Satyabhama Serial Today January 7th: సత్యభామ సీరియల్: మొదలైన రుద్ర అరాచకం.. రోడ్ల మీద తిరుగుతున్న నందిని, సత్య.. నర్శింహ ఆఫర్!
Satyabhama Today Episode రాజకీయ ప్రయోజనం కోసం మహదేవయ్య పెద్దకొడుకు రుద్రని బెయిల్ మీద ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode సత్య డల్‌గా ఉంటే క్రిష్ ఏమైందని అడుగుతాడు. దానికి సత్య చెప్పుకోవడానికి నాకు నీకు తప్ప ఎవరూ లేరు అని కానీ నేను చెప్తే నువ్వు నాకు బాగా అయిందని నవ్వుకుంటావని చెప్తుంది. అలా ఏం కాదు చెప్పు అని అంటే దానికి సత్య పుట్టింటి వాళ్లు ఎలక్షన్‌లో అండగా ఉండమని చెప్పారని నిరాశగా తిరిగి వచ్చానని అంటుంది.
క్రిష్: మీ పుట్టింటి వాళ్ల రెస్పాన్స ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు.
సత్య: అంతా నీ పుణ్యం మీ బాపు పుణ్యం. ఫోన్ చేసి మీ బాపు మా వాళ్లని బెదిరించారు. అంతకు ముందు నువ్వు వెళ్లి చెప్పి వచ్చావ్ మరి నాకు ఎలా సపోర్ట్ చేస్తారు.
క్రిష్: మేం చెప్తే చేయడం ఏంటి మంచీ చెడు వాళ్లు ఆలోచించుకోవాలి కదా. నువ్వు పోటీ చేయడం నాకు ఇష్టమా కాదా పక్కన పెడితే మన రెండు కుటుంబాల మధ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. బాగా పెద్ద చదువులు చదుకోవాలని అనుకున్నావ్. అప్పుడు రాజీ పడ్డావ్ ఇప్పుడు కూడా ఏది మంచో చెడో ఆలోచించి నిర్ణయించుకో. ఎందుకంటే నా మాట నువ్వు వినవు.
సత్య: అయితే నువ్వు నన్ను సపోర్ట్ చేయ్. తొమ్మిది మంది దొరకాలి అని కోరుకుంటున్నావా లేదనుకుంటున్నావా.
క్రిష్: అదంతా ఏమో కానీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది.
సత్య: అయితే
క్రిష్: ముసుగేసుకొని..
సత్య: పడుకో.
క్రిష్: ముసుగేసుకొని నీతో పని కానీ నా ఒక్కడినే పడుకోమంటావా. మనదే కదా పని.
మహదేవయ్య: ఉదయం.. రేయ్ మళ్లీగా అన్నీ రెడీ చేశావా ఈ రోజు మన ఇంట్లో జాతరరా. జాతర. ఏయ్ భైరవికి పిలిచి రుద్రకి ఇష్టమైన వంటలు అన్నీ చేయమని అంటాడు.
రుద్ర ఇంటికి వస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. సత్య షాక్ అయిపోతుంది. రుద్ర ఇంట్లో వాళ్లతో మా బాపు అమ్మ ముఖం తప్ప ఎవరి ముఖంలో సంతోషం లేదు అంటాడు రుద్ర. రుద్ర క్రిష్‌ని ఉద్దేశించి నేను రావడం చాలా మందికి ఇష్టం లేదు అని అంటాడు. దానికి క్రిష్ తప్పు చేశావ్ జైలుకి పంపాను ఇకనైనా నువ్వు మంచిగా ఉంటే అంతే చాలు అన్నాదమ్ములం అయిన మన మధ్య శత్రుత్వం ఏం లేదు అంటాడు.
క్రిష్: అయినా బాపు నువ్వు రాంగ్ టైంలో అన్నిని బెయిల్ మీద తీసుకొచ్చావ్. ఇది ఎలక్షన్ టైం. అన్నకి ఆవేశం ఎక్కువ పొరపాటున పాత కేసులు రిపీట్ చేస్తే నీకే కష్టం.
రుద్ర: అంటే ఏంట్రా నన్ను జైలులో ఉండమంటావా. నేను పెద్దోడిని నాకు నువ్వు నీతులు చెప్పకు.
మహదేవయ్య: రేయ్ నీ ఆవేశం అంటే నాకు ఇష్టంరా అందుకే తీసుకొచ్చా. చిన్నా నా కుడి భుజ అయితే నువ్వు నా ఎడం భుజంరా మీ ఇద్దరూ నా పక్కన ఉంటే నా బలం.
రేణుక: పైకి కనిపించడం లేదు కానీ మామయ్య ఏదో పెద్ద ప్లానే వేశాడు.
ఇంతలో నందిని ఇంటికి వస్తుంది. పెద్దన్నని చూసి సెటైర్లు వేస్తుంది. నందిని మీద రుద్ర అరిస్తే నువ్వు మహదేవయ్య కొడుకు అయితే నేను మహదేవయ్య కూతురిని సేమ్ బ్లడ్ అని అంటుంది. ఇక నందిని సత్యతో నామినేషన్ కోసం 9 మంది కావాలి అన్నావ్ కదా నా దోస్త్‌లు చాలా మంది ఉన్నారు కదా వెళ్దాం పద అంటుంది. సత్య క్రిష్‌కి వెళొస్తా అని చెప్తే నీ కోసం పట్టించుకోని వాడి కోసం నువ్వెందుకు పట్టించుకుంటావ్ అని అంటుంది. రుద్రకి సత్య నామినేషన్ విషయం తెలుస్తుంది. ఇకపై ఇలా జరగదు అని రుద్ర అంటాడు. నందిని సత్యలు బయటకు వెళ్తారు. నందిని తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి వదినకు సపోర్ట్ చేయమని అంటే మీ నాన్నని ఎదురించే ధైర్యం మాకు లేదు అని సపోర్ట్ చేయను అనేస్తుంది.
మరో అమ్మాయి సపోర్ట్ చేస్తా అంటే ఆమె తల్లి వద్దు అనేస్తుంది. చాలా మందిని అడిగినా వదినా మరదళ్లకు నిరాసే మిగులుతుంది. రుద్ర గడిలో భోజనం చేస్తూ ఉంటే రేణుక పక్కనే వణుకుతూ నిల్చొంటుంది. రుద్ర రేణుక జుట్టు పట్టుకొని సత్యని చూసి రెచ్చపోతున్నావ్ కదా నీకు దానికి ఇద్దరికీ నా చేతిలో చావు రాసిందని నేను ఏం చేసినా కుక్కినపేనులా పడుండు లేదంటే అయిపోతావ్ అని బెదిరిస్తాడు. రేణుక ఏడుస్తుంది. నందిని, సత్య ఇద్దరూ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇంతలో నర్శింహ వాళ్ల దగ్గరకు వస్తాడు. క్రిష్ కూడా వస్తాడు. దూరం నుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. నర్శింహ సత్యతో టెన్షన్ తీసుకోకు నీకు సపోర్ట్‌గా నేను సంతకాలు పెట్టిస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!