అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today September 5th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్, గౌరిల జాతకం చెప్పిన సోదమ్మ – అకిని తిట్టిన అభయ్

Prema Entha Madhuram Today Episode: సోదమ్మ చెప్పిన జాతకం విని శంకర్, గౌరిలు షాక్ అవుతారు. నీలాంటి వాణ్ని నేను అసలు పెళ్లి చేసుకోను అని గౌరి, శంకర్ తో అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: శంకర్‌, గౌరికి బొట్టు  పెడతాడు. దీంతో పక్కన చూస్తున్న అందరూ షాక్‌ అవుతారు. శ్రావణి అక్కా ఏంటి నువ్వు శంకర్‌ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? ఆయన నీకు బొట్టు పెట్టడం ఏంటి? అని అడుగుతుంది. దీంతో యాదగిరి ఏదో ఒకటి చెప్పి మేనేజ్‌ చేస్తాడు. దీంతో శ్రావణి ఇదంతా ఆంటీ పూజ చేసుకున్నట్లు లేదు. మా అక్క కొత్తగా పెళ్లి చేసుకుని పూజ చేసుకున్నట్లు ఉంది అంటుంది. వెంటనే యాదగిరి పదండి భోజనం చేద్దాం రండి అంటాడు. అందరూ వెళ్లిపోతారు. గౌరి మాత్రం అలాగే నిలబడి ఆలోచిస్తుంది. శంకర్‌ వచ్చి భోజనానికి తీసుకెళ్తాడు. భోజనాలు అయ్యాక అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు.

శంకర్‌: ఏమాటకు ఆ మాట చెప్పాలి కానీ భోజనాలు అయితే అత్యధ్బుతంగా ఉన్నాయి బాబాయ్‌.

జ్యోతి: భోజనంతో పాటు ఈ తాంబూలం కూడా వేసుకోండి.

యాదగిరి: సార్‌ నాకు మాత్రం మా ఆవిడ కిళ్లి చుట్టి ఇవ్వాల్సిందేనండి ఈ ఒక్క పని మాత్రం ఫర్పెక్టుగా చేస్తుందండి.

జ్యోతి: చాల్లేండి సంబరం... అవును అమ్మాయిలు మీకు కిల్లి కట్టడం వచ్చా.. సరే ఇప్పుడు నేను కిల్లి కడతాను. మీరిద్దరూ చూసి నేర్చుకోండి.

అని జ్యోతి కిల్లి కట్టి యాదగిరికి ఇస్తుంది. అది తిన్న యాదగిరి చాలా బాగుందని చెప్పగానే మీకైతే పిన్నిగారు ఉన్నారు. చుట్టిచ్చారు మాకెవరు ఇస్తారు అని శంకర్‌ అడగ్గానే జ్యోతి ఆ వీళ్లు ఉన్నారు కదా? ఇప్పుడు చూశారు కదా మీకు చుట్టి ఇస్తారు అని చెప్తుంది. దీంతో గౌరి, శ్రావణి కిల్లిలు చుట్టి ఇస్తారు. శంకర్‌, పెద్దొడు తిని చాలా బాగుంది అంటారు. ఇంతలో సోది చెప్పే ఆవిడ వస్తుంది. ఆమెను జ్యోతి లోపలికి పిలుస్తుంది. లోపలికి వచ్చిన సోదమ్మ, శంకర్‌కు సోది చెప్తుంది.

సోదమ్మ: నీది మహా జాతకం దొర. జన్మజన్మల బంధం నీ జతకడుతుంది దొర. నీ జీవితాన్ని అద్బుతంగా మార్చేస్తుంది. ఆ అదృష్ట లక్ష్మీ నీ జీవితంలోకి వచ్చేసింది. నువ్వే తెలుసుకుని కలుసుకోవాలి.

శంకర్‌: సూపర్‌ అమ్మా థాంక్యూ..

శ్రావణి: అక్కా నువ్వు కూడా చెప్పించుకో అక్కా..

సొదమ్మ: చెయ్యి ఇయ్యే తల్లి.. కళ్యాణ ఘడియలు చెంగు చెంగుమంటు నీ వైపే వస్తున్నాయే కూన. నీకు అన్ని విధాలా అండగా ఉండే వాడు నీకు మొగుడుగా రాబోతున్నాడే తల్లి. మీది జన్మజన్మల బంధమే తల్లి.

జ్యోతి: పెళ్లి కుదరాలే కానీ నీకు పట్టుబట్టలు, పట్టీలు పెడతాం సోదమ్మా..

శ్రావణి: అదేంటి అక్కది ఈయనది జాతకాలు ఒకేలా ఉన్నాయి.

పెద్దొడు: కొంపదీసి అన్నయ్య గౌరి గారినే పెళ్లి చేసుకోబోతున్నాడా? ఏంటి? అదే కాని జరిగితేనా? మన లైన్‌ క్లియర్‌ అయిపోతుంది.

జ్యోతి: సమయానికి వచ్చి మంచి మాట చెప్పావు. నీకు వాయనం ఇస్తాను పదండి.

గౌరి: శంకర్‌ గారు ఇద్దరి గురించి ఆవిడ ఏదేదో చెప్పింది.

శంకర్‌: ఆవిడ చెప్పడం సరే మనవాళ్లను చూశారా? మనల్నే గమనిస్తున్నారు వాళ్లు.

గౌరి: ఏదైనా డౌట్‌ వచ్చిందంటారా? నిజం తెలిసిపోయిందంటారా?

శంకర్‌: అరె మీరేంటండి బాబు మనం నిజంగా లవర్స్‌ అన్నట్లు అలా మాట్లాడతారేంటి?

గౌరి: అంటే నా ఉద్దేశం కపుల్‌ కాంటెస్ట్‌ కు ఇద్దరం కలిసి వెళ్లాము కదా అది తెలిసిపోయిందా?

 అని గౌరి అడగ్గానే అలా ఏం తెలిసి ఉండదని శంకర్‌ అంటాడు. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. సోదమ్మను ఎవరో కావాలని అరెంజ్‌ చేశారని గౌరి, శంకర్‌, శ్రావణి, పెద్దొడు, చిన్నోడు, సంధ్య అనుమానిస్తారు. తర్వాత ఇంటికి వెళ్లిన అకి జ్యోతి ప్లాన్‌ చేసి గౌరి, శంకర్‌ దగ్గర అయ్యేలా ఎలా చేసిందనేది మొత్తం చెప్తుంది. దీంతో జెండే నేను చాలా మిస్‌ అయ్యానన్నమాట అంటాడు. ఇంతలో అభయ్‌ వచ్చి అకి ఉదయం నుంచి కనిపించలేదని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. జ్యోతి అత్తయ్య వరలక్ష్మీ వ్రతం చేస్తుంటే అక్కడికి వెళ్లాను. అని చెప్పగానే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని కోప్పడి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణను చంపేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్ – రాహుల్ ను వదిలేసిన పోలీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget