(Source: Poll of Polls)
Prema Entha Madhuram December 26 Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చావకూడదంటున్న జలంధర్, తల్లిదండ్రులను కలపటానికి పిల్లలు వేసిన మాస్టర్ ప్లాన్!
Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం తల్లిని ల్యాండ్ పేపర్స్ అడుగుతాడు ఆర్య. కొడుక్కి నిజం చెప్పటానికి భయపడుతున్న సుగుణ కొడుక్కి నిజం చెప్తుందా?
Prema Entha Madhuram Telugu Serial Today Episode: ఆర్య దగ్గరికి వెళ్ళు ఆర్య ప్రేమని గెలిపించు అంటుంది ఆత్మ.
అను : ఆశలు చంపుకొని జీవిస్తున్నాను మళ్ళీ నాలో ఆశలు రేపొద్దు. నావల్ల సార్ కి ఏమైనా అయిందంటే నన్ను నేను క్షమించుకోలేను.
ఆత్మ: ఆర్య మనసు గాయపడితే నేను భరించలేను. ప్రేమే ప్రాణమైనప్పుడు ప్రేమలేని ప్రాణం విలువ లేనిది.
అను : ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది.
ఆత్మ: కానీ ప్రేమని త్యాగం చేయడం పిచ్చి పని నువ్వు చేసిన పిచ్చి పని నేను చేయను ఇప్పుడే ఆర్య దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తాను అంటుంది.
వద్దు అంటూ తుళ్లిపడి నిద్ర లేస్తుంది అను. పక్కనే ఉన్న ఉష ఏదైనా పీడకల వచ్చిందా మొఖం కడుక్కొని మంచినీళ్లు తాగి పడుకోండి అంటుంది. సరే అని బయటికి వచ్చిన అనుకి పిల్లలని పడుకోబెట్టుకొని కూర్చుని నిద్రపోయిన ఆర్యని చూసి బాధపడుతుంది.
అను : మీ పిల్లలు కాకపోయినా ఎంత బాగా చూసుకుంటున్నారు, అదే మీ పిల్లలు అని తెలిస్తే ఇంకా ఎంత బాగా చూసుకుంటారో మీకు పిల్లల ప్రేమని వాళ్లకి తండ్రి ప్రేమని దూరం చేస్తున్నందుకు బాధగా ఉంది కానీ విధి మిమ్మల్ని కలుపుతుంది. అలా అయినా నా తప్పు సర్దుకుంటాను అనుకుంటుంది.
మరోవైపు జైలుకు వచ్చి జలంధర్ ని కలుస్తారు మాన్సీ, ఛాయాదేవి.
ఛాయాదేవి: నేను లాయర్ తో మాట్లాడాను నీకు బెయిల్ తప్పకుండా దొరుకుతుంది అన్నారు.
మాన్సీ :కొంచెం ఓపిక పట్టండి మీరు బయటకు వచ్చిన తర్వాత ఆర్య మీద రివెంజ్ తీర్చుకుందాం అంటుంది.
ఛాయాదేవి: అవునన్నయ్య మనం ఆ ఆర్య ని ప్రాణాలతో వదలకూడదు.
జలంధర్: ఆర్య ప్రాణాలతోనే ఉండాలి కానీ అతనికి ప్రశాంతత ఉండకూడదు. బ్రతికే ఉండాలి కానీ భరించలేని బాధలు భరించాలి అలా జరగాలంటే ఆర్య కి నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. నేను బయటకు రాగానే ఆర్య పిల్లలని, అనుని చంపేస్తాను. ఏ ఆశ లేకుండా ఏ తోడు లేకుండా బ్రతికే ఆర్యని నేను చూడాలి అని ఆవేశంగా చెప్తాడు.
మరోవైపు తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు.
అక్కి : ఫ్రెండే మన నాన్న అని తెలిసిన తర్వాత ఆయనని ఫ్రెండ్ అని పిలవాలనిపించడం లేదు అంటుంది.
అభయ్: నాక్కూడా అలాగే ఉంది.
అక్కి: మనం అమ్మానాన్న కలిసేలాగా ఏదైనా ప్లాన్ చేయాలి.
అభయ్: ఏం చేద్దాం.
అక్కి : నువ్వు అమ్మని టెర్రస్ మీదకి తీసుకురా నేను ఏదో ఒకటి చెప్పి ఫ్రెండ్ ని కూడా మేడ మీదకి తీసుకొని వస్తాను అప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు అని ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ ప్రకారం అక్కి ఆర్య ని డాబా మీదకి తీసుకువస్తుంది.
ఆర్య : ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు.
అక్కి : ఆకాశంలో రెయిన్బో వచ్చింది కదా ఎంత బాగుందో చూడు నాకు వాటితో ఫొటోస్ తీయు అని చెప్తుంది.
ఆర్య ఫోటోలు తీస్తూ ఉంటాడు కానీ అక్కి మాత్రం అభయ్ ఇంకా తల్లిని తీసుకురాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది. అభయ్ ఎంతకీ రాకపోవడంతో ఆర్యని మాటల్లో పెడుతుంది.
అక్కి : నీక్కూడా పిల్లలు ఉన్నారు అన్నావు కదా వాళ్లు ఎందుకు నీ దగ్గర ఉండటం లేదు వాళ్లు కూడా నాలాగే ఉంటారా..
ఆర్య : నాకు పిల్లల గురించి చాలా విషయాలు తెలియదు నాకు ఎనిమీస్ ఎక్కువ కదా అందుకే వాళ్ళని దూరంగా ఉంచాను అని అబద్ధం చెప్తాడు.
ఇంతలో అభయ్ తల్లిని తీసుకువస్తాడు అను వస్తూనే డాబా మీద ఆర్యని చూస్తుంది. కనిపించకూడదని కాలికి దెబ్బ తగిలినట్టుగా ఆక్ట్ చేయడంతో అక్కడికి సుగుణ వాళ్ళు వచ్చి అనుని తీసుకొని వెళ్ళిపోతారు.
అభయ్: అమ్మకి నాన్నని కలవడం ఇష్టం లేదు అందుకే ఇలా చేసింది.
అక్కి : మరెప్పుడూ ఇలా చీట్ చేయకూడదు మాలలో ఉన్నాం కదా అయ్యప్ప స్వామి అంతా చూసుకుంటాడు అంటుంది.
ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం సుగుణ ని ల్యాండ్ పేపర్స్ అడుగుతాడు ఆర్య. ఏం చెప్పాలో తెలియక కంగారుపడుతుంది సుగుణ.
సుగుణ : అను దగ్గరికి వెళ్లి ఇప్పుడు పేపర్స్ లేవని చెప్తే ఏమనుకుంటాడో నాకు కంగారుగా ఉంది నువ్వు వెళ్లి సూర్య తో చెప్పు అని రిక్వెస్ట్ చేస్తుంది.
అను: నేను చెప్తే బాగోదు మీరే వెళ్లి చెప్పండి ఆయన అర్థం చేసుకుంటారు అని చెప్పడంతో కొడుకు దగ్గరికి వెళుతుంది సుగుణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.