అన్వేషించండి

Podharillu Serial Today April 21th: పెళ్లికి ఒప్పించడానికి మాధవ్ వద్ద తమ్ముళ్లు ఏం దాచారు..? మహాలక్ష్మీకి మాధవ్‌ చెప్పిన నిజం ఏంటి..?

Podharillu Serial Today Episode April 21th:పెళ్లికి ఒప్పించడానికి మాధవ్ వద్ద తమ్ముళ్లు ఏం దాచారు..? మహాలక్ష్మీకి మాధవ్‌ చెప్పిన నిజం ఏంటి..?

Podharillu Serial Today Episode: ఆడపెళ్లివాళ్లు చెప్పిన కండిషన్‌ మాధవ్‌కు చెప్పకుండా ఈ పెళ్లికి ఒప్పిద్దామని తమ్ముళ్లు,మహాలక్ష్మీ అనుకుంటారు. వాళ్లు చెప్పిన మాట అన్నయ్యకు తెలిస్తే ఈయన ఒప్పుకోడని....ఆ కండిషన్‌కు అంగీకరించకుంటే పెళ్లికి వాళ్లు ఒప్పుకోరని అనుకుంటారు.కన్నాను బలవంతంగా  ఒప్పించి ఆడపెళ్లివారికి చక్రి ఫోన్‌ చేస్తాడు. మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమేనని..త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామని చెబుతారు. దీనికి వాళ్లు చాలా సంతోషపడతారు. హమ్మయ్యా...ఎలాగైతేనేవాళ్లు  ఒప్పుకున్నారని చక్రి కూడా ఆనందపడతాడు. కానీ ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే మాత్రం మనల్ని చంపేస్తాడని కేశవ్‌ అంటాడు. ఏదోవిధంగా అన్నయ్యకు తెలియకుండా ఈ పెళ్లి తంతు ముగించాలని చక్రి అంటాడు.అయితే ఆ గాయత్రి పెళ్లికన్నా ముందే మన ఇంట్లో పెళ్లి జరగాలని అదే నా కండిషన్‌ అని కేశవ్‌ చెప్పి వెళ్లిపోతాడు.
                 

డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి ఎంతకూ శైలూ రాకపోవడంతో  కేశవ్‌  రోడ్డుపై ఎదురుచూస్తుంటాడు.తను ఇంకా రాలేదని ఫోన్‌ చేసి మాట్లాడతాడు. దీంతో శైలూ కేశవ్‌పై మండిపడుతుంది. పదినిమిషాలు ఆగలేవా అని  అరుస్తుంది. ఇప్పుడు అక్కడే నాకు పెయిడ్ ప్రమోషన్ షూటింగ్‌  ఉందని...అది అయిపోగానే వాళ్లు ఇచ్చిన డబ్బులు  నీముఖాన కొడతానని అని చెప్పి ఫోన్ కట్టేస్తుంది. ఇంతలో అక్కడ నలుగురు ఐదుగురు  అబ్బాయిలు సిగరెట్లు తాగుతూ మాట్లాడుకోవడం చూసిన కేశవ్‌ వాళ్లు  మందలిస్తాడు. వాళ్లు నీకు అంతగా ఇబ్బంది ఉంటే  ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటారు. కేశవ్‌ వెళ్లపోతూ వాళ్ల మాటలు వింటాడు. ఇప్పుడు ఇక్కడికి ఆ స్టైలీష్‌ శైలూ రాగానే దానితో న్యూడ్ వీడియో తీసి అది చూపించి దాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజాలని వాళ్లు ప్లాన్ వేసుకుంటారు.

ఆ వీడియో చూపించిన దాన్ని ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కికి రప్పించుకోవచ్చని వేసిన ప్లాన్ కేశవ్‌ వింటాడు. వాళ్లను చితక్కొడుతుండగా....అప్పుడే అక్కడికి వచ్చిన శైలూ ఆపుతుంది. ఎందుకు వాళ్లను కొడుతున్నావని నిలదీస్తుంది. వీళ్లు నీతో అసభ్యకరమైన వీడియోలు తీసి బెదిరించాలనుకుంటున్నారని చెబుతాడు. అయినా ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్లిపోవడమేనా అని కేకలు వేస్తాడు. దీంతో వాళ్లు మాటమార్చేస్తారు.మేం అలా ఏం చేయాలనుకోలేదని...మీతో పెయిడ్‌ ప్రమోషన్ చేయించడానికే ఇక్కడికి పిలిచామని చెబుతారు. వీడికి మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఇలా చేశాడని చెప్పగానే...శైలూ కేశవ్‌ చెంపపగులగొడుతుంది. నేను నీ షాపు దగ్గరకు వచ్చి గొడవ చేశానని..ఇప్పుడు ఇలా రివేంజ్‌  తీర్చుకుంటున్నావా అని నిలదీస్తుంది. కేశవ్‌ ఏం చెప్పినా శైలూ వినకపోడంతో  నీ చావు నువ్వు చావు అని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు.వచ్చిన కుర్రాళ్లు అంతకు ముందే పారిపోవడంతో శైలూ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.


              ఇంట్లో  అందరూ కూర్చుని చర్చించుకుంటుండగా....మాధవ్‌ అక్కడికి వస్తాడు. అప్పుడు చక్రి తనకు  అసలు విషయం చెబుతాడు.ఆ గారెల అమ్మాయి నీతో పెళ్లికి ఒప్పుకుందని అంటాడు. అలా ఎలా జరిగిందని మాధవ్‌ అంటాడు.ఏమో ఆఅమ్మాయి మనసు మార్చుకుని నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందంటా అందుకే వాళ్ల అమ్మానాన్నలు పెళ్లికి ఒప్పుకున్నారని చెబుతాడు.ఇదంతా నాకు ఏదో అనుమానంగా ఉందని ఆ అమ్మాయి ఎలాంటి కండిషన్లు పె‌ట్టలేదా అని అంటాడు.

మరి ఆ రోజు రెస్టారెంట్‌లో నీకు ఏమైనా చెప్పిందా అని మహా అడగ్గా...అలాంటిదేమీ లేదని మాధవ్‌ చెబుతాడు.అయితే ఇప్పుడు ఎందుకు పెడుతుందని ప్రశ్నించడంతో మాధవ్‌ అక్కడి నుంచి ఓకే చెప్పివెళ్లిపోతాడు.కానీ వంటగదిలో ఒంటరిగా ఉన్న మాధవ్‌ వద్దకు మహా వెళ్లగా....అసలు విషయం చెబుతాడు. ఆ అమ్మాయికి నేను తమ్ముళ్లతో ఉండటం ఇష్టం లేనది...ఈ ఇంటికి రానని చెప్పిందని అంటాడు.ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందిలే అని మహాలక్ష్మీ కూడా అబద్ధం చెబుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget