అన్వేషించండి

Podharillu Serial Today April 22th: పెళ్లి పెద్దిచూపుల్లో ఏం జరిగింది..? ఆడపెళ్లివారు కండిషన్ సంగతి ఎత్తితే చక్రి ఎలా భయటపడేశాడు...?

Podharillu Serial Today Episode April 22th: పెళ్లి పెద్దిచూపుల్లో ఏం జరిగింది..? ఆడపెళ్లివారు కండిషన్ సంగతి ఎత్తితే చక్రి ఎలా భయటపడేశాడు...?

Podharillu Serial Today Episode: కన్నా కంగారుగా ఏడ్వడం చూసి మాధవ్‌ ఏం జరిగిందని నిలదీస్తాడు. వాడు విషయం బయటపెట్టేస్తాడేమోనని అంతా కంగారుపడతారు. కేశవ్‌ ఏదో విధంగా ఆ విషయాన్ని మభ్యపెట్టగా...అప్పుడే పెళ్లికూతురు కవిత మహాలక్ష్మీకి ఫోన్‌చేసి మాధవ్‌ గురించి అడుగుతుంది.వెంటనే మహా....ఫోన్‌ మాధవ్‌కు ఇచ్చి మాట్లాడి రమ్మని పంపిస్తుంది. ఇంతలో చక్రికి అసలు విషయం గుర్తుకువచ్చి అన్నయ్యను ఆ అమ్మాయి కండిషన్‌ గురించి అడితే....అన్నయ్య అసలు ఒప్పుకోడని అంటాడు. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారోనని వింటారు. నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా మీరు మాత్రమే నచ్చారని అందుకే వాటిని ఒప్పుకోలేదని కవిత చెబుతుంది. ఆమె మాటలకు మాధవ్‌ నవ్వుతూ సమాధానమిస్తుండటంతో చక్రి హ్యాపీగా ఫీలవుతాడు. హమ్మయ్యా అన్నయ్య నవ్వుతున్నాడంటే ఆ అమ్మాయి కండిషన్లు గురించి ఏం చెప్పలేదని అర్థమవుతుందని అంటాడు. చక్రి రోజూ మాదిరిగానే  క్యాబ్‌లో ప్యాసింజర్లను డ్రాప్‌ చేయడానికి వెళ్లగా...యూనివర్సిటీలో పనిచేసే పాతకస్టమర్‌ కలిసి అడుగుతుంది.ఇన్నాళ్లు ఏమైపోయావని ప్రశ్నిస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకుని కష్టాల్లో ఉన్నానని తన కథ అంతా చెబుతాడు. మా ఆవిడ సర్టిఫికేట్లు కాల్చివేశారని...వాటిని ఏదో విధంగా మీరు తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరతాడు. దానికి ఆమె తప్పకుండా చేస్తానని మీ ఆవిడను తీసుకుని ఓసారి రమ్మని చెబుతుంది. దీనికి చక్రి సరేనంటాడు.  మా ఆవిడకు సర్టిఫికేట్లు ఇప్పించి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేయాలని సంతోషపడతాడు.
              ఆడపెళ్లివాళ్లు సాయంత్రం 5గంటలకు పెళ్లిచూపులకు వస్తున్నారని మీరు ఇంట్లోనే ఉండాలని నారాయణను మహాలక్ష్మీ  ఆదేశిస్తుంది. ఎక్కడికి వెళ్లొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.అయితే తాను సాయంత్రానికి కావాల్సిన స్వీట్లు, పండ్లు తీసుకుని వస్తానని నారాయణ వెళ్తాడు.అయితే ఉన్నట్టుండీ ఆడపెళ్లివారు సాయంత్రం కాకుండా ఇప్పుడే వచ్చేస్తున్నామని చెప్పడంతో మహాలక్ష్మీ కంగారుపడిపోతుంది. వెంటనే మాధవ్‌కు కబురుపెట్టిస్తుంది. వీళ్లు ఇంత హడావుడిగా వస్తారని ఊహించలేదని అంటుంది. ఒకవేళ్లు అన్నయ్య దగ్గర కండిషన్ గురించి మాట్లాడితే ఏం చేద్దామని కేశవ్ అంటాడు. ఏదో విధంగా వాళ్ల దృష్టి మరల్చడానికి మీ అన్నయ్య చక్రి ఉన్నాడు కదా అని మహాలక్ష్మీ అంటుంది. వాళ్లు హడావుడిగా చేస్తుండగానే....మాధవ్‌ ఇంటికి వచ్చేస్తాడు.ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని అడగ్గా...ఆడపెళ్లివాళ్లు ముందే వచ్చేస్తున్నారని మీరు త్వరగా వెళ్లి రెడీ అవ్వండని మహాలక్ష్మీ చెప్పి పంపించేస్తుంది. ఇంతలో ఆడపెళ్లివారు రావడంతో వారికి నారాయణ స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు.
                      మా ఇంటికి పెళ్లిసంబంధం కోసం వచ్చి తిరిగి వెళ్లిన వాళ్లల్లో మళ్లీ వెనక్కి వచ్చింది మీరు ఒక్కరేనని నారాయణ అంటాడు.మా అమ్మాయికి కూడా చాలా సంబంధాలు వచ్చినా..మీ మాధవ్‌నే  చేసుకుంటానని మొండిగా కూర్చుందని పిల్ల తండ్రి చెబుతాడు.ఇంతల్లో పెళ్లిళ్ల బ్రోకర్‌ కలుగజేసుకుని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు కదా అని అడుగుతాడు. అమ్మాయి తరఫువాళ్లు పెట్టిన కండిషన్‌ సంగతి మీ అన్నయ్యకు చెప్పారా అని అడగడంతో వాళ్ల గుండెలు జారిపోతాయి. ఇంతలో చక్రి వాళ్లను మాటలతో తికమక పెట్టి ఆ విషయం మర్చిపోయేలా చేస్తాడు.దగ్గరలోనే మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అదే  ఖాయం చేయమని చక్రి చెబుతాడు. ఇంత త్వరగా పెళ్లి అంటే ఏర్పాట్లు చేయగలమా అంటే అన్నీ నేను చూసుకుంటానని చక్రి చెబుతాడు. పెళ్లివాళ్లు వెళ్లిపోయిన తర్వాత మాధవ్‌ చక్రిని డబ్బులు ఎక్కడివిరా అని అడిగితే....మహా కల్పించుకుని అన్నీ ఆయన చూసుకుంటానని అన్నారంటే ఉండే ఉంటవని చెబుతుంది.
                         అవసరం కోసం కేశవ్‌ జేబులో నుంచి చక్రి డబ్బులు తీసుకోవడంతో కేశవ్‌ ప్రశ్నిస్తాడు. నీ దగ్గర వాడుకోవడానికి 500 లేవుగానీ పెళ్లి చేస్తానని ప్రగల్బాలు పలుకుతావా అని నిలదీస్తాడు.దీంతో వాళ్లిద్దరూ కొట్టుకుంటారు. మహా వచ్చి వాళ్లపై కేకలు వేస్తుంది.ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా అని మండిపడుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
కలవారి కోడకలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
Godavari Serial Today November 12th: 'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
Nindu Manasulu Serial Today November 12th: నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 12:అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget