Satyabhama Serial Today March 3rd: సత్యభామ సీరియల్: దొంగలా ఇంట్లో దూరిన క్రిష్.. మైత్రి హర్షని బ్లాక్ మెయిల్ చేస్తుందని తెలుసుకున్న నందిని!
Satyabhama Today Episode మహదేవయ్యని చూడటానికి క్రిష్ దొంగ చాటుగా ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode ఒక్కసారి క్రిష్‌ని పలకరించమని సత్య మహదేవయ్యని బతిమాలుతుంది. క్రిష్ జీవితం నుంచి నువ్వు వెళ్లిపోతే ఇంట్లో తెచ్చి పెట్టుకుంటా అని భైరవి అంటుంది. సంధ్య, సంజయ్ చాలా సంతోషిస్తారు. క్రిష్‌ని జన్మలో క్షమించేది లేదని భైరవి సత్యని పంపేస్తుంది. సత్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రేణు, బామ్మ కన్నీరు పెట్టుకుంటారు.
మరోవైపు నందిని కూరగాయలకు వెళ్తూ హర్ష, మైత్రిని బైక్ మీద తీసుకెళ్లడం చూస్తుంది. వాళ్లని ఫాలో అవుతుంది. మైత్రి హర్షతో ఇలా దొంగ చాటుగా తిరగడం ఇబ్బందిగా ఉంది.. రెండు రోజుల్లో నందినికి విడాకులు ఇస్తే తర్వాత రోజు మనం పెళ్లి చేసుకుందామని బ్లాక్ మెయిల్ చేస్తుంది. నందిని దూరం నుంచి చూసి హర్ష కంగారు పడుతున్నాడు మైత్రి ఏదో విషయంతో బెదిరిస్తుంది అదేంటో తెలుసుకోవాలని అనుకొని వెళ్లిపోతుంది. సత్య ఇంటికి వస్తుంది. క్రిష్ సత్య కోసం ఎదురు చూస్తాడు.
క్రిష్: సత్య నువ్వు ఎక్కడికి వెళ్లావో నాకు తెలుసు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు.
సత్య: మౌనంగా వెళ్లిపోతున్నా అంటే అర్థం కావడం లేదా గొప్పగా ఏం జరగలేదని. అనవసరంగా వెళ్లాను అనిపిస్తుంది.
క్రిష్: నిన్ను ఏమైనా అన్నారా.
సత్య: నా గురించి నాకు ఆలోచన లేదు.
క్రిష్: అందుకే నేను అడుగుతున్నా.
సత్య: వాళ్ల కంటే వెయ్యి రెట్లు ప్రేమించావ్ ఇప్పుడు రుణం తీర్చుకున్నావా క్రిష్.
క్రిష్: ఎవరి రుణం అయినా తీర్చుకోవచ్చు కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం.
సత్య: ఏంటి క్రిష్ నువ్వు అక్కడ ఏం జరిగిందో తెలుసా చిన్నా దగ్గరకు రమ్మంటే మీ అమ్మ ఎవరు చిన్నా అని వెటకారానికి పోయింది.
క్రిష్: చెప్పొద్దు సత్య అక్కడేం జరిగిందో చెప్పకు. నాకు కావాల్సింది బాపు నా దగ్గరకు రావడం కాదు నేను బాపు దగ్గరకు వెళ్లడం. నన్ను బాపు చిన్నా అని పిలవడం కాదు నేను బాపు అని పిలవడం తేడా అర్థమవుతుందా. నా బాధ నీకు అర్థం కావడం లేదు. పాతి కేళ్ల తర్వాత వేరే ఎవరినో బాపు అని పిలవలేను. ఎప్పటికీ నా బాపు ఒక్కరే. బతిమాలుకుంటున్నా సత్య నన్ను కూడా ఒక కొడుకులా ఆ ఇంట్లో ఉంచమని వేడుకుంటున్నా. దేవుడు చేసిన తప్పు నేను శిక్ష అనుభవిస్తున్నా.
సత్య: దేవుడు ఏం చేసినా మన మంచికే కాస్త ఓపిక పట్టు.
క్రిష్: నేను ఈ రోజు ఆ ఇంటికి పోతున్నా బాపుని చూడటానికి అర్థరాత్రి అందరూ నిద్ర పోతే దొంగ చాటుగా వెళ్లి బాపుని చూసి వచ్చేస్తా.
సత్య: నాకు నీతో వాదించే ఓపిక లేదు ప్లీజ్ ఆ ప్రయత్నం మానుకో.
నందిని హర్ష దగ్గరకు వెళ్లి నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అంటుంది. ఏం లేదని హర్ష చెప్తాడు. ఇక నందిని గదిలో వెతికి విడాకుల పత్రాలు చూసి మైత్రి ఇందుకే బెదిరిస్తుంది. కానీ ఎందుకు బెదిరిస్తుందని అనుకుంటుంది. ఇక భైరవి సంజయ్‌తో చిన్నా లేకపోతే నాకు బాధగా ఉంది వాడు నాకు అలవాటు అయిపోయాడు. దానికి సంజయ్ నీకు వాడు అవసరం లేదు బాపు కూడా వాడి వైపు వెళ్తే నువ్వే అడ్డుకోవాలి అని లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోతా అని బెదిరిస్తాడు. దాంతో క్రిష్‌ని ఎప్పటికీ ఇంటికి రానివ్వను అని అంటుంది.
సత్య, క్రిష్ ఒడిలో పడుకొని క్రిష్‌ని మామూలు మనిషి చేయడానికి కాసేపు మాట్లాడుకుందామా అని అంటుంది. నన్ను ముద్దు పెట్టడం లేదు నా చీర బాగుంది అని చెప్పడం లేదు అని అంటుంది. ఇక పెళ్లి ఫొటోలు చూద్దామా అని ఆల్బమ్ తీస్తుంది. సత్య అది కుదరడం లేదని క్రిష్ చిన్ననాటి ఫొటో తీసుకురావాలి అని వెళ్లేలోపు క్రిష్ మహదేవయ్య ఇంటికి వెళ్లిపోతాడు. తనని గెంటేయడం బాపుతో సంతోషంగా ఉండటం అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఎవరూ చూడకుండా మెల్లగా ఇంట్లోకి దూరుతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

