Kalki Advance Booking: ఫ్యాన్స్‌కి బుక్ మై షో షాక్ - ప్రభాస్ కల్కికి బదులుగా రాజశేఖర్ కల్కికి టికెట్స్ బుకింగ్, హౌజ్‌ఫుల్ కూడా..
ప్రభాస్ కల్కి మూవీ ఫ్యాన్స్‌కి బుక్ మై షో షాకిచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రభాస్ కల్కికి బదులుగా హీరో రాజశేఖర్ కల్కి మూవీకి టికెట్స్ బుక్స్ చేసుకున్నారు. థియేటర్లు హౌజ్ ఫుల కూడా అయ్యాయట..
![Kalki Advance Booking: ఫ్యాన్స్‌కి బుక్ మై షో షాక్ - ప్రభాస్ కల్కికి బదులుగా రాజశేఖర్ కల్కికి టికెట్స్ బుకింగ్, హౌజ్‌ఫుల్ కూడా.. Fans Gets Confused in Book My Show while Booking Tickets for Prabhas Kalki 2898 AD Movie Kalki Advance Booking: ఫ్యాన్స్‌కి బుక్ మై షో షాక్ - ప్రభాస్ కల్కికి బదులుగా రాజశేఖర్ కల్కికి టికెట్స్ బుకింగ్, హౌజ్‌ఫుల్ కూడా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/068be019a2ddfc24b7dce1267569ef3d1719163766682929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
A Shock to Fans in Book y Show:'కల్కి 2898 AD' ఆడియన్స్ బుక్‌మై షో షాకిచ్చింది. ప్రభాస్ కల్కి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న కొందరు ఆడియన్స్‌కి ఈ యాప్ చేదు అనుభవం ఎదురైంది. ప్రభాస్ కల్కి బదులుగా.. యాంగ్రీ మ్యాన్, నటుడు రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్ బుక్ అయ్యాయి. కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో కల్కి మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వం కల్కి టికెట్స్ రేట్స్ భారీ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. ఇకత తెలంగాణ కాస్తా ఆలస్యంగా అనుమతి ఇవ్వడంతో సాయంత్రం బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ చేశారు.
దీంతో మూవీ లవర్స్ అంతా అత్యుత్సాహంతో బుక్ మై షో టికెట్స్ కొనుగోలు చేశారు. గంట వ్యవధిలోనే భారీగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అయితే బుక్ మై షో కల్కి అని సెర్చ్ చేయగా హీరో రాజశేఖర్ మూవీ కూడా వస్తుంది. అయితే కొందరి అత్యుత్సాహంతో రాజశేఖర్ కల్కిపై క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకున్నారు. అంతా అయిపోయాక ఇది తెలిసి ఆడియన్స్ కంగు తింటున్నారు. ఇది కుకట్‌పల్లికి చెందిన ఓ థియేటర్లో రాజశేఖర్ కల్కికి టికెట్స్ కోనుగోలు చేశారు ఆడియన్స్. కాసేపటికి అది హౌజ్ ఫుల్ కూడా చూపించిందట. ఇక తప్పిదం చేసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో వేదికగా బుక్ మై షోకి దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పుడి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Hello there, if you have booked for Rajashekar's Kalki then do not worry the bookings are confirmed for Kalki 2898 AD only. The issue will be fixed soon --KR
— BookMyShow (@bookmyshow_sup) June 23, 2024
ఇక ఆడియన్స్ రిక్వెస్ట్‌లకు నేరుగా బుక్‌మై షో స్పందించింది. మేరకు బుక్ మై షో అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. "హాలో! మీరు రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్ బుక్ చేసుకున్నట్టయితే చింతించకండి. వాటిని మేము ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాకే పరిగణిస్తాము. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరించి మీకు తెలియజేస్తాం" అంటూ బుక్ మై షో యాజమాన్యం వెల్లడించింది. దీంతో రాజశేఖర్ కల్కికి టికెట్ బుక్ చేసుకున్న వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాగా ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కల్కి మూవీపై భారీ అంచనాలు నలెకొన్నాయి. సైన్స్ ఫిక్షన్, మైథాలజీకల్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, నటి శోభన, దిశా పటానీ వంటి భారీ తారగణం నటిస్తుంది. అంతేకాదు మరికొందరు స్టార్ నటీనటులు సైతం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కాబోతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)