అన్వేషించండి

Podharillu Serial Today Feb 20th: మహాకు మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించిన తల్లి....తిరిగి వెళ్లిపోతానంటూ పట్టుబట్టిన మహాలక్ష్మీ

Podharillu Serial Today Episode February 20th:మహాకు మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించిన తల్లి....తిరిగి వెళ్లిపోతానంటూ పట్టుబట్టిన మహాలక్ష్మీ

Podharillu Serial Today Episode: మహాలక్ష్మీని ఎలాగైనా ఇంటికి రప్పించాలని పథకం వేసిన వాళ్ల అమ్మ...నిహారికతో ఆమెకు ఫోన్ చేయిస్తుంది. జాబ్‌కోసం సర్టిఫికేట్లు తీసుకెళ్లడానికి రమ్మని చెబుతుంది. ఆమాటలు విన్న మహాలక్ష్మీ ఎంతో సంతోషిస్తుంది. మీ అమ్మగారే నీకు సర్టిఫికేట్లు ఇవ్వమన్నారని చెప్పడంతో ఆనందపడుతుంది. అయితే ఒరిజనల్ సర్టిఫికేట్లు కావాడం వల్ల నువ్వే వచ్చి నేరుగా తీసుకోమని చెబుతుంది. కొరియర్‌లో పంపించడం కుదరదని చెబుతుంది. అయితే మహా సరేనని చెప్పి ఈ విషయం మాధవ్‌కు చెబుతుంది. దీనికి చక్రి చాలా భయపడిపోతాడు. నవ్వు ఒక్కదానివే మీ ఇంటికి వెళ్తే వాళ్లు ఏదైనా చేస్తారేమోనని అంటాడు. అలాంటి భయమేమీ లేదని...మా వాళ్లకు నాపై కోపం ఉన్నంతమాత్రాన చంపేంత కక్ష లేదని అంటుంది. అయితే నేనుకూడా వస్తానని చక్రి అనడంతో నిన్ను చూస్తేనే వాళ్లు చాలా కోపంగా ఉన్నారని..ఇప్పుడు మళ్లీ అక్కడికి వస్తే గొడవలు చేస్తారని చెబుతుంది. ఏదీఏమైనా మళ్లీ నిన్ను ఒక్కదాన్నే పంపించాలంటే భయంగా ఉందని మాధవ్ అంటాడు. కన్నాను కూడా నీతోనే పంపిస్తానని చెప్పడంతో ఆమె సరేనని అంటుంది. ఆమె ఇంటికి వెళ్లడానికి బయలుదేరతుండగా.....ఎలాగైనా ఈ ప్రయాణం ఆపాలని చక్రి ట్రై చేస్తుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన మాధవ్‌ ఏం కాదులేరా  అనిఅంటే...వాళ్ల సంగతి నీకు తెలియదన్నయ్య...ఏదో ఒకటి చెప్పి మహాను మళ్లీ ఇక్కడికి రానివ్వకుండా  ఆపేస్తారని అంటాడు. ఇప్పటికే వాళ్ల నాన్న ఓసారి ఆత్మహత్యాయత్నం  చేశాడని...ఇప్పుడు మళ్లీ అలాగే బెదిరించి  ఉంచేస్తారన్న భయంంగా ఉందని అంటాడు. అసలే మహా మాకు జరిగింది పెళ్లిలాగే ఫీలవ్వడం లేదని...వాళ్లు చూపిన ప్రేమకు కరిగిపోయి ఉండిపోతుందేమోనని భయంగా ఉందని అంటాడు. అలాంటిదేమీ జరగదులే అని మాధవ్ భరోసా ఇస్తాడు.
                       మహావాళ్ల అమ్మకూడా  తన భర్తకు ఈవిషయం చెబుతుంది. తను ఇప్పుడు ఇక్కడికి వస్తుందని మీరు తనని ఏమీ అనకూడదని అంటుంది. దీనికి ప్రతాప్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనల్ని కాదనుకుని వెళ్లిపోయిన దాని గురించి మనకు ఎందుకని అంటాడు. అది తప్పు చేస్తే మనం కూడా అలాగే వదిలేద్దామా అని అంటుంది. అయితే  అది నిజంగానే  తన తప్పు తెలుసుకుని ఇక్కడ ఉండటానికి వస్తే నాకు అభ్యంతరం లేదని చెబుతాడు. ఆది కూడా సరేననంటాడు. వెంటనే కలుగజేసుకున్న నిహారిక....మీరు ఏదేదో ఊహించుకుంటున్నారని..మహాకు చట్టప్రకారం పెళ్లి అయ్యిందని అంటుంది. తను అక్కడ ఇబ్బందిపడుతున్నానని  చెప్పిందే గానీ....ఇక్కడికి శాశ్వతంగా వచ్చేస్తానని చెప్పలేదు అని అంటుంది. ఒకసారి రానివ్వు ఇక్కడే ఉండేలా నేను చేస్తానని వాళ్ల అమ్మ అంటుంది. అటు మహా కన్నాతో బయలుదేరి  యాదగిరిగుట్ట వచ్చేస్తుంది.
                                   యాదగిరిగుట్టలో ఆటో దిగిన వెంటనే మహా వాళ్ల వదినకు ఫోన్ చేసి మాట్లాడుతుంది.నేను వచ్చేశాను సర్టిఫికేట్లు తెచ్చి ఇవ్వమని చెబుతుంది.ఇంటికి రమ్మని నిహారిక కోరుతుంది.మీనాన్న,అన్నయ్య ఇంట్లో లేరని చెప్పడంతో కన్నాను తీసుకుని మహా ఇంటికి వస్తుంది. వాళ్ల అమ్మ కన్నాను చూసి మండిపడుతుంది. ఎవడు వీడు అని నిలదీస్తుంది. చక్రి వాళ్ల తమ్ముడని చెప్పడంతో  గేటు బయటే ఉండమని చెప్పి ...తనను మాత్రం లోపలికి తీసుకెళ్తుంది.అక్కడ వాళ్ల అన్నయ్య, నాన్నను చూసి షాక్‌కు గురవుతుంది. వెళ్లివాళ్ల నాన్నతో మాట్లాడుతుంది. అక్కడ కొంచెం సంవాదం జరిగిన తర్వాత వాళ్ల అమ్మ ఆ పెళ్లిని మర్చిపోయి ఇక్కడే ఉండమని చెబుతుంది. దీనికి మహా ఒప్పుకోదు....ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం కాదని అంటుంది. నేను ఇంట్లో నుంచి పారిపోయి వెళ్లిపోయిందే....నా చదవుకు సార్థకత దొరికే ఉద్యోగం చేయడానికని ఇప్పుడు నేను అవన్నీ వదులుకుని వస్తే నేను తప్పు చేసిన దానిని అవుతానని అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  నేను వెనక్కి రానని తెగేసి చెబుతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget