అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: విడిపోనున్న గౌరి, శంకర్‌ - అమ్మా నాన్నలను కలిపేందుకు రంగంలోకి దిగిన అకి

Prema Entha Madhuram Today Episode: గౌరి, శంకర్ మద్య గొడవ పెద్దది కావడంతో ఇద్దరిని కలిపేందుకు అకి వాళ్ల ఇంటికి బయలుదేరడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: అకి మీద కోప్పడ్డ అభయ్‌ను మందలిస్తాడు జెండే. ఇదేనా నీకు నేను నేర్పింది అంటూ ప్రశ్నించడంతో అకి కోపంగా మీరెన్ని చెప్పినా సరే అకి చేసింది కరెక్టు కాదని వెళ్లిపోతాడు. దీంతో అకి ఏడుస్తుంది. రాకేష్‌ మాత్రం నువ్వేం ఫీలవకు అంటూ ఓదార్చినట్లు నటిస్తాడు. ఎనీవే కంగ్రాట్స్‌ అటూ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతే అకి నార్మల్‌గా థాంక్స్‌ చెప్తుంది. దీంతో రాకేష్‌ గిల్టీగా ఫీలవుతూ వెళ్లిపోతాడు. అకిని ఓదారచ్చిన జెండే బయటకు వెళ్లి రాకేష్‌ను పిలిచి వార్నింగ్‌ ఇస్తాడు. రిసార్స్ట్‌ లో జరిగిన విషయాలు మొత్తం అభయ్‌ ఎందుకు చెప్పావని నిలదీస్తాడు. దీంతో రాకేష్‌ షాక్‌ అవుతాడు. తర్వాత శంకర్‌ కోసం యాదగిరి వస్తాడు.

యాదగిరి: శంకర్‌ సార్‌… శంకర్‌ సార్‌..

శ్రావణి: అంకుల్‌ మీరు వెతుకుతున్న వాళ్లు పైనున్నారు. ఇక్కడెవరు లేరు.

యాదగిరి: పై పోర్షనా..? అదేంటమ్మా అందరూ కలిసే కదా ఉంటున్నారు.

గౌరి: అదంతా నిన్నటి వరకు మాత్రమే. ఇప్పుడు కాదు. మీకు నాతో ఏమైనా అవసరం ఉంటే రండి. ఆ మనిషి కోసమైతే పైకెళ్లండి.

యాదగిరి: అసలు ఏం జరిగింది మేడం.

అని యాదగిరి అడగ్గానే గౌరి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది.  దీంతో యాదగిరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ఇంతలో శంకర్‌ బయటకు వచ్చి నా మీద చాడీలు చెప్తుందా? అని అడుగుతాడు. లేదని యాదగిరి అంటాడు. దీంతో ఒక అమ్మాయి ప్రమాదంలో ఉంటే సాయం చేయడం తప్పా? అంటాడు. దీంతో గౌరి, శంకర్‌ ఇద్దరూ యాదగిరితో ఓ ఆటాడుకుంటారు.   

శంకర్‌: అయినా ఆవిడ గారితో మాట్లాడకుండా ఉండిపోతే నాకేం టైం పాస్‌ కాదా ఏంటి? అంతగా అల్లాడిపోవడానికి మాదేమైనా పూర్వజన్మలో విడదీయలేని బంధమా?

యాదగిరి: అవును సార్‌..

 గౌరి: అంకుల్‌ రండి.. విడదీయలేని బంధం కాదు కదా? అసలు వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఈ ఇంటికి వచ్చి తప్పు చేశాను రేపే ఖాలీ చేస్తాను.

యాదగిరి: మీరు అసలు అలాంటి డిసీజన్స్‌ తీసుకోకండి మేడం.

అంటూ ఇద్దరి మధ్య అటూ ఇటూ తిరుగుతూ యాదగిరి అలసి పడిపోతాడు. తర్వాత వీళ్లను ఇలాగే వదిలేస్తే విడిపోతారేమోనని అకికి ఫోన్‌ చేస్తాడు యాదగిరి. ఇక్కడ మీ అమ్మా నాన్నల మధ్య యుద్దం మొదలైదని చెప్తాడు. అకి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లబోతుంటే.. జెండే వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. అక్కడ అమ్మానాన్నలు గొడవపడుతున్నారట అని చెప్పగానే జెండే నవ్వుతాడు.

అకి: అమ్మా నాన్న గొడవ పడుతున్నారంటే నవ్వుతున్నావేంటి ఫ్రెండ్‌.

జెండే: అకి అను, ఆర్యలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అది వాళ్ల ప్రేమ. గౌరి, శంకర్‌ లు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ఉండలేరు. అది కూడా వాళ్ల ప్రేమే.. ఎంత గొడవ పడినా వాళ్లు కలిసే ఉంటారు.

అకి: లేదు ఫ్రెండ్‌ పెద్ద  గొడవ కాకపోతే మామయ్య అదే పనిగా ఫోన్‌ ఎందుకు చేస్తారు.

జెండే: సరే ఇప్పుడేం చేద్దాం..

అకి: నేను వెళ్లి గొడవ సద్దుమణిగేలా చేస్తాను. కలిసుండేలా చేస్తాను.

జెండే: అమ్మా నాన్నలను చూడ్డానికి నీకో సాకు కావాలి. అంతేగా

  అంటూ వెళ్లిరా అంటూ జెండే చెప్పగానే నేనే కాదు ఫ్రెండ్‌ నువ్వు కూడా రావాలి అనగానే నేను వాళ్ళు గొడవ పడటం నేను చూడలేనమ్మా ఎంతైనా వాళ్లు నీ అంటూ రాకేష్‌ రావడం చూసి ఆపేసి నీ ఫ్రెండ్స్‌ కదా అంటూ మాట మారుస్తాడు. రాకేష్‌ వచ్చి ఎక్కడికో నేను రావొచ్చా అంటూ అడగ్గానే వద్దని అకి వెళ్లిపోతుంది. మరోవైపు అకి కోసం వెయిట్‌ చేస్తున్న  యాదగిరి ఇంటి ఓనరు రావడం చూసి షాక్‌ అవుతాడు. యాదగిరి, ఓనరును ఆపే ప్రయత్నం చేస్తుంటే ఇంతలో గౌరి లోపలి నుంచి వచ్చి మేము ఈరోజే ఇల్లు ఖాలీ చేస్తామంటుంది. అక్కర్లేదని శంకర్‌ నే ఇల్లు ఖాలీ చేయిస్తానని చెప్తాడు. శంకర్‌ ను పిలిచి ఇల్లు ఖాలీ చేయమని లేదంటే పోలీస్‌ కేసు పెడతానని చెప్పడంతో మళ్లీ గౌరి, శంకర్‌ లు గొడవ పడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  ప్రభాస్‌-హను రాఘవపూడి సినిమా స్టార్ట్‌ - సైలెంట్‌గా పూజా కార్యక్రమం జరిపించిన టీం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget