Prema Entha Madhuram Today January 4th: ఆర్య పెళ్లి గురించి ఛాయా వాళ్లకు చెప్పిన హరీష్.. అనుని పెళ్లికి ఒప్పించే పనిలో పడ్డా ఆర్య!
Prema Entha Madhuram Today Episode: ఆర్య వాళ్లకి పెళ్లి చేయాలనుకుంటున్న సంగతి హరీష్, ఛాయ వాళ్ళకి చెప్పటంతో కథలో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Today Episode: ఇక ఈరోజు ఎపిసోడ్ లో పిల్లల్ని చూసుకొని ఏడుస్తూ ఉంటుంది అను.
సుగుణ : ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం పిల్లలు ఎంత బాధ పడితే ఆ పరిస్థితికి వచ్చి ఉంటారు. తను భార్యగా న్యాయం చేయాలనుకుంటుంది కానీ పిల్లల కు అన్యాయం చేస్తుందని మరిచిపోతుంది.
ఆర్య : తన మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం మంచిది కాదు అంటాడు.
సుగుణ: నా ఆలోచన తప్పు కాదు ధైర్యం చేసే ముందు అడుగు వేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది ఇక నేను తనకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను అంటుంది.
మరోవైపు హరీష్ ఇంటికి వచ్చి ఏం జరిగింది ఇందాక అమ్మ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తున్నారు అన్నావు ఎవరికి బాగోలేదు అని అడుగుతాడు.
దివ్య జరిగిందంతా చెప్తుంది.
హరీష్: పిల్లల చేత ఉపవాసం చేయించటం ఏమిటి అని మందలిస్తాడు.
దివ్య: మేమేమీ చేయమనలేదు వాళ్లే తండ్రి కోసం మొక్కుకొని ఉపవాసం చేస్తున్నారు. ఆవిడేమో భర్త ఎక్కడ ఉన్నాడు అనే విషయమే చెప్పదు. అందుకే అమ్మ రాధ గారికి మా అన్నయ్యకి పెళ్లి చేయాలని చూస్తుంది అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు హరీష్.
హరీష్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం ఏమిటి అని కంగారు గా అడుగుతాడు.
జ్యోతి: మా అన్నయ్య కి కూడా ఎవరూ పిల్లని ఇవ్వటానికి ముందుకు రావడం లేదు అలాగే ఆవిడకి కూడా ఒక తోడు దొరికినట్టుగా ఉంటుంది అందుకే అమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్తుంది.
నాకు అర్జెంటు పని ఉంది అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్. నేరుగా ఛాయ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ జరిగిందంతా చెప్తాడు. ఒకసారి గా షాక్ అవుతారు ఛాయా వాళ్ళు.
మాన్సీ : మనం ఇంత కష్టపడి వాళ్ళని విడదీసింది మళ్ళీ కలవటానికా అలా జరగకూడదు అంటుంది.
ఛాయ: వాళ్లకి పెళ్లి జరిగితే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఆనందం వస్తుంది అలా రాకూడదు అని కసిగా అనుకుంటుంది.
నేనుండగా అలా జరగనివ్వును అంటాడు జలంధర్.
ఛాయ: హరీష్ నువ్వు దివ్యతో టచ్ లో ఉండి అక్కడ ఏం జరుగుతుందో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పటంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు హరీష్.
మరోవైపు పిల్లలను చూసి ఏడుస్తూ ఉంటుంది అను.
సుగుణ : ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ముందే ఎందుకు ఊహించలేదు ఈ పరిస్థితి ఈరోజుతో ఆగిపోతుంది అనుకుంటున్నావా పిల్లలు మళ్లీ ఇలాంటి పరిస్థితిని తీసుకువస్తారు. ఇప్పటికైనా పిల్లలు పడే బాధ అర్థం చేసుకోకపోతే మళ్లీ మళ్లీ ఇదే జరుగుతుంది. అందుకే మా అబ్బాయి సూర్య ని పెళ్లి చేసుకోమని చెప్పాను ఈ పెళ్లి మీకు అవసరం లేకపోవచ్చు కానీ పిల్లలకి చాలా అవసరం అంటుంది.
సుగుణని అలా మాట్లాడొద్దంటూ ఉష, యాదగిరి మందలిస్తారు.
సుగుణ: నేను తన మంచి కోసమే చెప్తున్నాను నాకు కోపమే అర్థమవుతుంది కానీ నా బాధ అర్థం అవటం లేదు. రాధ ని ఒంటరిగా వదిలేయండి తను ఆలోచించుకుంటుంది అని చెప్పి ఆమెని ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు.
ఆ తర్వాత సూర్య అను దగ్గరికి వచ్చి మా అమ్మ మీతో అలా మాట్లాడి ఉండకూడదు అందుకు నేను సారీ చెప్తున్నాను అంటాడు.
అను : పిల్లలకి అలా అయిందన్న బాధలో ఆంటీ నన్ను మందలించారు అంతేగాని ఆవిడ కోపంతో ఏమీ అనలేదు నేను అర్థం చేసుకోగలను అంటుంది.
ఆర్య : మీరు అర్థం చేసుకుంటారని ఉద్దేశంతోనే మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. అమ్మ ఈ పెళ్లి గురించి నాతో మాట్లాడిందని మీకు తెలుసు, నేను ఒప్పుకున్న విషయం కూడా మీకు తెలుసు కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు అంటూ తనకధంతా చెప్పి నా భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందని నమ్మకంతో ఉన్నాను మీరు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోండి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
సూర్య: ప్రస్తుత పరిస్థితుల్లో చెక్కబడటానికి మాత్రమే అలా చెప్పండి. ఈ పెళ్లయ్యేలోపు మీ భర్తని వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది. మీ భర్త డీటెయిల్స్ ఇవ్వండి అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.