Satyabhama Serial Today December 9th: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటి వాళ్లని రౌడీలతో బెదిరించి సత్యతో పరుగులు పెట్టిస్తున్న మహదేవయ్య!
Satyabhama Today Episode మహదేవయ్య సత్యని భయపెట్టడానికి ఆమె పుట్టింటి మీదకు రౌడీలను పంపించి రచ్చ రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode క్రిష్ కన్న తండ్రిని బయట పెట్టే విషయంలో అస్సలు తగ్గను అని సత్య మహదేవయ్యతో ఛాలెంజ్ చేస్తుంది. దాంతో మహదేవయ్య నీలాంటి పొగరు బోతుకి ఎలా ముక్కు తాడు వేయాలో నాకు తెలుసు అని నీకు ఇష్టం అయిన వాళ్లని ఏడిపించి నీకు కన్నీరు వచ్చేలా చేసి రోజు రోజుకి నిన్ను కోలుకోలేని దెబ్బ కొడతానని మహదేవయ్య ఛాలెంజ్ చేస్తాడు. సత్య కంగారు పడుతుంది.
మహదేవయ్య: భయంతో వాళ్లు గజగజ వణికి పోతుంటే నీ కళ్లలో నీరు రావాలి. పిచ్చి దాని లెక్క నువ్వు ఉరుకులు పరుగులు తీయాలి. నీ జీవితం అంతా వాళ్లని కాపాడుకోవడానికే సరిపోతుంది. నీ మొడుగు గుర్తుండడు నేను గుర్తుండను ఎట్లా ఉంది నా స్కెచ్. రేపటి నుంచి నీ పరుగులు స్టార్ట్ అవుతుంది.
సత్య: నాకు నచ్చిన వాళ్ల వెంట పడటం అంటే ఎవరు అది క్రిష్‌నే కదా. నా పుట్టింటి వాళ్లనా. అని కంగారు పడుతుంది. ఉదయం కంగారుగా పుట్టింటికి కాల్ చేస్తుంది. వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంది. ఏంటి నాన్న కాల్
విశ్వనాథం కాల్ చేస్తే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అడిగి కోప్పడి కంగారు పడుతుంది. అందరూ బాగున్నారా అని పేరు పేరునా అడుగుతుంది. ఎందుకు సత్య అంత కంగారు పడుతున్నావని అడిగితే సత్య కవర్ చేస్తుంది. విశాలాక్షి రావడంతో సత్య కంగారు పడుతుందని విశ్వనాథం చెప్తాడు. ఇంతలో కొందరు రౌడీలు వచ్చి విశ్వనాథం ఇంటి వచ్చి గొడవ చేస్తారు. తమ కంపెనీ నుంచి 25 లక్షలు తీసుకొని కట్టలేదని గొడవ చేస్తారు. ఇంకా టైం ఉంది కదా అని హర్ష చెప్పినా రౌడీలు వినరు గోల గోల చేస్తారు. అంత డబ్బుతో అవసరం ఏం వచ్చింది హర్ష నీకు అని విశ్వనాథం అడిగితే టిక్కులాడి మైత్రిని ఫారెన్ పంపడానికి తీసుకొచ్చాడు కదా అని నందిని అంటుంది.
విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. రౌడీలు ఇంట్లో వస్తువులన్నీ ఎలా పడితే అలా విసిరేస్తారు. హర్షని పట్టుకొని కొడతారు. హర్షని ఏం చేయొద్దు వారంలో డబ్బు తిరిగి ఇస్తానని విశ్వనాథం రౌడీల కాళ్లు పట్టుకుంటాడు. వారంలో కష్టమని హర్ష అంటే ఇళ్లు తాకట్టు పెడతానని విశ్వనాథం అంటాడు. దాంతో రౌడీలు వెళ్లిపోతారు. అందరూ ఏడుస్తారు. శాంతమ్మ హర్షని తిడుతుంది. ఆడపిల్ల పెళ్లి చేయాల్సిన వాడికి ఈ పరిస్థితి ఏంటిరా అని ఏడుస్తుంది. సంధ్య సత్యకి కాల్ చేసి విషయం చెప్తుంది. సత్య షాక్ అయిపోతుంది.
మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి రౌడీలు బాగా హంగామా చేశారా మావాళ్లే అని చెప్తాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇదంతా అని సత్య అడిగితే నా జోలికి రాకుండా ఉండాలంటే ఇలాగే చేయాలంటాడు. ఒక్క క్షణం కూడా నీకు రెస్ట్ ఇవ్వనని కష్టాలు వస్తూనే ఉంటాయని అంటాడు. సత్య ఏడుస్తుంది. హర్ష, విశ్వనాథం బ్యాంక్ లోనికి వెళ్తారు. డబ్బు రావడానికి 10 రోజులు పడుతుంది అంటే వెనక్కి వెళ్లిపోతారు. తెలిసిన అందరికీ కాల్చేసి డబ్బు కావాలని డాక్యూమెంట్స్ ఇస్తానని అంటాడు. ఇక ఓ సేటు పది నిమిషాల్లో ఇంటికి వస్తా డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి అని అంటుంది. ఇక సత్య పుట్టింటికి వెళ్తానని అత్తకి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.