఇలా వెళ్లాల్సి వస్తుందని అనుకుంటాడు. ఇక నందిని భర్త దగ్గరకు వెళ్లి ఈరోజు అస్సలు బయటకు వెళ్లవా ఇదేంటి కొత్తగా అని అంటుంది. నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదని హర్ష అంటే నందిని నువ్వంటే నాకు నమ్మకం ఉందని పెనిమిటీ గదిలోకి రా చెప్తా అని అంటుంది. హర్ష నువ్వుకుంటూ నందిని వెనక వెళ్తాడు.
మరోవైపు మహదేవయ్య ఇంటికి డాక్టర్లు, పోలీసు వస్తారు. డీఎన్‌ఏ టెస్ట్ కోసం సాంపిల్స్ తీసుకోవడానికి వచ్చామని చెప్తారు. భైరవి అందరినీ పిలుస్తుంది. సత్య కావాలనే గంగకి సైగ చేసి మామయ్యకి నువ్వు చేసిన నాటకం చాలు ఇక నాటకం ఆపేయ్ అని అంటుంది. మా మామయ్య పరువు తీయొద్దని అంటుంది. మీ ఇద్దరి పంతాల మద్య క్రిష్ నలిగిపోతున్నాడని.. మామయ్యని దెప్పిపొడుస్తూ సత్య ఇరగదీస్తుంది. ఇన్ డైరెక్ట్‌గా మహదేవయ్యకి నిజం ఒప్పుకోమని చెప్తుంది. సత్య ఇలా మాట్లాడుతుందేంటని మహదేవయ్య అనుకుంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా నేను డీఎన్‌ఏ టెస్ట్‌కి రెడీ అని గంగ కూర్చొంటుంది. ఇక గంగ దగ్గర బ్లడ్, హెయిర్ సాంపిల్స్‌ని డాక్టర్ తీసుకుంటారు. అలాగే బంటి దగ్గర తీసుకుంటారు.
సత్య మహదేవయ్యతో గంగ తగ్గడం అంటే సత్య తగ్గడమే అని గంగ తగ్గదని మీరే ఇక్కడికి నాటకం ఆపేసి క్రిష్ మీ కొడుకు కాదని ఒప్పుకోమని లేదంటే రాజకీయ సమాధి చేస్తానని అంటుంది. బంటి సాంపిల్స్ ఇచ్చిన తర్వాత క్రిష్ కూడా సాంపిల్స్ ఇస్తాడు. ఇక మహదేవయ్యకి సాంపిల్స్ ఇవ్వమని డాక్టర్ అంటే సత్య మామయ్య నిర్ణయం మార్చుకున్నారా అంటే గంగ నేను ఒప్పుకోనని అంటుంది. భైరవి కూడా ఒప్పుకోనని నా పెనిమిటి డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్లాల్సందే అని అంటుంది. మహదేవయ్య కూడా సాంపిల్స్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.