Guppedanta Manasu Serial Today June 24th: వసుధార మీదికి రౌడీలు- అడ్రస్ చెప్తానన్న సరోజ – ఎంజెల్ మనుల పెళ్లి చేస్తానన్న శైలేంద్ర
Guppedanta Manasu Today Episode: వసుధార పీడను ఎలాగైన వదిలించుకోవాలని సరోజ, రౌడీలకు వసుధార గురించి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: మను, ఏంజెల్ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా శైలేంద్ర వచ్చి ఏం చేస్తున్నారు అని అనుమానిస్తాడు. దీంతో మను, ఏంజెల్ కోప్పడతారు. ఇంతలో దిక్కులేని వాళ్లకంతా మా కాలేజీ అడ్డగా మారింది అంటాడు శైలేంద్ర. మీరిద్దరూ ఎలాగూ ఇక్కడ కలుసుకుంటున్నారు. కదా నేను మీకు ఇద్దరికి పెళ్లి చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు ఎండీ సీటు త్యాగం చేయాలి. అనగానే మేము నీకు చెప్పామా? అని ఎంజెల్ అడుగుతుంది. అయితే ఇద్దరూ రోజు కలుస్తున్నారు కదా అనగానే ఏంజెల్, మను షాక్ అవుతారు. ఏంజెల్.. శైలేంద్రను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రంగ ఆటో క్లీన్ చేస్తుంటే లోపలి నుంచి వసుధార వస్తుంది.
రంగ: ఏంటి మేడం గారు రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చారేంటి?
వసుధార: ఇంట్లో బోర్ కొడుతుంది.
రంగ: టీవీ చూడొచ్చు కదా?
వసుధార: టీవీ కూడా బోర్ కొడుతుంది.
రంగ: అయితే నేనేం చేయలేను..
వసుధార: రిషి సార్... రిషి సార్.. రిషి సార్ మిమ్మల్నే
సరోజ: హమ్మయ్యా రిషి సార్ అంటే పలకలేదు..( అని మనసులో అనుకుంటుంది.) బావ రిషి కానీ రంగ నిన్ను పిలుస్తుంది.
రంగ: నా పేరు రిషి కాదు. రంగ మేడం గారు రిషి అంటే మీ పక్కన ఉన్నా పలకను. అదే రంగా అంటే అలంత దూరంలో ఉన్నా పలికేస్తా.. చెప్పండి మేడం గారు ఏంటి?
వసుధార: నన్ను కొంచెం బయటకు తీసుకెళ్తారా?
రంగ: ఎక్కడికి?
వసుధార: ఊరు చూపించడానికి.. ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పానుగా అందుకే
సరోజ: మా బావ ఎందుకు చూపించాలి?
వసుధార: నువ్వు చూపిస్తావా?
సరోజ: వామ్మో నీతో నేను వేగలేను.
వసుధార: సర్ చెప్పండి సర్ తీసుకెళ్తారా?
రంగ: అయినా మా ఊర్లో ఏం ఉందండి చూపించడానికి
అనగానే వసుధార మీకు మీ ఊరు కొత్తగా ఉండదు. మాలాంటి వాళ్లకు కొత్తగా ఉంటుంది. అనగానే రంగ ఆటో తీస్తాడు. అందరూ కలిసి ఊరు చూడటానికి ఆటోలో వెళ్తారు. ఆటోలో కూర్చున్న వసుధార రంగను చూస్తుంది.
రంగ: మేడం గారు ఇదే మా ఊరు
వసుధార: చూస్తున్నాను.. చాలా బాగుంది.
సరోజ: ఇది ఊరు చూడటం లేదు మా బావను చూస్తుంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. ( అని మనసులో అనుకుంటుంది.) వసుధార ఊరిని చూపిస్తున్నాడు మా బావ
వసుధార: చూస్తున్నాను..
సరోజ: ఊరు అటుంది. ఇటు లేదు..
వసుధార: నేను చూడాల్సిందే చూస్తున్నాను. మీ పని మీరు చూసుకోండి దేని మీద ఆశలు పెట్టుకోకండి.
సరోజ: బావ ఒక్క నిమిషం ఆపు దేని మీద ఆశలు పెట్టుకోకండి అని ఈవిడ నీతులు చెప్తున్నారు. ఆటో మీద కొటేషన్ రాపిద్దాం..
రంగ: సరోజ ఊరికే విసిగించకు
అంటూ రంగ సరోజను తిడతాడు. తర్వాత వసుధార తననే గమనిస్తుందని సైడు గ్లాసులో చూసి ఆటో ఆపి నేను ఊరు చూపిస్తుంటే మీరు ఎటో చూస్తున్నారు. మీరు అలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. అనగానే నేను చూడాల్సిందే చూస్తున్నాను అంటుంది వసుధార. దీంతో సరోజ కోపంగా ఆటో దిగితుంది. వసుధార, రంగ వెళ్లిపోతారు. ఇంతలో రౌడీలు వచ్చి వసుధార ఫోటో చూపించి ఈమెను ఎక్కడైనా చూశారా అని అడిగితే చూశానని ఇప్పుడే ఆటోలో వెళ్లిపోయిందని.. తను ఎక్కడుంటుందో కూడా తెలుసు అని చెప్తుంది. మరోవైపు వసుధార ఒక్క దగ్గర ఆపి కొబ్బరి బొండం తాగుదాం అంటుంది. ఇద్దరూ కలిసి బోండం తాగుతుంటే వసుధార ఏదేదో మాట్లాడుతుంది. దీంతో రంగ మీ ప్రవర్తన చూసినా ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఆ రిషి సార్ ఎవరో కానీ మిమ్మల్ని భరించారు అంటే అతనికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. అతనికి అదృష్టం ఉంది కాబట్టే మీకు దూరం అయిపోయి ఉంటారు. అనగానే వసుధార ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.