Prema Entha Madhuram Serial Today Fabruary 6th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: సంతోషంలో నిజం బయటపెట్టిన గౌరి – గౌరి చేష్టలకు షాక్ అయిన శంకర్
Prema Entha Madhuram Today Episode: పంతులు వచ్చి గౌరిని నీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే గౌరి, శంకర్‌ను చూపిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: మీ ఇద్దరి బిల్డప్ చూశాక మీ ప్రేమ గురించి శంకర్ గారికి కూడా మీ ప్రేమ గురించి అర్థం అయి ఉంటుంది అని చెప్తుంది శ్రావణి. శ్రావణి మాటలకు చిన్నోడు, పెద్దొడు కంగారు పడతారు. ఏంటండి మీరు అనేది అంటూ చిన్నొడు అడిగితే.. పెద్దొడు మా అన్నయ్యకు మన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది అన్నమాట అంటాడు.
శ్రావణి: హలో మన లవ్ మ్యాటరేంటి..? నువ్వు ప్లూరల్.. ఓన్లీ సింగిల్.. వాళ్ల లవ్ మ్యాటర్.. మనది ఓన్లీ నాటకం. మర్చిపోయారా..?
పెద్దొడు: నేను మర్చిపోయినా.. మీరు గుర్తు పెట్టుకున్నారు కదా..?
చిన్నోడు: అమ్మో ఇప్పుడు ఏంటి మన పరిస్థితి..
సంధ్య: ఏముంది శంకర్ గారు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం.. శ్రావణి చెప్పినట్టు మన గురించి అర్థం అయ్యే ఉంటుంది. కాబట్టి మనమే వెళ్లి ఓపెన్ అయితే బాగుంటుంది. అంతే సింపుల్
చిన్నొడు: అమ్మో నాకు భయం..
సంధ్య: అంటే మన ప్రేమ గురించి మీ అన్నయ్యకు అసలు చెప్పవా..? నన్ను టైం పాస్‌కు లవ్ చేశావా..? అసలు నీ ప్రేమంతా నాటకమా..?
చిన్నోడు: ఏయ్ ఆపు.. నీ మీద నా ప్రేమ నిజం కానీ ఆ విషయం అన్నయ్యతో చెప్పడానికే భయం. పైగా అన్నయ్య మాకన్నా పెద్దవాడు. సో అన్నయ్య పెళ్లి జరగాలి కదా ఫస్ట్.
శ్రావణి: వీళ్ల ప్రేమ సెట్ చేయడానికే కదా మనం లేనిపోని డ్రామాలన్నీ చేశాం. కానీ ఎక్కడా మీ అన్నయ్యా ఏమాత్రం ఫార్వార్డ్ అవ్వలేదు.
పెద్దొడు: అంటే అన్నయ్యకు కొంచెం టైం పడుతుంది.
శ్రావణి: అంటే ఇప్పుడు అంతవరకు మా సంధ్య వెయిట్ చేయాలా..?
పెద్దొడు: అది కాదు శ్రావణి గారు మా అన్నయ్యకు మా మీద ఎంతో నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నపళంగా వీళ్ల ప్రేమ విషయం చెప్పాలి అంటే.. అది చెప్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఒకవేళ మా అన్నయ్య అర్థం చేసుకుని వీళ్ల పెళ్లికి ఓకే చెప్పినా మీ అక్క ఒప్పుకోకపోతే.. వీళ్లు ప్రేమ విషయం చెప్పగానే మా అన్నయ్యకు గౌరి గారికి గొడవ అయితే.. మాట్లాడుకోవడానికి కూడా చాన్స్ ఉండదు.
చిన్నోడు: ఎలాగో మా అన్నయ్యకు మీ అక్కతోనే పెళ్లి సెట్ చేయాలనుకుంటున్నారు కదా..? ఆ పెళ్లి తర్వాతే కదా మన పెళ్లి కూడా..?
సంధ్య: అవుననుకో కానీ మీ అన్నయ్య ఇలాగే లేట్ చేస్తే మా అక్కకు వేరే వాళ్లతో సెట్ చేస్తాను.
శ్రావణి: అది ఎలా కుదురుతుందే వాళ్లిద్దరిదీ గతజన్మ కదా..?
సంధ్య: నువ్వు ఊరుకో వాళ్లను ఇలా భయపెడితేనే మాట వింటారు.
శ్రావణి: ఓకే ఓకే
అని ఇద్దరూ బెదరించడంతో పెద్దొడు, చిన్నోడు మీరు అంత పెద్ద డిసీజన్ తీసుకొవద్దని మా అన్నయ్యను ఎలాగో ఒప్పిస్తామని అంటారు. ఇలా ఓప్పిస్తామని నాంన్చితే నేనే మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి నేనే మొత్తం చెప్పేస్తాను అంటుంది సంధ్య. దీంతో చిన్నొడు షాక్ అవుతాడు. దీంతో చెప్పింది గుర్తు ఉంది కదా..? కాదు కూడదు అన్నయ్య అంటే భయం వేస్తుంది అంటే జాగ్రత్త.. అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తుంది సంధ్య. ఇన్ని రోజులు సంధ్య సాఫ్ట్ అనుకున్నానురా అంటాడు చిన్నోడు. రూంలో గౌరి బెడ్ అంతా సర్దుతుంది. శంకర్ వస్తాడు.
శంకర్: థాంక్యూ గౌరి గారు నాకు శ్రమ లేకుండా బెడ్ అంతా నీటుగా సర్దేశారు. ఇక నేను హ్యాపీగా నిద్రపోతాను.
గౌరి: అమ్మా అంత అలిసిపోయేంతగా ఈరోజు ఏం చేశారు మీరు.
శంకర్: ఆ విషయం ఎందుకు అడుగుతారు లేండి. హైదరాబాద్ మొత్తం అటు ఇటూ తిరిగేశాను. మళ్లీ ఎందుకు తిరిగారు అని మాత్రం అడగకండి నాకు చెప్పే ఓపిక లేదు.
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే… చిన్నోడు, శంకర్‌కు.. సంధ్య, గౌరికి ఫోన్ చేస్తారు. ఇద్దరూ ఒక ముఖ్యమైన విషయం చెప్తామని అంటారు. ఏంటో చెప్పమని అడగ్గానే.. డైరెక్టుగా చెప్తామని అంటారు. సరేనని ఫోన్ కట్ చేస్తారు. మరుసటి రోజు శంకర్ తన తమ్ముళ్లను గౌరి తన చెల్లెల్లను ఇంటికి పిలుస్తారు. పంతులు కూడా వస్తాడు. పంతులుతో గౌరి వీళ్లిద్దరూ నా చెల్లెల్లు వీళ్లకు మంచి సంబంధాలు ఉంటే చూడండి అంటుంది. దీంతో చిన్నోడు, పెద్దోడు, శ్రావణి, సంధ్య షాక్ అవుతారు. ఇంతలో పంతులు గౌరిని మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడుగుతాడు. సంతోషంలో ఉన్న గౌరి ఈ అనురాధకు ఆ ఆర్యవర్థన్ కావాలి అని చెప్తుంది. గౌరి మాటలకు శంకర్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















