Podharillu Serial Today April 23th: ఆడపెళ్లివారు పెట్టిన కండిషన్ మాధవ్‌కు తెలిసిపోయిందా..? కవితకు మాధవ్ ఏం చెప్పాడు..?
Podharillu Serial Today Episode April 23th: ఆడపెళ్లివారు పెట్టిన కండిషన్ మాధవ్‌కు తెలిసిపోయిందా..? కవితకు మాధవ్ ఏం చెప్పాడు..?

Podharillu Serial Today Episode: తెల్లారిన తర్వాత కూడా డబ్బుల విషయంలో మరోసారి చక్రి,కేశవ్ గొడవపడుతుండటంతో మహాలక్ష్మీ అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తుంది.ఇంకోసారి మీరు ఇలా గొడవలు పెట్టుకున్నారంటే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరిస్తుంది.ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి చెబితే అర్థం కావడం లేదా మీకు అని అరుస్తుంది. ఇంతలో మాధవ్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా...అసలు తప్పు అంతా మీ దగ్గరే ఉందని పెద్ది మీద కూడా మహా మండిపడుతుంది. మీరే వాళ్లను అతిగారాబం చేసి ఇలా తయారు చేశారని అంటుంది. చిన్నప్పుడు కొట్టుకుంటున్నప్పుడే చెరో రెండు తగిలిస్తే దారికి వచ్చేవారని తిడుతుంది. ఇలా ఫైనల్ వార్నింగ్ అని ఇంట్లో ఇంకోసారి మీరిద్దరూ గొడవపడినట్లు తెలిస్తే....నేను ఈ ఇంట్లో ఉండలేనని గట్టిగా చెబుతుంది. దీంతో వారిద్దరూ మేం గొడవపడమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
మాధవ్ మేస్త్రీ పనికి వెళ్లగా...పెళ్లికుమార్తె కవిత అతనికి ఫోన్ చేస్తుంది.రెండుసార్లు చేసినా లిప్ట్ చేయకపోవడంతో మళ్లీమళ్లీ చేస్తుంది. దీంతో మాధవ్ ఫోన్ తీసి మాట్లాడతాడు.పనిలో బిజీగా ఉండి చూసుకోలేదని చెబుతాడు. వాళ్లిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్లీ మనం నేరుగా కలుద్దామని చెబుతుంది.దీనికి మాధవ్ సరేనని అంతుకు ముందు కలిసిన రెస్టారెంట్ వద్దకే వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందని కూలీ బన్సీఆడగ్గా....ఈ పెళ్లికి ఈ అమ్మాయి ఎలా ఒప్పుకుందో అర్థం కావడం లేదని అంటాడు. దీనిలో పెద్దగా అర్థంకాకపోవడానికి ఏముందన్నా....అప్పుడు నువ్వు నచ్చలేదేమో ఇప్పుడు నచ్చి ఉంటావని అంటాడు.నేను నచ్చకపోవడం ఏమీలేదని ఆ అమ్మాయికి అప్పుడు కూడా నేను నచ్చానని కాకపోతే పెళ్లికి కొన్ని కండిషన్లు పెట్టడంతో నేనే కుదరదని చెప్పానంటాడు. మరి ఇప్పుడు ఆ కండిషన్‌లు లేకుండా ఎలా పెళ్లికి సిద్ధమయ్యారో అర్థం కావడంలేదని అంటాడు. ఇప్పుడు ఎలాగూ కలుస్తావు కదా అన్ని విషయాలు మాట్లాడుకోండని బన్సీ చెబుతాడు.
కవితను కలవడానికి మాధవ్ రెస్టారెంట్‌కు వెళ్తాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ పెళ్లికి మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌చెబుతుంది. మనం ఏ ఏరియాలో ఇల్లు తీసుకుందామని అడుగుతుంది.అదేంటి మాఇల్లు ఉండగా మరో ఇల్లుతీసుకోవడం ఏంటని మాధవ్ ప్రశ్నిస్తాడు.మీరు వేరుగా కాపురం పెడతామంటనే కదా మా అమ్మానాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకుందని కవిత చెబుతుంది. అలా అని ఎవరు చెప్పారు అని మాధవ్ అడగ్గా...మీ తమ్ముడే చెప్పాడని అతనే మాఇంటికి వచ్చి ఈసంబంధం మాట్లాడాడని చెబుతుంది. దీంతో మాధవ్ అక్కడి నుంచి లేచి వచ్చేస్తాడు. ఇంట్లో పెళ్లికి ఏం కావాలో లెక్కలు వేస్తుండగా మాధవ్ రాకను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అన్నయ్య ఎందుకు ఇలా పని మధ్యలోనే వదిలేసి వచ్చాడని అనుకుంటారు. నేరుగా ఇంట్లోకి వెళ్లిన మాధవ్....తన బట్టలు బ్యాగ్‌లో సర్దుకుని బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తున్నావని తమ్ముళ్లు అడగ్గా..ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెబుతాడు.మీరు కోరుకుంటున్నది కూడా ఇదేకదా అని అంటాడు. దీంతో అన్నయ్యకు విషయం తెలిసిపోయిందని వాళ్లకు అర్థమవుతుంది.అంటే నన్ను ఇంట్లో నుంచి పంపించివేసే అంత పెద్దవాళ్లయ్యారన్నమాట అని మాధవ్ అందరికీ క్లాస్‌పీకుతాడు. నీకు పెళ్లిచేయాలనే ఇలా చేశామని చెప్పి అందరూ కాళ్లమీదపడి ఏడుస్తారు.ఇంతలో కవిత ఫోన్ చేయగా....మా తమ్ముళ్లు నాకు చెప్పకుండా మీతో అబద్ధం చెప్పారని నేను మా ఇంటిని తమ్ముళ్లను వదిలి ఎక్కడికి రాలేనని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ లింక్‌ను ఫాలో అవ్వండి
తెల్లారిన తర్వాత మహా వెళ్లి మాధవ్‌కు సారీ చెబుతుంది.నావల్లే ఇదంతా జరిగిందని చెబుతుంది.మీరు నాకు మంచిచేయాలనే చూశారు కదమ్మా మీ తప్పు ఏం లేదని మాధవ్ అంటాడు.ఇంతలో చక్రి అక్కడికి వచ్చి మీకు సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి మహాను తీసుకుని యూనివర్సిటీకి వెళ్తాడు. మీ సర్టిఫికేట్లు మీకు ఇప్పించేందుకు అన్ని మాట్లాడి ఉంచానని చెప్పడంతో మహా చాలా సంతోషపడుతుంది.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















