Trinayani Serial Today January 7th: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!
Trinayani Today Episode తిలోత్తమ అఖండ స్వామి దగ్గర నుంచి మంత్రించిన అద్దం తీసుకురావడం అందులో నయని చూడగానే త్రినేత్రి కనిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode ఆత్మలింగం శవాన్ని ఆత్మని చూశానని అంటాడు. నయని దగ్గరకు వెళ్తుంటే ఆత్మ లింగం పెద్దగా అరుస్తూ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. పైన శవం ఉందని చెప్పాడేంటి అని సుమన అంటుంది. నయని కూడా ఏం తెలీనట్లు ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అంటుంది. విక్రాంత్ కూడా నయనికి వత్తాసు పలుకుతాడు.
రాత్రి విక్రాంత్ బయట తిరుగుతూ ఉంటే సుమన వెళ్తుంది. సుమన మాట విని వల్లభ పెద్దగా అరుస్తాడు. ఇక తిలోత్తమ కూడా వస్తుంది. ఆత్మలింగం అబద్ధం చెప్పాడని సుమన అంటే నిజం చెప్పే ఉంటాడని అంటుంది.
సుమన: మా అక్కని చూసి ఆత్మ అంటున్నాడు. ఆత్మ అయితే అందరికీ కనిపించదు కదా.
తిలోత్తమ: లాజికే కానీ మనం ఆలోచిస్తే అంతు చిక్కకుండా ఉండదు. తెలుసుకోవాలి. పెద్దల్ని సంప్రదించాలి. అంతు చిక్కని విషయాలను మహానుభావులను సందర్శించి తెలుసుకోవాలి. ఇందుకు అఖండ స్వామిని కలవాలి.
వల్లభ: మంచి ఆలోచన అమ్మ ఆయనకు సర్వం తెలుసు.
సుమన: అత్తయ్య ఇంకో మాట ఇంట్లో శవం చూశానని నోరు పారేసుకున్నాడు ఆత్మలింగం అది కూడా తెలుసుకోండి.
బామ్మ ఏడుస్తుంటే విక్రాంత్ ఓదార్చుతుంటాడు. హాసిని, నయని కూడా అక్కడికి వస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే నా మనవరాలు గుర్తొచ్చిందంటుంది. తన మనవరాలు చచ్చిపోయిందని బామ్మ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. విక్రాంత్‌కి వినిపించేలా నయని మీరు చెప్పారా బాబు అంటుంది. దాంతో విక్రాంత్ లేదు అంటాడు. నీకు ఎలా తెలుసు అని బామ్మని అడిగితే మా ఊరి గాథ లింగం చెప్పాడు కదా అంటుంది. ఆత్మ ఇక్కడే ఉందని అంటుంది. నయని బామ్మకి విషయం తెలిసిపోయిందని కంగారుపడుతుంది.
బామ్మ: నేనేం చెప్తున్నా అంటే నా మనవరాలు త్రినేత్రి ప్రాణాలు పోగొట్టుకొని తన ఆత్మ తనలో ఉన్న నయనిలో చేరిందేమో అని అనిపిస్తుంది.
విక్రాంత్: నాకు అర్థమైంది. త్రినేత్రి కనిపించకపోయే సరికి ఆ ఆత్మ నయని వదినలో ఉందని ఊహించుకున్నారన్నమాట.
నయని: బామ్మ నేను నయనిని నేను త్రినేత్రి అయితే కాదు.
బామ్మ: ఏమోనమ్మా నువ్వు ముట్టుకున్నా నాకు నా మనవరాలి లాగే ఉంటుంది.
విక్రాంత్: మీరు ధైర్యంగా ఉండండి త్రినేత్రి మీ దగ్గరకు అతి త్వరలో వస్తుంది.
హాల్‌లో అందరూ ఉంటారు. వల్లభ ఓ మ్యాజిక్ అద్దం తీసుకొస్తాడు. అందులో మనకి మనం కనిపించమని చెప్తాడు. తల్లి అన్నమాటలు వినొద్దని అబద్ధం అని విక్రాంత్ అంటాడు. తిలోత్తమ మాత్రం అది నిజంగా మ్యాజిక్ అద్దమే అంటుంది. వల్లభ ఆ అద్దం తెరిస్తాడు. ఈ లోపు పాప నయని దగ్గరకు వెళ్లి అమ్మా అమ్మా అని పిలిచి అక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. విక్రాంత్ ఆ అద్దం ఓపెన్ చేసి చూస్తే దాని మీద పౌడర్ పూత పూసి ఉంటుంది. విక్రాంత్ చూడగానే అందులో తన ముఖమే కనిపిస్తుంది. ఇదేం మ్యాజిక్ కాదు అని హాసినికి ఇస్తాడు. హాసిని కూడా తన ముఖమే చూస్తుంది. తిలోత్తమ తెలివిగా అమ్మిన వాడు మోసం చేశాడని ఆ అద్దం కోసం పాతిక వేలు ఇచ్చామని చెప్తుంది. తర్వాత సుమన చూస్తుంది తన ముఖమే కనిపిస్తుంది. ఇక నయనిని చూడమని తిలోత్తమ చెప్తుంది.
ఇంతలో నయని చూసే టైంకి పాప నీరు కావాలని సైగ చేస్తుంది. నయని అద్దం చూసి తీసుకెళ్తా అంటుంది. పాప ఎంత చెప్పినా నయని వినకుండా అద్దం చూస్తుంది. అందులో నయని ప్రతిబింబానికి బదులు త్రినేత్రి ముఖం కనిపిస్తుంది. నయని, తిలోత్తమతో పాటు అందరూ షాక్ అయిపోతారు. నయని వేరు చీరలో కనిపిస్తుందని హాసిని చెప్తుంది. విక్రాంత్‌కి విషయం అర్థమవుతుంది. సుమన కూడా ఏంటి ఇలా అయింది అంటుంది. తిలోత్తమ తనకు అర్థమైంది అని అంటుంది. నయని పాపని తీసుకొని వెళ్లబోతే అందరికీ నిజం తెలియాలి కదా ఆగు నయని అంటుంది. అఖండ స్వామి ఈ అద్దం ఇచ్చారని ఎవరి ముఖం వేరేగా కనిపిస్తే వాళ్లలోకి ఆత్మ దూరినట్లుని వల్లభ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఇంట్లో దీప వంటలు.. కాళ్లు మొక్కతా అన్న పారు.. రెస్టారెంట్ పెట్టిస్తానన్న జ్యోత్స్న.. నిజమేనా?