Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 28th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని హగ్ చేసుకొని సెల్ఫీ తీసుకున్న మిత్ర.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ తాతయ్య కోసం మిత్ర లక్ష్మీతో చనువుగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode సరయుకి మనీషా కాల్ చేస్తుంది. సరయు కుశల ప్రశ్నలు వేస్తే మనీషా ఫుల్ ఫైర్ అవుతుంది. ఏదో ప్లాన్ వేశానని అన్నావు కదా ఏమైంది అంటే నేను ఒక రూట్‌లో ప్లాన్ చేస్తే మీరు వేరే రూట్‌లో వెళ్లిపోయారని అంటుంది. దాంతో అదంతా లక్ష్మీ వల్లే అని అంటుంది. ఇక మిత్ర ఇక్కడ నుంచి బయల్దేరాలి ఏమైనా ప్లాన్ చేయమని అంటుంది.
మనీషా: లక్కీని అడ్డుపెట్టుకో పాపకి తల్లి అని పార్వతిని తీసుకొచ్చావ్ కదా దాన్ని వాడుకో. సరయు వెంటనే ఓ లేడీ జూనియర్ ఆర్టిస్ట్‌ని పంపించు మిగతా కథ నేను నడుపుతా.
సరయు: రాజు గారు ఆ మనీషా నన్ను ఫ్రెండ్ అనుకుంటుందా లేదంటే ఇంకేం అనుకుంటుంది నాకు అని పనులు చెప్తుంది.
రాజు: ఇలాంటి వారితో స్నేహం చేస్తే అలాగే ఉంటుంది మేడం.
పార్థసారథి గారు వివేక్, జానులకు గది చూపించి అన్నీ సౌకర్యాలు ఉన్నాయని చెప్తారు. జాను తన భర్తకి సౌకర్యాలు పెద్దగా అవసరం లేదని నేల మీద పడుకుంటారని గడ్డు కారం కూడా తింటారని అంటుంది. దాంతో తాతగారు వివేక్‌కి క్షమాపణ చెప్పి మా జానుకి అల్లరి తగ్గలేదని అంటాడు. మీ పుట్టింటికి వచ్చానని ఓవర్ చేస్తున్నావ్ కదా అని వివేక్ అంటాడు. దానికి జాను అవును ఇది మా ఇళ్లు మీ అమ్మవి నీవు ఆటలు సాగవని అంటుంది. ఇక వివేక్ కాస్త రొమాంటిక్‌గా ఉండవే అని దగ్గరకు తీసుకుంటాడు. ఇంతలో జాను మీ అమ్మ వచ్చిందని చెప్తే వివేక్ జానుని వదిలేస్తాడు. మరోవైపు మిత్ర ఆరుబయట ఉంటే లక్ష్మీ అక్కడికి వెళ్తుంది.
మిత్ర: నన్ను పట్టించుకోవడానికి నీకు ఇప్పుడు తీరిక దొరికిందన్నమాట.
లక్ష్మీ: సారీ అండీ అందరితో మాట్లాడుతూ ఉండిపోయా
మిత్ర: చూశా చూశా నీ ఫాలోయింగ్ ఊరంతా నీ ఫ్యాన్స్.
లక్ష్మీ: అదేం లేదండి రండి రూం చూపిస్తా ఫ్రెష్ అవుతా.
మిత్ర: అయ్యయ్యో ముందు నీ చుట్టరికాలు అయితే తర్వాత నేను.
లక్ష్మీ: అలా అనకండి చెప్పడం మర్చిపోయా అక్కడ ఉన్నట్లు మీరు నాతో అంటీ ముట్టనట్లు ఉండొద్దండి. ఎవరికైనా తెలుస్తుంది.
మిత్ర: నటించడం నా వల్లకాదు.
లక్ష్మీ: ప్లీజ్ అండీ అలా అనొద్దు ఈ ఊరుతో ఉన్నంత వరకు నాతో కాస్త చనువుగా ఉండండి ప్లీజ్. ఇంకేం అడగను ప్లీజ్.
మత్ర లక్ష్మీ దగ్గరకు తీసుకొని వెనక నుంచి హగ్ చేసుకొని చనువుగా అంటే ఇలాగా అని సెల్ఫీ తీసుకుందామా అని తీసుకుంటాడు. లక్ష్మీ మిత్ర ప్రవర్తనకు షాక్ అయిపోతుంది. ఇంతలో లక్ష్మీ తాత అక్కడికి వచ్చి సారీ డిస్ట్రబ్ చేశానని అంటాడు. దాంతో లక్ష్మీ తాతయ్యని చూసి ఈయన ఇలా ప్రవర్తించారా అని అనుకుంటుంది. ఇక పార్థసారథి మిత్ర వాళ్లని రెడీ అయి రమ్మని టిఫెన్ ఏర్పాట్లు చేస్తానంటారు.
పార్థసారథి: అల్లుడుగారు అంటే ఈ ఇంటి దైవంతో సమానం. అల్లుడుగారు మీ తాతయ్య కన్న కల అమ్మ. నీ పెళ్లిని ఓ తపస్సులా భావించారు అందుకే దేవుడిలాంటి అల్లుడు గారు వచ్చారు. అలాంటి దేవుడికి ఏ లోటు రాకుడదమ్మా అల్లుడు గారు సంతోషంగా ఉంటే మీ తాతయ్య ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. మిమల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా.
మిత్ర: లక్ష్మీ పెళ్లి కోసం ఆ పెద్దాయన అంత కల కన్నారా.
లక్ష్మీ: చాలా థ్యాంక్స్ అండీ సంతోషంతో మా తాతయ్య కళ్లు చెమ్మగిల్లాయి. నాకు జానుకి వచ్చే భర్తలు మా తాతయ్యలకు దేవుడితో సమానం అందుకే ఇలా అన్నారు మనం ఊరి నుంచి వెళ్లేటప్పుడు తాతయ్య సంతోషంగా ఉండాలండీ అదే నేను మీకు అడిగింది.
అందరూ ఫ్రెష్ అయి హాల్‌లో కూర్చొంటారు. పిల్లలు ఊరు చూపించమని అడుగుతారు. లక్ష్మీ చూపిస్తానని అంటుంది. దానికి దేవయాని, మనీషాలు ఇదో పెద్ద సిటీ తిప్పి చూపిస్తారంటా అని అంటుంది. ఇక అందరూ ఊరు చూడటానికి బయల్దేరుతారు. మనీషా, దేవయాని రామని అంటారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు వస్తారు. మన పొలం కొంటామని అంటున్నారు అమ్మమని చెప్తున్నా వినడం లేదని అంటారు. తాతయ్య అమ్మను అంటే మేం అమ్మము అని లక్ష్మీ చెప్తే వాళ్లు బెదిరిస్తారు. మా గురించి మీకు తెలియకపోయినా మీ భర్త మిత్రా నందన్‌కి బాగా తెలుసని మాకు కావాల్సింది మాకు ఇవ్వకపోతే ప్రాణాలు తీసి అయినా తీసుకుంటామని అంటాడు. దాంతో లక్ష్మీ నిలబడే ఉన్నారేంటి కూర్చొండి అని మర్యాదలు చేస్తుంది. అందరూ లక్ష్మీ ఇలా ప్రవర్తిస్తుందేంటి అనుకుంటారు. ఇక లక్ష్మీ వాళ్లకి నీళ్లు ఇచ్చి తాగిన తర్వాత ఇక లేచి వెళ్లండి అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరైనా మీ భార్యకి చెప్పండని మిత్రతో అంటారు. మిత్ర మాత్రం ఏం మాట్లాడకుండా పొగరుగా చూస్తూ ఉంటాడు. లక్ష్మీ వాళ్లని తిట్టి వార్నింగ్ ఇచ్చి పంపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: గంగ వెనకున్న కర్త, కర్మ నేనే అని మామ కాని మామకి షాకిచ్చిన సత్య.. భైరవి యాక్టింగ్ సూపర్!