Vijay Deverakonda: వారణాసి, రాక టైపులో... హాలీవుడ్ స్థాయిలో... విజయ్ దేవరకొండ సినిమా, జానర్ ఏమిటంటే?
Vijay Deverakonda New Movie: న్యాచురల్ స్టార్ నాని క్లాప్‌తో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శౌర్యువ్ కలయికలో వైరా సంస్థ నిర్మిస్తున్న సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). 'హాయ్ నాన్న' ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ (Shouryuv)తో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అదీ భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ సినిమాలకు పని చేసిన టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం. పూజా కార్యక్రమాలతో సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
నాని క్లాప్‌తో మొదలైన సినిమా!
విజయ్ దేవరకొండ హీరోగా శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను ప్రతిష్టాత్మక వైరా సంస్థ నిర్మిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి న్యాచురల్ స్టార్ నాని క్లాప్ ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
View this post on Instagram
'హౌస్ ఆఫ్ ది డ్రాగన్', 'ఫాల్ ఔట్' వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన అలెజాండ్రో మార్టినెజ్, ఇప్పుడీ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 'గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్', 'బ్యాట్ మ్యాన్ ఫరెవర్', 'స్నోపియర్సర్' సినిమాల వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎరిక్ డస్ట్ర్ సైతం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీలో 'యానిమల్', 'ఓం శాంతి ఓం' వంటి సినిమాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్. మలయాళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ సినిమాలు చేసిన హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... ఇప్పుడు మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్ ఛాన్స్ ఇస్తాడా?
View this post on Instagram
మైథాలజికల్ యూనివర్స్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాతో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది విజయ్ దేవరకొండ టీం. మహేష్ బాబు - రాజమౌళిల 'వారణాసి', అల్లు అర్జున్ - అట్లీల 'రాక' తరహాలో గ్లోబల్ స్టేజిపై ఇండియన్ సినిమా సత్తా చూపించాలని ప్రయత్నిస్తోంది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: సచిన్ లోవలేకర్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ, స్క్రిప్ట్ & డైరెక్షన్: శౌర్యువ్.
Also Read: Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు - ప్రకాష్ రాజ్ రియాక్షన్
View this post on Instagram
ట్రెండింగ్ వార్తలు




















