Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 29th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కబడ్డీ ఆడుతూ మిత్ర, లక్ష్మీల రొమాన్స్.. కుళ్లుకున్న మనీషా.. లక్కీ తల్లి ఎంట్రీ ఎప్పుడో?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మిత్ర అందరూ కలసి పొలంలో కబడ్డీ ఆడటం రౌడీలు వచ్చి లక్ష్మీతో పోటీ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ ఇంటికి వచ్చి పొలం అమ్మమని చెప్పిన వాళ్లకి వార్నింగ్ ఇస్తుంది. వాళ్ల లక్ష్మీతో మమల్ని కాదని ఈ ఊరు దాటి ఎలా వెళ్తావో అని అంటారు. ఇక అందరూ ఊరు చూడటానికి బయల్దేరుతారు. మరోవైపు సరయు దగ్గరకు రాజు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ని తీసుకొని వస్తాడు. సరయు పార్వతిలా నటించడానికి వచ్చిన అమ్మాయికి మొత్తం స్టోరీ చెప్తుంది.
ఇక జున్ను, లక్కీలకు పొలాలను చూపిస్తారు. వాటిని చూసి దేవయాని అక్కాచెల్లెళ్లకు ఏం లేదు అనుకున్నాం బాగానే ఉందని అంటుంది. ఇక పొలాలకు దగ్గర్లో కొందరు పెద్దవాళ్లు కబడ్డీ అడుతుంటారు. పిల్లలు కబడ్డీ అని కబడ్డీ అని గెంతులేస్తారు. లక్ష్మీ వాళ్లు వాళ్ల దగ్గరకు వెళ్తారు. లక్ష్మీ వాళ్లని కూడా వాళ్లు ఆడమని అంటారు. లక్ష్మీ కబడ్డీ అదరగొడుతుందని జాను చెప్తుంది. ఇక అందరూ లక్ష్మీని మిత్రతో పోటీ పడమని అంటారు. అందరూ ఆటకి సిద్ధపడతారు. మిత్రది ఒక టీమ్, లక్ష్మీది ఒక టీమ్ సిద్ధమవుతారు. అందరూ కబడ్డీ కోసం డ్రసింగ్ మార్చేస్తారు. పిల్లలు, జయదేవ్ ఆటాడిస్తారు. జాను కూతకి వెళ్తుంది. దేవయాని వివేక్‌తో దాన్ని పట్టుకోరా అని అంటుంది.
వివేక్, దేవయానిలు జానుని పట్టుకుంటే జాను ఇద్దరినీ లాక్కొని వెళ్లిపోతుంది. ఇద్దరూ అవుట్ అవుతారు. లక్ష్మీ టీమ్‌కి రెండు పాయింట్స్ వస్తాయి. ఇక మనీషా కూతకి వెళ్తుంది. మనీషాని లక్ష్మీ పట్టుకొని ఉంచేస్తుంది. దాంతో మనీషా అవుట్ అయిపోతుంది. ఇక వివేక్ వాళ్లు మిత్ర టీమ్‌లో నువ్వే మిగిలావు గెలుస్తావా ఓడిపోతావా అంటారు. దానికి మిత్ర నేనేంటో చూపిస్తా అంటాడు. ఇక లక్ష్మీతో ఇప్పటికైనా నువ్వు వస్తావా వాళ్లని వీళ్లని పంపిస్తావా అంటే లక్ష్మీ నేనే వస్తాను అని మిత్ర దగ్గరకు కూతకు వెళ్తుంది. పిల్లలు అమ్మా అమ్మా లక్ష్మీని సపోర్ట్ చేస్తారు. మనీషా వాళ్లు మిత్రకు సపోర్ట్ చేస్తారు. లక్ష్మీని మిత్ర లాగేసి హగ్ చేసుకొని పట్టుకుంటాడు. లక్ష్మీ వెళ్లిపోతుంటే వెంట పడి మరీ పట్టుకుంటాడు. అది చూసి మనీషా దేవయానితో వాళ్లు కబడ్డీ అడుతున్నారా లేక పబ్లిక్‌లో రొమాన్స్ చేస్తున్నారా అని అంటుంది. ఇక పిల్లలు అందరూ నాన్న గెలిచారు అని గెంతులేస్తారు.
మనమే గెలిచామని మనీషా వాళ్లు గెంతులేస్తారు. అందరూ లక్ష్మీతో మీ ఆయన్ని గెలిపించాలని ఓడిపోయావా అని అడుగుతారు. దానికి మిత్ర తనేం నన్ను గెలిపించలేదు నేనే గెలిచానని అంటాడు. ఇంతలో పొలం కొనడానికి వచ్చిన వాళ్లు మళ్లీ వస్తారు. పొలం అమ్ముతామని చెప్పే వరకు వదలమని అంటారు. ఇక వాళ్ల కబడ్డీ అడుదామని ఆటలో మీరు గెలిస్తే పొలం అమ్మొద్దని మేం గెలిస్తే అమ్మాలని అంటారు. దాంతో లక్ష్మీ సరే అంటుంది. అందరూ లక్ష్మీతో వద్దని అంటారు. లక్ష్మీ వాళ్లు ఆ రౌడీలతో కబడ్డీ ఆడుతారు. మొదట వెళ్లిన వ్యక్తిని లక్ష్మీ వాళ్లు తోసేస్తారు. ఇక మిత్ర కూతకు వెళ్లి ఓ వ్యక్తిని అవుట్ చేస్తాడు. తర్వాత ఓ బండోడు కూతకి వస్తాడు. మిత్ర వాళ్లు వాడిని పట్టేస్తారు. ఇక లక్ష్మీ కూతకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.