Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆదికేశవ్ ఇంట్లో లక్ష్మీని చూసేసిన సహస్ర ఫ్యామిలీ.. విహారి పెళ్లి విషయం బయట పడిపోతుందా!
kalavari kodalu kanaka mahalakshmi today episode చీరలు కొనడానికి వచ్చిన సహస్ర ఫ్యామిలీ ఆదికేశవ్ ఇంట్లో కనకమహాలక్ష్మీని చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
kalavari kodalu kanaka mahalakshmi serial today episode విహారి తిన్న తర్వాత కనకాన్ని ఆ ప్లేట్‌తో తినమని బామ్మ చెప్తుంది. విహారి మనసులో అందరి దృష్టిలో మేం భార్యాభర్తలం అయినా మనసులు కలవలేదని మేం మానసికంగా భార్యాభర్తలం కామని అనుకుంటాడు. ఇక కనకం విహారి తిన్న ఆకులో తొంటూ మహాప్రసాదంలా దండం పెట్టుకొని తింటే విహారి షాక్ అయి చూస్తాడు. తర్వాత బామ్మ విహారి కనకాలను ఒకే చోట కూర్చొపెట్టి చేతికి చిలకలు చుట్టి వాటిని మనవడికి తినిపించమని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు.
ఆదికేశవ్ విహారితో అల్లుడుగారు మా ఆచారాలతో ఇబ్బంది పడుతున్నారా అంటే అబ్బే అదేం లేదు అని కనకానికి చిలకలు తినిపించమని అంటాడు. ఆ జంటని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. మరోవైపు సహస్ర వాళ్లు పెళ్లి చీరలు నేయించడానికి ఆదికేశవ్ ఇంటికి వస్తారు. ఇక బంటి ఆది కేశవ్‌ని పిలిచి తీసుకెళ్తాడు. విహారి ఫ్యామిలీతో ఆదికేశవ్ మాట్లాడుతాడు. పెళ్లికి బట్టలు కావాలని పద్మాక్షి చెప్తే ఆదికేశవ్ ఇప్పుడే చూపిస్తానని అంటాడు. ఇక అంబిక విహారికి కాల్ చేయమని సహస్రతో చెప్తుంది. సహస్ర విహారి కాల్ చేస్తుంది. విహారి చాలా టెన్షన్ పడతాడు. లిఫ్ట్ చేయకూడదని సైలెంట్‌లో పెట్టేస్తాడు. సహస్ర మళ్లీ కాల్ చేస్తుంది. ఇక విహారికి పొలమారితే కనకం నీళ్లు తాగిస్తుంది. ఇక ఆదికేశవ్ చాలా చీరలను తీసుకొచ్చి పద్మాక్షి వాళ్ల ముందు ఉంచుతాడు.
పద్మాక్షి చీరలు చూస్తూ పొలమారితే కనకానికి నీళ్లు తీసుకురమ్మని ఆదికేశవ పిలుస్తాడు. కనకం తీసుకెళ్తుండగా రాజీ వచ్చి నేను తీసుకెళ్తా అంటుంది. దాంతో పద్మాక్షి కనకం వాళ్ల ఎదురు పడకుండా కాస్తలో తప్పించుకుంటారు. రాజీ నీరు తీసుకెళ్లి ఇస్తుంది. ఇక అంబిక సహస్రతో కాల్ బ్యాక్ చేయడం లేదు అంత బిజీనా మీ బావ అని అంటుంది. బిజినెస్ గురించి నీకు తెలీదా అంటుంది. ఇక మళ్లీ ఫోన్ చేయమని అంబిక అంటే సహస్ర బయటకు వెళ్లి కాల్ చేస్తుంది. ఇక్కడే ఉండి మాట్లాడాల్సింది కదా అని ఏంటో తెలిసుండేదని అనుకుంటుంది. ఇక సహస్ర కాల్ చేయడంతో విహారి ముఖ్యమైన కాల్ అని కనకంతో చెప్పి వెళ్తాడు. సహస్రకి కాస్త దూరంలోనే విహారి ఉంటాడు. ఒకరిని ఒకరు చూసుకోకుండా ఫోన్‌లో మాట్లాడుకుంటారు. చీరలు కొనడానికి వచ్చాం వీడియో కాల్ చేస్తా అని సహస్ర చెప్తే విహారి వద్దని అనేస్తాడు. ఎందుకు అంత కంగారు పడుతున్నావని సహస్ర అడిగితే ఆఫీస్‌లో ఉన్నా కదా అలా చీరలు జాకెట్లు చూస్తే బాగోదని అంటాడు. దాంతో సహస్ర ఫొటో తీసి పంపిస్తా అని అంటుంది.
చీరలేవీ నచ్చలేదని పద్మాక్షి అంటుంది. ఇక సహస్ర ఆదికేశవ్‌తో మా స్థాయికి తగ్గట్టు లేవని అంటుంది. అంబిక కూడా వీళ్ల స్థాయి అదీ ఇదీ అని మాట్లాడుతుంది. దాంతో ఆదికేశవ్ మీరు నచ్చిన డిజైన్లు చెప్తే నేసి ఇస్తామని అంటాడు. లోపల ఇంకా చాలా చీరలు ఉన్నాయని చెప్పి ఆదికేశవ్ చెప్తే పద్మాక్షి చూపించమని అంటుంది. దాంతో వాళ్లని ఆదికేశవ్ లోపలికి తీసుకెళ్తాడు. ఇక కనకం విహారితో మజ్జిగ తాగిస్తుంది. లోపలకి వెళ్లిన పద్మాక్షి వాళ్లలు ఆదికేశవ్ ఆవార్డులు చూస్తారు. యమున ఆ అవార్డుల గురించి అడిగితే చీరలకు వచ్చిన అవార్డులని చెప్తుంది. చేనేతలో అవార్డులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. మరోవైపు కనకం బయట నుంచి లోపలికి వస్తూ పద్మాక్షి, యమున వాళ్లని చూస్తుంది. వీళ్లంతా ఇక్కడికి ఎందుకు వచ్చారని అనుకొని చేతిలో ఉన్న మజ్జిగ గ్లాస్ కింద పడేస్తుంది. దాంతో అందరూ కనకాన్ని చూసేస్తారు. లక్ష్మీ అని పిలిచి అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!