By: ABP Desam | Updated at : 03 Oct 2023 11:26 AM (IST)
Image Credit: zee5
Prema entha madhuram October 3rd: ఈరోజు ఎపిసోడ్ లో పద్దు సుబ్బులు ఆర్య దగ్గర వచ్చి ఏడుస్తూ ఉంటారు.
పద్దు: అదేంటి సారు మీరు మా అమ్మికి అన్యాయం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఈ ఇంటి వారసుల కోసం పిల్లలను దత్తకు తీసుకుంటే అక్కడ అన్యాయం జరిగేది నా అమ్మికి, వాళ్ల పిల్లలకి. మా యమ్మి ఏం తప్పు చేసిందని తనకి శిక్ష. మీ భార్య స్థానంలో తనని తప్పు ఇంకెవరిని ఊహించుకోలేము.
సుబ్బు: అయినా మీరు పెళ్లి చేసుకుంటానంటుంది మీ శత్రువు సొంత చెల్లెలిని. ఎలాగైనా ఈ పెళ్లి ఆపడానికి చూడండి
ఆర్య: నేను ఏం చేసినా ఒకరికి ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పను. నేను మాట ఇచ్చాను పెళ్లి జరిగి తీరుతుంది
సుబ్బు: ఆయన గురించి మనకు తెలిసిందే కదా ఒకసారి నిర్ణయించుకుంటే ఇంక మనసు మార్చుకోరు పద్దు రా వెళ్ళిపోదాం.
పద్దు: నిజంగా మీకేగానే ఇంకో పెళ్లి జరిగితే ఆరోజు రెండో సవాన్ని కూడా చూస్తారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా అంజలి వాళ్ళిద్దరిని ఆపడానికి చూస్తుంది. కానీ పద్దు, సుబ్బులు అక్కడి నుంచి బాధతో వెళ్లిపోతారు.
Also Read: బాధతో కుమిలిపోతున్న అను.. ఆర్యను నిలదీసిన సుబ్బు, పద్దులు??
జలంధర్: ఈ ఎమోషనల్ డ్రామా ని దృష్టిలో పెట్టుకొని మీ నిర్ణయాన్ని ఏమి మార్చుకోరు కదా? అసలకే మా చెల్లి చాల మొండిది.
ఆర్య: నేను మాట ఇచ్చాను మాట దాటను పెళ్లి జరుగుతుంది. ఇంక మీరు బయలుదేరండి అని జలంధర్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆర్య.
ఆ తర్వాత సీన్లో ఆర్య పద్దు, సుబ్బులతో జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జెండే అక్కడికి వస్తాడు.
జెండే: పద్దు గారు వాళ్ళు వచ్చారంట ఆర్య నాకు ఇప్పుడే తెలిసింది. నిన్నేమైనా బాధపడే మాటలు అన్నారా?
ఆర్య: వాళ్ల బాధని వాళ్ళు చెప్పుకోగలిగారు. అయినా సరే వాళ్ళు రావడం మంచిదే అయింది. జలంధర్ ఇప్పుడు నేను పెళ్లికి ఒప్పుకున్నట్టు పూర్తిగా నమ్ముతాడు. అలాగే ఆ పెళ్లి ఏర్పాట్లు మన ఇంట్లోనే చేయనివ్వు ఎందుకంటే రోహిత్ మన ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళు బయట ఎంత సెక్యూరిటీని పెట్టి ఎంత చెక్ చేసినా లోపల చూడరు కదా కనుక పెళ్లి ఇక్కడే జరిపిద్దాం.
Also Read: దుగ్గిరాల ఇంట్లో వినాయకచవితి సంబరాలు - రాజ్ చీటీలోని నిజం కావ్య తెలుసుకుంటుందా!
జెండే: అలాగే ఆర్య ఆ మట్టిబుర్రకు ఇంట్లో వెతికే ఆలోచన కూడా ఉండదు. అలాగే బయట సీసీ కెమెరాలు కూడా పెట్టాను అను జాడ తెలిస్తే ఇంక తను మన దగ్గర నుంచి తప్పించుకోలేదు అని అంటాడు జెండే.
ఆ తర్వాత సీన్లో జలంధర్, మాన్సి, ఛాయదేవిలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.
మాన్సి: ఆఖరికి అనుకున్నట్టే వర్ధన్ ఇంటికోడలు అవుతున్నారు
ఛాయాదేవి: అవుతున్నాము. నేను అక్కడికి వెళ్లిన వెంటనే నిన్ను కూడా తీసుకొని వచ్చేస్తాను. నేను ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పని మాన్సి.
మాన్సి: ముందు మీరు వెళ్ళండి అప్పుడు చూద్దాము మళ్లీ వర్ధన్ ఇంటి పరువు పర్యటిష్టలు అని అంటారేమో.
జలంధర్: లేదు మా చెల్లి ఏమి ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదు వారి పతనం చేయడానికే పెళ్లి చేసుకుంటుంది. ఇలాంటి విషయాల్లో మా చెల్లి కత్తి అని అనగా నవ్వుకుంటూ అక్కడ నుంచి ఛాయాదేవి వెళ్ళిపోతుంది.
మాన్సి: మీ మేనేజర్ నెంబర్ ఇవ్వండి అను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయ్యేలా నేను చూస్తాను. తను ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి జరిగే చోటికి రాకూడదు అని జలంధర్ దగ్గర తన మేనేజర్ నెంబర్ తీసుకుంటుంది మాన్సి.
ఆ తర్వాత సీన్లో అను పిల్లలు ఇద్దరినీ ట్యూషన్ టీచర్ ఇంటి వరకు తీసుకొని వెళ్తుంది.
అభి: ఈరోజు సండే కదా అమ్మ మమ్మల్ని ట్యూషన్ కి తీసుకుని వెళ్తున్నావా?
అను: లేదు నాకు సాయంత్రం పెళ్లికి ఒక ఆర్డర్ వచ్చింది. అప్పుడు మీరిద్దరూ ఇంట్లోనే ఉండాలి కదా అందుకే టీచర్ దగ్గర దింపుతున్నాను.
అక్కి: అయితే పెళ్లికి నేను కూడా వస్తానమ్మా అని అక్కీ అంటుంది. అప్పుడు అను వద్దు అని కోప్పడుతుంది. వెనుక నుంచి అనుని ఒకడు ఫాలో అవుతూ ఉంటాడు. అను ఒక సందులోకి వెళ్లిపోవడంతో వాడు అనుని మిస్ అవుతాడు. ఇంతలో మాన్సి అతనికి ఫోన్ చేసి ఎలాగైనా అను నీ పట్టుకోమని చెప్తుంది.
మరోవైపు అను పిల్లలు ఇద్దరిని టీచర్ ఇంట్లో దింపుతుంది.
అను: సారీ అక్కి నీతో గట్టిగా మాట్లాడినందుకు.
అభయ్: చూడు అక్కి అమ్మ మన కోసమే కదా ఇంతలా కష్టపడుతుంది మరి అమ్మ కోసం మనం ఏమాత్రం చేయలేమా అని అనగా అక్కీ కూడా కరిగిపోతుంది.
అను: ఏమనుకోవద్దు మేడం పిల్లలని మీ దగ్గర ఉంచుతున్నందుకు అన్ని టీచర్ తో అంటుంది అను.
టీచర్: మరేం పర్వాలేదు పిల్లలు ఇద్దరు చాలా బుద్ధిమంతులు పిల్లలి నేను చూసుకుంటాను. అని అనగా అను అక్కడి నుంచి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. వెనక ఒకడు ఫాలో అవ్వడం చూసి వెంటనే రూటు మార్చి దాక్కుతుంది అను. అప్పుడు ఆ వ్యక్తి ఎంత వెతికినా అను కనబడకపోవడంతో చిరాకుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అను: ఎవరా వ్యక్తి? నన్ను వెంబడిస్తున్నాడేంటి?అనుకొని అను మరో దారిలో నుంచి కంగారుపడుతూ వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో జలంధర్ తన సెక్యూరిటీ ని ఆర్య ఇంటి ముందు ఉంచి ఈరోజు ఈ పెళ్లి ఆపడానికి చాలామంది చూస్తారు నేను మీకు గెస్ట్ లిస్ట్ లో ఇచ్చినవి కాకుండా ఇంక ఎవరు వచ్చినా వెంటనే నాకు చెప్పండి అని సెక్యూరిటీతో చెప్తాడు. ఇంతలో మాన్సి జలందరికీ ఫోన్ చేస్తుంది.
మాన్సి: అక్కడ సెక్యూరిటీని టైట్ చేసి ఉంచండి. ఇంట్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఇక్కడ అనుని కూడా పట్టుకుందామనుకుంటే తను మన ప్లాన్ గురించి ముందే అంచనా వేసుంటుంది ఇంటి నుంచి తప్పించుకుంది.
తన మూఢనమ్మకాలకి ఆర్య కి ఎలాగో కనబడదు కానీ ఆర్య కి అను ఒకవేళ కనబడితే మన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అందుకే నేను అను మీద ఒక కన్ను వేసి ఉంచుతాను. మీరు లోపల జాగ్రత్తగా ఉండండి నేను మరీ మరీ చెప్తున్నాను అని అంటుంది మాన్సి. మరోవైపు రోహిత్ తన గదిలో కూర్చుని ఉంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial
Jagadhatri December 9th Episode: సూరిని చూసి షాకైన సుధాకర్.. పోలీసులు మాధురిని అరెస్టు చేస్తారా?
Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!
Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!
Gautham Krishna: శుభశ్రీని కలిసిన ‘బిగ్ బాస్’ గౌతమ్ - పెళ్లిపై క్లారిటీ!
Prema Entha Madhuram December 9th Episode - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అయోమయంలో పడిపోయిన యాదగిరి - దివ్య భర్తని ఎరగావేసిన ఛాయాదేవి!
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
/body>