Prema Entha Madhuram Serial Today September 18th:‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: సంధ్యకు ఐలవ్యూ చెప్పిన చిన్నోడు – గౌరిని చంపేస్తానన్న రాకేష్
Prema Entha Madhuram Today Episode: తన చెల్లెల్ల జాబ్ కోసం వెళ్లిన గౌరి దగ్గరకు రాకేష్ ముసుగు వేసుకుని వచ్చి నీ చావును నేను అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: జ్యోతి రవికి జాబ్ కావాలని అడగ్గానే జెండే ఇప్పుడైతే ఏమీ లేవని చెప్తాడు. ఇంతలో రాకేష్. రవిని అకికి హెల్ప్ చేయడానికి అపాయింట్ చేస్తే బాగుంటుంది కదా అంటాడు. దీంతో అభయ్ రియల్లీ గుడ్ ఐడియా అంటాడు. యాదగిరి మాత్రం వద్దని చెప్తాడు. అకి కూడా తనను సెక్యూరిటీగా పెట్టుకోవడం ఇష్టం లేదు అంటుంది. దీంతో సెక్యూరిటీ అని ఎవరన్నారు తను నీతో పాటు ట్రావెల్ చేస్తే అన్ని విషయాలు తెలుసుకుంటాడు అని అభయ్ చెప్తాడు. దీంతో జ్యోతి హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ భోజనం చేయడానికి వెళ్తే రవి మాత్రం రాకేష్‌కు థాంక్స్ చెప్తాడు. మరోవైపు పాండు చెప్పిన ఆఫీసుకు వెళ్తుంటుంది గౌరి.
గౌరి: ఎలాగైనా ఆయన్ని కలిసి చెల్లెల్లకు జాబ్ వచ్చేలా రిక్వె్స్ట్ చేసుకోవాలి. స్టడీస్ అయిన వెంటనే జాబ్ వస్తే ఇక వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారు.
శంకర్ ఫోన్ చేస్తుంటే.. పాడుం చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేయదు గౌరి.
శంకర్: గౌరి గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు? కొపదీసి సెపరేట్ గా ఈవెంట్ ప్లాన్ చేస్తుందా? ఏంటి. అయినా ఆవిడ అలాంటి మనిషి కాదు.
అనుకుని శంకర్ రెడీ అవుతుంటాడు. మళ్లీ గౌరి వెళ్లినప్పుడు జరిగిన సీన్ మరోసారి గుర్తు చేసుకుంటాడు శంకర్. ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుమానిస్తాడు. ఇంతలో కింద శ్రావణి, సంధ్య.. పైన చిన్నొడు, పెద్దొడు గౌరి, శంకర్ ల కోసం చూస్తారు. ఇద్దరూ కనిపించకపోవడంతో.. చిన్నొడు కిందికి వెళ్లి కనుక్కుంటానని చెప్పి కిందకు వస్తాడు. సంధ్య కూడా పైకి వెళ్లి శంకర్ ను కనుక్కుంటానని వెళ్తుంది. మధ్యలో సంధ్య, చిన్నొడు ఎదురుపడతారు.
సంధ్య: నేను నీ కోసమే వస్తున్నాను.
చిన్నోడు: నేనే మీ కోసమే వస్తున్నాను.
సంధ్య: మీకోసం అంటే మా అక్క కనబడలేదు. శంకర్ గారికి తెలుసేమోనని.. అడుగుదామని వస్తున్నాను.
చిన్నోడు: మా అన్నయ్య కూడా లేరు. అంటే వాళ్లిద్దరూ ఈవెంట్ పని మీద వెళ్లి ఉంటారు.
సంధ్య: అదే అయ్యి ఉంటుంది.
చిన్నోడు: థాంక్యూ సో మచ్..
సంధ్య: దేనికి..?
చిన్నోడు: చీటి విషయం బయటపడి అందరికీ తెలిసిపోతుందేమోనని భయపడ్డాను. బట్ లక్కీగా మీరు నన్ను సేవ్ చేశారు.
సంధ్య: ఆరోజు కలిసి ఏదో విషయం మాట్లాడాలి అన్నారు ఏ విషయం గురించి
చిన్నోడు: ఏ విషయం గురించో మీకు తెలియదా?
సంధ్య: మీరు చెబితేనే కదా నాకు తెలిసేది.
చిన్నోడు: మీకు తెలుసని నాకు తెలుసులే..
సంధ్య: అయితే చెప్పరా..అయితే నేను వెల్లిపోతాను.
అని సంధ్య వెళ్లిపోతుంటే.. చిన్నోడు చెయ్యి పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. తర్వాత చిన్నోడు సంధ్యను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. దీంతో సంధ్య హ్యాపీగా ఐ లవ్యూ చెప్పబోతుంటే శ్రావణి వచ్చి ఏంత ధైర్యం నీకు అంటూ తిడుతుంది. ఇంతలో పెద్దోడు వస్తాడు. చిన్నోడి ప్రేమ విషయం తెలిసిపోయినట్టు ఉందని.. ఇదంతా ఫ్రాంక్ అని చెప్పగానే సంద్య చిన్నోడు కూడా అవునంటారు. శ్రావణి సారీ చెప్తుంది. మరోవైపు గౌరి నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్తుంది. గౌరిని చూసి రాకేష్ ముసుగు వేసుకుంటాడు. శంకర్ గౌరిని వెతుక్కుంటూ వెళ్తాడు. మధ్యలో యాదగిరి కలుస్తాడు. ఇద్దరూ కలిసి వెతుకుతుంటారు. మరోవైపు బిల్డింగ్ పైకి వెళ్లిన గౌరి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. ఇంతలో రాకేష్ రాగానే ఎవరు నువ్వు అని అడుగుతుంది. దీతో రాకేష్ నీ చావును అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు