Podharillu Serial Today December23rd: మహా పెళ్లి అనుకున్న ముహూర్తం కన్నా ముందే జరగనుందా..? ఊహించని పరిణామానికి మహా ఏం చేసింది...?
Podharillu Serial Today Episode December 23rd: కెనడా వెళ్లేందుకు వీసా ప్రాసెస్ లేటు అవుతుందని...ముందుగానే మహాను రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటానని భూషణ్ అంటాడు. దీనికి మహా ఏం చేసింది..?

Podharillu Serial Today Episode: పెళ్లి తర్వాత తాను చెప్పినట్లే వినాలన్న భూషణ్ మాటలకు మహాకు కోపం వస్తుంది. చచ్చినా ఇలాంటి వాడిని పెళ్లిచేసుకోకూడదని అనుకుంటుంది. మరో పెళ్లి సంబంధం కూడా చెడిపోవడంతో మాధవ్‌ను పరామర్శించడానికి వచ్చిన గాయత్రి ఆ విషయం కన్నాకు చెబుతుంది. అప్పటి వరకు ఈవిషయం తెలియని కన్నా చాలా బాధపడతాడు. మీ ఇంట్లోవాళ్లే కదా పనిగట్టుకుని మరీ పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని కేశవ్, నారాయణ అంటారు. ఇంకోసారి మన ఇంటివైపు వాళ్లు తొంగి చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పి వచ్చానని నారాయణ అంటారు. ఇంతలో గాయత్రి మనం పెళ్లి చేసుకుందామని మాధవ్‌తో అనగా...నారాయణ ఆమెపై గట్టిగా అరుస్తాడు.ముందు మీఅమ్మను ఒప్పించైనా రా...లేకపోతే ఇంట్లో నుంచి వచ్చేసేయు అంటాడు. గాయత్రి అన్నయ్యపై అనవసరంగా ఆశలు పెట్టుకుంటుందని...వాళ్ల అమ్మను ఒప్పించే ధైర్యం లేదని, ఎదురించి వచ్చే దమ్ము లేదని కేశవ్ అంటాడు.
ఆది ఫోన్ చేయడంతో వాళ్ల నాన్న పరుగుపరుగునా వచ్చేస్తాడు. ఏం జరిగిందని ఆదిని అడగగా....మహా మామాట వినడం లేదని..భూషన్‌ను చేసుకోనని మొండిపట్టుగా ఉందని చెబుతాడు. తను వెళ్లి మహాతో మాట్లాడతాడు.ఇన్నాళ్లు నాకు నచ్చింది కాకుండా నాకు ఏది మంచో అదే మీరు చేశారని...నేను కూడా అదే తీసుకున్నానని మహా అంటుంది.ఈసారి కూడా మీ మాట వింటే నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటానని చెబుతుంది. అతనికి భార్య అంటే చాలా చులకన భావం ఉందని...అంటుంది. పెళ్లిచేసుకుని పిల్లల్ని కంటేచాలని....ఇంటిపని, వంటపని చూసుకోవడమే భార్యలపని అనే భావన అతనికి ఉందని చెబుతుంది. జాబ్ చేయాల్సిన పనేలేదని అంటున్నాడని వాళ్ల నాన్నకు చెబుతుంది. దీనికే కంగారుపడితే ఎలా అని ఆయన సర్దిచెబుతాడు. ఆడపిల్లకు అంతకు మించి ఆనందం ఏముంటుందని అంటాడు. మీ అమ్మ, వదిన చదువుకున్నా ఉద్యోగాలు చేయడం లేదు కదా....నేను చేసిన పనే కదా అల్లుడుగారు కూడా చెప్పారు అని చెబుతాడు. నువ్వు అతనితో సరిగా ఉండకపోవడం వల్లే చిరాకు పడిఉంటారని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో అక్కడికి భూషణ్ వస్తాడు. తన గురించి, తన ఆస్తి గురించి చెప్పి నాతో నీకు ఇంకా ఏంటి ప్రాబ్లం అని అంటాడు. అంతలో అతన్ని ఆది కిందకు తీసుకెళ్తాడు. అతను చెప్పిన దాన్ని చూస్తే నిన్ను మహారాణిలా చూసుకుంటాడని అర్థమవుతుందని ప్రతాప్ చెబుతాడు. ఇంత మంచి సంబంధం మళ్లీ తీసుకురాలేని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు.
పెళ్లయిన నెలలోనే మహాను కెనడా తీసుకెళ్లిపోతానని భూషణ్ ప్రతాప్‌తో అంటాడు.అలా తీసుకెళ్లాలి అంటే ఇప్పటి నుంచి ప్రాసెస్ మొదలుపెట్టాలని చెబుతాడు. దీనికి ప్రతాప్ సరేనని అంటాడు. పెళ్లి మనం అనుకున్న సమయానికే చేసుకుంటానని...కాకపోతే అంతకన్నా ముందే రిజిస్ట్రర్ మ్యారేజీ చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. లేదంటే పెళ్లి అయిన తర్వాత మళ్లీ వీసా ప్రాసెస్ కోసం చాలారోజులు వెయిట్ చేయాల్సివస్తుందని అంటాడు. ఇప్పుడు రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుని ప్రాసెస్ మొదలుపెడితే గానీ అప్పటికీ అన్ని పనులు పూర్తవ్వవని అంటాడు. దీనికి మహా ఉలిక్కిపడుతుంది. ఇది మేం అసలు ఊహించలేదని ప్రతాప్ అంటాడు. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదని....సడెన్‌గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని నిహారికి అడుగుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని భూషణ్ అడగ్గా...నాకు ఉందని మహా చెబుతుంది. అసలు నేను పెళ్లికే ప్రిపేర్‌గా లేనని...ఇప్పుడు ముందే రిజిస్టర్ మ్యారేజీ అంటే నేను ఒప్పుకోనని అంటుంది. అదంతా అంకుల్ చూసుకుంటారని నీకు సంబంధం ఏంటని భూషణ్ అనడంతో మహాకు మరింత కోపం వస్తుంది.అసలు వీడితో పెళ్లిఎలా తప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే...వీడు రిజిస్ట్రర్ మ్యారేజీ పేరిట మరింత ముందుకు తెచ్చాడని బాధపడుతుంది. ప్రతాప్ ఆదిని అడగ్గా...ఇలా చాలామంది చేసుకుంటున్నారని చెప్పడంతో ఆయన అ పనులు చూసుకోవాలని చెబుతాడు.ఇంతలో అక్కడికివచ్చిన డ్రైవర్ ఫొటో స్టూడియోకు పాస్‌పోర్ట్ ఫొటో కోసం తీసుకెళ్తానని చెప్పడంతో మహా అతనితోపాటు వెళ్తుంది.
కారులో వెళ్తూ మహాతో చక్రి మాటలు కలుపుతాడు. పెళ్లికొడుకు గురించి, అత్తారింట్లో తాను పడుతున్న ఇబ్బందులు గురించి ఆరా తీస్తాడు. మీ ముఖంలో దిగులు కనపడుతుందని అంటాడు. మీరు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారా అని అడుగుతాడు. తప్పించుకోలేని పరిస్థితుల్లో మీరు ఒప్పుకున్నారని చెప్పడంతో...చక్రిపై ఆమెకు మంచి అభిప్రాయం కలుగుతుంది. మీకు ఆ పెళ్లి కొడుకు కరెక్ట్ కాదని చక్రి ఆమెకు అంటాడు. మీ చదువు,కలలను అన్ని చంపుకుని పెళ్లి చేసుకుంటున్నారని జాలిపడతాడు. దీంతో ఆమె ఫొటో దిగాల్సిన స్టూడియోరావడంతో కారు ఆపి దిగివెళ్లిపోతుంది.





















