Nindu noorella savaasam Serial Weekly Roundup September 8th to 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: గడచిన వారం నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో ఏ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం
Nindu nooleralla savaasam serial weekly episode September 8th to 13th: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏం జరిగిందంటే..

Nindu noorella savaasam Serial weekly Episode: పక్క ప్లాట్‌లో ఉగ్రవాదులు ఉన్నారని అంజు భాగీకి చెప్తుంది. వెంటనే భాగీ అమర్‌కు ఫోన్ చేసి ఉగ్రవాదులు అపార్ట్‌మెంట్ లో ఉన్నారని చెప్తుంది. దీంతో అమర్ అలర్ట్ అవుతాడు. వెంటనే మీరందరూ మన ఇంటికి వెళ్లిపోండి. మీరు వెళ్లేటప్పుడు ఎక్కువ హడావిడి ఉండకూడదు. వాళ్లెవరికీ డౌట్ కూడా రాకూడదు అని చెప్పగానే భాగీ సరే అంటుంది. అందరినీ తీసుకుని వెళ్లబోతుంటే.. తీవ్రవాదులు రామ్మూర్తి ఇంట్లోకి వచ్చి భాగీ, పిల్లలులను బంధీలుగా చేసుకుంటారు.
అప్పుడే అక్కడకు తన ఫోర్స్ తో వస్తాడు అమర్. తీవ్రవాది అమర్‌కు ఫోన్ చేస్తాడు. హలో అమరేంద్ర నీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉంది. నువ్వు లోపలికి వస్తే వీళ్లను బయటకు పంపిస్తా.. శవాలుగా… నీకు అరగంట టైం ఇస్తున్నాను.. మేము వెళ్లిపోవడానికి రూట్ క్లియర్ చేయ్.. లేదంటే అరగంట తర్వాత ప్రతి అయిదు నిమిషాలకు ఒక డెడ్ బాడీ కిందకు వస్తుంది. అంటూ వార్నింగ్ ఇవ్వగానే.. అమర్ తన ఫోర్స్ మొత్తాన్ని వెనక్కి పిలుస్తాడు. ఇక టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసిన చిత్ర, మను హ్యాపీగా ఫీలవుతారు.
అమర్ దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తీవ్రవాదులను అమర్ కాల్చేస్తాడు. మిగిలిన తీవ్రవాదులు భాగీ పిల్లలను చంపేస్తారు. ఇక అమర్ నా సొంతం అవుతాడు అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది మనోహరి. మరోవైపు అమర్ తీవ్రవాదులను పట్టుకోవడానికి ఒక్కడే అపార్ట్‌మెంట్లోకి వెళ్తుంటాడు. ఉగ్రవాదులు బాంబులు వేసినా ఆగకుండా లోపలిక వెళ్లి వాళ్లన కొట్టి గన్స్ లాక్కుంటుంటాడు. ఇంతలో ఒక తీవ్రవాది చాటు నుంచి అమర్‌ను కాలుస్తాడు. అది చూసిన అంజు అమర్‌కు అడ్డుగా వస్తుంది. బుల్లెట్ అంజు బాడీలోకి వెళ్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మిలటరీ వాళ్లు ఉగ్రవాదులను పట్టుకుని వెళ్తుంటారు. అందులో ఒక ఉగ్రవాది కోపంగా.. అమరేంద్ర తప్పించుకున్నానని సంతోష పడకు నీ ఫ్యామిలీకి ఇంకా థ్రెట్ ఉంది. నీ ఫ్యామిలీని చంపమని ఒక లేడీ మాకు ఫోన్ చేసి చెప్పింది. మా నుంచి తప్పించుకున్నా ఆ లేడీ నుంచి మీ ఫ్యామిలీ తప్పించుకోలేదు. మీ ఫ్యామిలీని మొత్తం ఆ లేడీ చంపేస్తుంది అంటూ చెప్తూ వెళ్తాడు.
అమర్, అంజును ఎత్తుకుని కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. అమర్ వాళ్లు ఐసీయూ దగ్గర నిలబడి ఉంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు. పాప కండీషన్ ఎలా ఉందని అమర్ అడగ్గానే.. పాప కండీషన్ చాలా క్రిటికల్ గానే ఉందని.. బుల్లెట్ హార్ట్ పక్కన ఉంది. ఇమ్మిడియేట్‌గా సర్జరీ చేసి బుల్లెట్ రిమూవ్ చేయాలి. సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలని.. పాప బ్లడ్ గ్రూప్ ఏబీ నెగెటివ్.. అది చాలా రేర్ గ్రూప్ వందలో ఒక్కరికి మాత్రమే ఉంటుందని.. 24 గంటల్లోపు పాపకు సర్జరీ చేయాలి లేదంటే పరిస్థితి మా చేయి దాటిపోతుందని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అమర్ రాథోడ్‌ను బ్లడ్ తీసుకురమ్మని ఒక హాస్పిటల్‌కు పంపిస్తాడు.
అంజు విషయం తెలుసుకున్న సరస్వతి వార్డెన్ నిజం చెప్పడానికి హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ మన ఎదురుపడినా మనుకు వార్నింగ్ ఇచ్చి భాగీకి నిజం చెప్పడానికి వెళ్తుంది. కానీ మను చేసిన కుట్రకు బలై అదే హాస్పిటల్ లో పెషెంట్ గా జాయిన్ అవుతుంది. మరోవైపు రణవీర్ లాయరును అమర్ కిడ్నాప్ చేయించి రణవీర్ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కానీ లాయరు నిజం చెప్పడు. ఎంత టార్చర్ చేసినా రణవీర్ వైఫ్ గురించి అసలు చెప్పడు. ఇక హాస్పిటల్ లో దేవుడి దగ్గర ఉన్న పిల్లలను రెచ్చగొట్టి గణపతి నిమజ్జనం దగ్గరకు వెళ్లేలా చేస్తుంది మనోహరి. పిల్లలు బయటకు వెళ్లిపోయాక రణవీర్‌కు ఫోన్ చేసి పిల్లలు నిమజ్జనం దగ్గరకు వెళ్లారు నువ్వు వెళ్లి వాళ్లను చంపేయ్ అని చెప్తుంది. రణవీర్ సరే అంటూ తన మనుషులతో వెళ్తాడు. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















