By: ABP Desam | Updated at : 07 Jul 2022 04:55 PM (IST)
ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!
'బాహుబలి' ఫ్రాంచైజీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. దీంతో ఆయన డిమాండ్ బాగా పెరిగిపోయింది. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా ఉంటున్నారు ప్రభాస్. రీసెంట్ గా ఈ హీరో నటించిన 'రాధేశ్యామ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్ఠాలను తీసుకొచ్చింది ఈ సినిమా.
ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ సినిమా డిజాస్టర్ అయింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. దీనికోసం జీ సంస్థ ప్రమోషన్స్ కూడా చేసింది. ప్రభాస్ కి క్రేజ్ ఉండే భీమవరం లో 'రాధేశ్యామ్' థీమ్ పార్క్ అనే కాన్సెప్ట్ తో ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ సినిమాను టీవీలో కచ్చితంగా చూడాల్సిందేనని అనుకున్నారు.
కానీ ఇప్పుడు రేటింగ్ చూస్తే రివర్స్ లో ఉంది. కేవలం 8.25 టీఆర్ఫీ మాత్రమే వచ్చింది. నిజానికి ఇది చాలా తక్కువ. గతంలో ఇదే ఛానెల్ లో టెలికాస్ట్ అయిన 'వకీల్ సాబ్' సినిమాకి టీఆర్ఫీ 19పైనే వచ్చింది. 'బంగార్రాజు'కి కూడా 14 పైనే వచ్చింది. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాకి కూడా టీవీలో తక్కువ టీఆర్ఫీ వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకి 5.82 టీఆర్పీ వచ్చింది. ప్రభాస్ లాంటి హీరో సినిమాలకు ఇంత తక్కువ రేటింగ్ రావడం నమ్మలేకుండా ఉంది. టీవీల్లో ప్రభాస్ ఇమేజ్ తగ్గిపోతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!
Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ
Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత
Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!