అన్వేషించండి

Prema Entha Madhuram October 4th: ఆర్య ఇంట్లోకి అడుగుపెట్టిన అను - అంజలీ, నీరజ్ పెళ్లి ఆపేస్తారా!

ఆర్య ఇంట్లోకి అను మారువేషంలో రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram October 4th: మాన్సి జలంధర్ ని అను గురించి వెతకమని ఆ కుటుంబంలో వాళ్లతో జాగ్రత్తగా ఉండమని ఫోన్లో చెప్తుంది.

ఆ తర్వాత సీన్లో వర్ధన్ ఇల్లంతా పెళ్లి సంబరాలతో నిండుగా ఉంటుంది. ఇంటి బయట మాన్సి, జలంధర్లు ఉంటారు.

జలంధర్: ఎవరికోసం ఎదురు చూస్తున్నావ్?

మాన్సి: మెహందీ ఆర్టిస్టులు మేకప్ వాళ్ళు వస్తారని చెప్పారు ఇంకా రాలేదు వాళ్ల కోసం చూస్తున్నాను. ఇంతకీ అను గురించి ఒక కంట కనిపెడుతున్నారా?

జలంధర్: నువ్వు చూసుకుంటున్నావు కదా అని నేను వదిలేసాను అని అనగా ఇంతలో ఛాయాదేవి పెళ్లికూతురు గెటప్ లో కారులో నుంచి దిగుతుంది. తనని పొగిడి మాన్సి ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళమని పక్కనున్న వాళ్ళతో చెప్తుంది. మరోవైపు అను మేకప్ ఆర్టిస్టులతో పాటు ముసుగు వేసుకుని అక్కడికి వస్తుంది.

మాన్సి: ముగ్గురు అని చెప్పి నలుగురు వచ్చారేంటి?

మేకప్ ఆర్టిస్ట్: తిను సిటీలోనే బెస్ట్ మెహందీ డిజైనర్ అందుకే తీసుకొచ్చాం అంటే  అందరిని లోపలికి వెళ్ళమంటుంది మాన్సి.

అను: సార్ ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు అని నాకు కచ్చితంగా తెలుసు. ఎలాగైనా ఆయనతో మాట్లాడాలి అని తనలో తాను అనుకుంటుంది.

Also Read: పెళ్లికి ఆర్య ప్లాన్ - అనుని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో మాన్సీ!

మరోవైపు గదిలో ఆర్య అనుతో తను గడిపిన తీపి క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో అంజలి నీరజ్ లు అక్కడికి వస్తారు.

నీరజ్: దాదా మీతో మాట్లాడాలి.

అంజలి: మీరంటే మాకు ఎంతో రెస్పెక్ట్ సార్.

ఆర్య: కం టు ద పాయింట్.

అంజలి: మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాట తప్పరు అని మాకు తెలుసు కానీ మీరు ఈ పని చేస్తే..

ఆర్య: సొసైటీలో తలెత్తుకుని బతికేది ఎలా అని అడుగుతున్నారా? నేను ఏ మాట ఇచ్చినా దాన్ని తప్పను. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. మిమ్మల్ని తలదించేలా నేను ఏ పని చేయను. మీకు నచ్చితే ఇక్కడ ఉండండి లేకపోతే మీ ఇష్టం అని అనగా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Also Read: గడప దాటిన నయని - విశాల్ ప్రాణాలు తీసేందుకు తిలోత్తమ ప్లాన్!

మరో వైపు అను ఒక గదిలో మెహేందిలను సద్దుతూ ఆర్య ని ఎలాగైనా కాలాలి అనుకుంటుంది. ఇంతలో పిల్లలు ఇద్దరు అను కి ఫోన్ చేస్తారు.

అక్కి: అమ్మ ఎక్కడున్నావు త్వరగా వచ్చేస్తావా?

అను: నేను ఇక్కడ బిజీగా ఉన్నాను అమ్మ. పని అయిపోయిన వెంటనే వచ్చేస్తాను. మీరిద్దరూ జాగ్రత్త.

అభయ్: చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా నువ్వు పని అంతా చేసుకుని రా. మా గురించి భయపడొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

అదే సమయంలో వెనకనుంచి మాన్సి అను ,దగ్గరికి వస్తుంది.

మాన్సి: పెళ్లికూతురు గదిలో మెహందీ వేయమంటే నువ్విక్కడ నుంచి చూస్తున్నావు వెళ్ళు అని చెప్పి తనని ఛాయాదేవి గదికి పంపిస్తుంది.

అక్కడ అందరూ ఛాయదేవికి మేకప్ వేస్తూ ఉండగా అను తనకి పారాణి రాస్తుంది. ఇంతలో మాన్సి అక్కడికి వస్తుంది.

మాన్సి: పెళ్లికూతురి కళ అప్పుడే నీ మొఖంలో కనిపించేస్తుంది పారాణి కూడా భలే ఉన్నది నేను వెళ్లి బ్రో ఇన్ లా ని కలుస్తాను ఇటువైపు నుంచి, అటువైపు నుంచి కూడా నేనే కదా పెళ్లి పెద్ద ని.

ఛాయాదేవి: అయితే నేను కూడా వస్తాను. ఇంత అందంగా తయారయ్యాను నాకు కాబోయే భర్త దగ్గర పొగడ్తలు తీసుకోవాలి కదా.

మాన్సి: అయితే ఆ పారాణి పెట్టే అమ్మాయిని కూడా తీసుకురా. బ్రో ఇన్ లా కూడా పారాణి పెట్టుకోవాలి కదా.

అను: ఇదే మంచి సమయం ఎలాగైనా సర్ తో మాట్లాడాలి అని మనసులో అనుకుంటుంది అను.

మరోవైపు జెండే, ఆర్యలు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆర్య: బయట జలంధర్ సెక్యూరిటీని టైట్ చేస్తున్నట్టున్నాడు

జెండే: అవును ఆర్య వాడు బయట గురించి ఆలోచిస్తున్నాడు కాని ఇంట్లో వెతకాలని ఆలోచన కూడా లేదు. కనుక రోహిత్ సేఫ్ తనని పైన ఉన్న గదిలో పెట్టాము ఇంక కనిపించడు.

Also Read: అనామిక, కళ్యాణ్ పెళ్లి ఫిక్స్- రాజ్ రహస్యం తెలుసుకున్న కావ్య మనసు ముక్కలు

ఆర్య: కెమెరాలలో అను గురించి ఒక కన్ను వేసి ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అను జలందర్ వాళ్ళకి చిక్కకూడదు.

జెండే: సరే ఆర్య అని అనగా ఇంతలో మాన్సి,ఛాయాదేవి, ముసుగు వేసుకొని ఉన్న అను ముగ్గురు అక్కడికి వస్తారు.

ఛాయాదేవి: నా పెళ్లి ముస్తాబు నీకు చూపించడానికి వచ్చాను ఎలాగున్నాను ఆర్య బాగున్నానా? నా చీర బాగుందా? నా మేకప్ బాగుందా?

ఆర్య: నాకు ఇలాంటివన్నీ నచ్చవు 

ఛాయాదేవి: అయినా ఏంటి ఆర్య నువ్వు బిజినెస్ మీటింగ్ కి తాయారు అయినట్టు ఇలా ఉన్నావు. పారాణి అమ్మాయి వెళ్లి సార్ కి పారాణి రాయు.

మాన్సి: ఇంక మనం వెళ్దామా పెళ్లి కూతురు ఎక్కువసేపు పెళ్లి కొడుకు దగ్గర ఉండకూడదు.

ఛాయాదేవి: కనీసం నా పారాణి ఎలా ఉందో అయినా చెప్పొచ్చు కదా ప్లీజ్.

ఆర్య: గుడ్.

ఛాయాదేవి: థాంక్స్ ఆ ఒక్క కంప్లీమెంట్ అయినా ఇచ్చావు అని చెప్పి మాన్సిని అక్కడి నుంచి తీసుకుని బయటకు వచ్చేస్తుంది.

అప్పుడు అను, ఆర్య కి పారాణి పడుతూ ఉంటుంది. ఇంతలో మాట్లాడదాము అని సర్ అని అనగా అప్పుడే జలంధర్ లోపలికి వస్తాడు.

జలంధర్: ఏంటి బావ పారాణి పెట్టించుకుంటున్నావా? మంచిగా ఉంటావులే ఇదిగో పారాణి అమ్మాయి త్వరగా పారాణి పెట్టు. అక్కడ అందరూ పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అని అక్కడే నిల్చుంటాడు జలంధర్. అను ముఖం చిరాకుగా పెడుతుంది.

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget