Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి సినిమా స్టార్ట్ - సైలెంట్‌గా పూజా కార్యక్రమం జరిపించిన టీం
Prabhas - Hanu Raghavapudi Movie: ప్రభాస్-హనురాఘవపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. తాజా ఈ సినిమాను పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ చేసింది మూవీ టీం
Prabhas and Hanu Raghavapudi Movie Pooja Ceremony: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్‌కి కాస్తా బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాలు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. ఇక త్వరలోనే మారుతి రాజా సాబ్ మూవీ సెట్‌లో అడుగపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో హనురాఘవపూడితో సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా సీతారామం డైరెక్టర్ హనురాఘపూడితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనికి 'ఫౌజీ' (Fauji Prabhas Movie) అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గ శనివారం (ఆగస్టు 17) ఉదయం పూజా కార్యక్రమంతో 'ఫౌజీ' చిత్రాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హను, హీరో ప్రభాస్‌తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇక నెక్ట్స్ వీక్‌లోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.
#PrabhasHanu Pooja Ceremony begins 😎🔥💥💣❤️
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024
Rebel Starrrr#Prabhas 🎉@hanurpudi@MythriOfficial
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాకిస్థానీ నటి సజల్ అలీ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించనుందని ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడట. ఇండియా-పాక్ బోర్డర్ నేపథ్యంలో ప్రేమకథగా ఈ చిత్రం సాగనుందని టాక్. ఎక్కవగా పాకిస్తాన్ నేపథ్యంలో సాగనుంని, అందుకే ఈ చిత్రంలో పాకిస్తాన్ నటిని తీసుకోవాలని మూవీ టీం భావిస్తోందట. మరోవైపు 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. కానీ ఈ వార్తలను ఆమె కొట్టపారేసింది. తాను ప్రభాస్‌తో ఎలాంటి సినిమా చేయడం లేదని, దీనికి సంబంధించి ఎలాంటి ప్రపోజల్ తన దగ్గరికి రాలేదని స్పష్టం చేసింది. దీంతో ఫౌజీలో ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోది పాకిస్తాన్ బ్యూటీ సజల్ అలీ అని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఫైనల్‌గా ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోయేది ఎవరో చూడాలి.
బ్రాహ్మణ యువకుడిగా ప్రభాస్!?
Prabhas Role In Hanu Raghavapudi Fauji: 'ఫౌజీ'లో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో పూజారి తనయుడిగా కనిపిస్తాడని టాక్. అయితే ఇప్పటి వరకు హీరోలను బ్రాహ్మణ యువకుడిగా చూపించిన పాత్రలను దర్శకులు వినోదాత్మకంగా చూపించారు. కానీ, ప్రభాస్ మాత్రం ఫౌజీలో చాలా సీరియస్ రోల్లో కనిపించనున్నాడట. అంతేకాదు ఇది రజాకార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం.
Also Read: 'తంగలాన్'కు పార్ట్ 2 కూడా ఉంది - కన్‌ఫాం చేసిన హీరో విక్రమ్