అన్వేషించండి

Prema Entha Madhuram December 4th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: భార్యని చూసిన ఆనందంలో ఆర్య - వాళ్లను చంపేందుకు ఆలయంలోకి ప్రవేశించిన రౌడీలు

Prema Entha Madhuram Serial Today Episode: భార్యను చూసిన ఆనందంలో ఆర్య ఉండగానే అను అతని నుంచి తప్పించుకోవటంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.

Prema Entha Madhuram Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో గుడిలోకి ప్రవేశించిన ఆర్య భగవంతునికి దండం పెట్టుకుంటూ అను కనిపించేలాగా చేయు, కనిపించిన తర్వాత చావే మమ్మల్ని విడదీయాలి తప్ప మరేది మమ్మల్ని విడదీయకూడదు అని దండం పెట్టుకొని అనుని వెతకడం ప్రారంభిస్తాడు.

అనుని వెతుకుతున్న క్రమంలో అతని కాలికి కొబ్బరి చిప్ప గుచ్చుకొని గాయం అవుతుంది. అప్పుడే ఒంటినిండా విభూదితో శివుడి లాగా కనిపించే ఒక బాలుడు అక్కడికి వస్తాడు.

బాలుడు: నాతో రా అని చెప్పి ఆర్యని తనతో పాటు తీసుకెళ్లి ఒక పక్కన కూర్చోబెడతాడు.

ఆర్య : ఎవరు బాబు నువ్వు.

బాలుడు: కనిపించడం లేదా నేనే మహా శివుడిని.

ఆర్య : నీ వేషం కాదు బాబు నీ పేరు చెప్పు.

బాలుడు: అందరూ రకరకాల వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు పైగా నాది వేషం అంటారు. లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైకి మాత్రం అమాయకుడు అనే వేషం వేసుకొని తిరుగుతారు మనుషులంతా అంతే కదా.

ఆర్య: చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటూ ఉండగానే పూజ చేస్తున్న అను దగ్గరికి వెళ్లి ఆ బాలుడు  పసుపు ఇమ్మంటాడు.

అను: ఇవి పసుపు కుంకాలు బాబు వీటితో నీకేం పని.

బాలుడు: నీ పసుపు కుంకాల కోసమే అని అను ప్లేట్లో ఉన్న పసుపుని గుప్పెటలోకి తీసుకొని ఆర్య దగ్గరికి వెళ్లి కాలికి పెట్టుకోమంటాడు. తర్వాత ఆర్యతో ఇక నీకు కావాల్సింది వెళ్లి వెతుక్కో దొరుకుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో దొరికింది ఏది శాశ్వతం కాదు అసలు మనమే శాశ్వతం కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు సాధువుల వేషంలో గుడిలోకి ప్రవేశిస్తారు రౌడీలు.. వాళ్లకి మాన్సీ ఫోన్ చేస్తుంది.

మాన్సీ : గుడిలోకి వెళ్లారా, వాళ్లు మొహాలు గుర్తున్నాయి కదా వాళ్ళు అక్కడే ఉంటారు చంపిన తర్వాతే తిరిగి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

మరోవైపు ఆర్య అనుని వెతుకుతూ ఎక్కడ కనిపించకపోవడంతో పంతులు గారి దగ్గరికి వెళ్తాడు.

ఆర్య : పంతులుగారు నా భార్య కనిపించడం లేదని చెప్పాను కదా తను ఇప్పుడు కూడా ఎక్కడా ఉందో కనిపించడం లేదు ఒకసారి సిసి ఫుటేజ్ చూపించరా అనటంతో పంతులుగారు సిసి ఫుటేజ్ చూపిస్తారు. అందులో ఆర్యకి అను కనిపిస్తుంది.

మరోవైపు మాన్సీ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఎత్తకపోవడంతో మాన్సీ, ఛాయాదేవి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు.

మాన్సీ : టెన్షన్ పడుతున్న ఛాయాదేవితో గుడిలో చాలామంది ఉంటారు కదా ఎవరికి తెలియకుండా హత్య చేయాలంటే పెద్ద స్కెచ్ వేయాలి.

ఛాయాదేవి : ఆర్యకి అనుమానం రానంతవరకే మన ఆటలు సాగుతాయి ఆర్యకి ఏమాత్రం అనుమానం వచ్చినా మన పని అయిపోతుంది. వాళ్లతో పాటు మనం కూడా జైలుకు వెళ్లాల్సిందే.

మాన్సీ : నన్ను టెన్షన్ పెట్టకండి , వాళ్లు కచ్చితంగా ఆర్య వాళ్ళని చంపేలాగే కనిపిస్తున్నారు. చూస్తూ ఉండండి వాళ్ళ దగ్గర నుంచి మనకి గుడ్ న్యూస్ వస్తుంది.

ఛాయాదేవి : రావాలి, ఆ అను, ఆర్య చచ్చారు అనే వార్త రావాలి అని కోపంగా అంటుంది.

మరోవైపు దీపాలు వదులుతున్న అనుని చూసి ఆనందంతో గట్టిగా పిలుస్తాడు ఆర్య. అను కంగారు పడిపోతూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది.

ఆర్య : ఆమెని వెతుకుతూ నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు, బయటికి రా అని గట్టిగా పిలుస్తాడు. నాకు ఏదో ప్రమాదం వస్తుంది అని కదా వెళ్ళిపోయావు అదంతా అబద్ధం అని గట్టిగా చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ ఇంటికెళ్లిన కావ్య, రాజ్‌ - స్వప్నను ఇంటికి తీసుకెళ్లమన్న రుద్రాణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget