Prema Entha Madhuram Serial January 12th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్యకి అబద్ధం చెప్పిన యాదగిరి - తల్లి చెంతకు చేరిన పిల్లలు!
Prema Entha Madhuram Serial Today Episode: పిల్లలను తల్లి చెంతకు చేర్చిన ఆర్య ఆపై ఏం చేయబోతున్నాడు అనే క్యూరియాసిటీ కధ లో ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో 200 ఇచ్చి కొబ్బరి బొండాలు అన్నీ తీసుకోండి అంటాడు షాపతను. అప్పుడు అభయ్ జేబులో నుంచి రెండు రూపాయలు తీస్తాడు.
షాప్ అతను: 200 అంటే రెండు రూపాయలు తీస్తున్నావ్ ఏంటి దానితో ఏం చేసుకోమంటావు అంటాడు.
అక్కి: రెండు రూపాయలని తేలికగా తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది అంటుంది.
అభయ్ చెల్లెల్ని చూసుకోమని షాప్ అతనికి చెప్పి ఎక్కడికో వెళ్లి ఒక రంగు కాగితం తీసుకొని వస్తాడు.
షాప్ అతను: దాంతో ఏం చేస్తావ్ అని అడుగుతాడు.
అభయ్: బొండానికి ₹7 ఇస్తాను చెప్పింది చేయండి అంటాడు.
అభయ్ చెప్పినట్టు బల్బుకి ఆ రంగు కాగితం చుడతాడు షాపతను. దానివల్ల కొబ్బరి బోండాలు మంచి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. అభయ్ రేట్ బోర్డు మీద బొండం 15 అని రాస్తాడు. షాప్ అతను సరిగ్గా అమ్మలేకపోతే అభయ్ ఎలా అమ్మాలో చూపిస్తాడు. కొబ్బరి బొండాలన్నీ అమ్ముడుపోయిన తరువాత కాస్త డబ్బులు షాప్ అతను చేతిలో పెడతాడు అభయ్.
షాప్ అతను: కష్టం నాది డబ్బులు మీవి నా అంటాడు.
అభయ్: కష్టం నీదైనప్పటికీ ఆలోచన నాది అని చెప్పి డబ్బు అతని చేతిలో పెట్టి మిగిలిన డబ్బుతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కి, అభయ్.
మరోవైపు పిల్లలు దొరికారో లేదో అని ఆలోచనలో పడతాడు యాదగిరి అప్పుడే ఆర్య వస్తాడు.
యాదగిరి: పిల్లల జాడ ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు.
ఆర్య: లేదు అని చెప్పి లోపలికి వెళ్లబోతుంటే యాదగిరి ఎక్కడికి అని అడుగుతాడు.
ఆర్య : రాధగారితో మాట్లాడాలి అంటాడు.
యాదగిరి: ఏం మాట్లాడుతారు అని అడుగుతాడు. ఆర్య అతనిని షార్ప్ గా చూస్తాడు.
యాదగిరి: తడబడుతూ పిల్లలు కనిపించని కంగారులో ఉన్నారు ఎవరితోనూ మాట్లాడడం లేదు ఇప్పుడు మీరున్న స్పీడ్ లో ఆమెతో ఏం మాట్లాడతారో అని అడిగాను అంటాడు.
ఆర్య: పిల్లలపై జరుగుతున్న అటాక్స్ చూస్తుంటే వాళ్ళు నా పిల్లలేమో అని అనుమానంగా ఉంది రాధగారు అను ఏమో అనిపిస్తుంది అంటాడు.
యాదగిరి : కంగారుపడుతూ అను మేడం నాకు తెలుసు కదా సార్ ఈవిడ అను మేడం కాదు, పిల్లలు కూడా మీ పిల్లలు కాదు అని చెప్తాడు.
మనసులో మాత్రం నన్ను క్షమించండి ఆరోజు హనుమంతుడు సీతారాములను కలిపితే ఈరోజు సీతమ్మ కోరిక మేరకు ఈ హనుమంతుడు సీతారాములను విడదీస్తున్నాడు అని బాధపడతాడు. యాదగిరి మాటలు నమ్మిన ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఆటోలో వెళ్తున్న పిల్లల ఆటోని ఆపుతాడు ఆర్య. పిల్లలిద్దరూ పరుగెత్తుకుంటూ వచ్చి ఆర్యని హత్తుకుంటారు. ముగ్గురు బాగా ఎమోషనల్ అవుతారు.
మరోవైపు పిల్లలు దొరకలేదని ఏడుస్తూ ఉంటుంది అను.
ఉష: మీరేమీ బాధపడకండి మీరు పెళ్లికి ఒప్పుకున్నారని తెలిస్తే పిల్లలు వచ్చేస్తారు అంటుంది.
ఆ మాటలకి యాదగిరి, హరీష్ ఇద్దరు షాక్ అవుతారు.
అంతలోనే పిల్లల్ని తీసుకుని ఆర్య ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు పిల్లలిద్దరూ తల్లి దగ్గరికి వెళ్తారు వాళ్ళని పట్టుకొని నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలి నేను ఉండగలనా అని ఏడుస్తుంది అను.
పిల్లలు: మేము చెప్పిన మాట వినలేదని కోపం లో వెళ్లిపోయాం కానీ నువ్వు లేకుండా మేము ఉండలేము అంటారు.
సుగుణ: అయితే మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోతారా అమ్మ మీ కోసం ఎంత ఏడుస్తుందో తెలుసా అంటుంది.
దివ్య: చేసిన వెధవ పనికి నాలుగు తగిలించడం మానేసి బుజ్జగిస్తున్నావ్ ఏంటి అని తల్లిని మందలిస్తుంది.
సుగుణ: అన్నింటికి కొట్టడం పరిష్కారం కాదు నేను మిమ్మల్ని అలాగే కొట్టానా అని అడుగుతుంది.
పిల్లలిద్దరూ ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: సత్యభామ సీరియల్, జనవరి 12: ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్న సత్య!