Nindu Noorella Saavasam Serial February 2nd - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: పిల్లలపై కోపంతో రగిలిపోతున్న అమర్.. తప్పంతా మిస్సమ్మదే అంటున్న మనోహరి!
Nindu Noorella Saavasam Serial Today Episode: తండ్రి కోసం తన మామయ్యని పెళ్లి చేసుకుంటాను అని భాగి అనటంతో కథలో కీలక మలుపులు ఏర్పడతాయి
Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లల్ని మిస్సమ్మని మాట్లాడుకోనివ్వకుండా పిల్లల్ని అక్కడ నుంచి తరిమేస్తుంది మంగళ.
మంగళ : పిల్లల్ని ఐసీయూలోకి పంపించినందుకు తమ్ముడు పై కేకలు వేస్తుంది.
తర్వాత మిస్సమ్మ తండ్రి దగ్గరికి వెళ్తుంది. సడన్ గా అతను ఇబ్బంది పడుతుంటే కంగారుపడి డాక్టర్ని పిలుస్తుంది. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి రోజురోజుకీ అతని కండిషన్ దిగజారిపోతుంది. అతను క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు.
కాళీ : మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. బావకి ఏమైనా అయితే ఎలా అక్క అని అడుగుతాడు.
మంగళ : అవసరమైతే వాడి శవాన్ని కూర్చోబెట్టి అయినా మీ పెళ్లి జరిపిస్తాను అంటుంది.
ఆ మాటలు వింటున్న అరుంధతి కోపంతో రగిలిపోతుంది.
తర్వాత మిస్సమ్మ బయటికి వచ్చి నాన్న పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ గారు ఏమన్నారు అని అడుగుతుంది.
మంగళ: అతని ఆరోగ్యం బాగానే ఉందంట కానీ మనసులో ఏదో తీరని కోరిక ఉంది,అది తీరితే మనిషి త్వరగా కోలుకోవచ్చు అంటున్నారు అని అబద్ధం చెప్తుంది. ఆయనకి మిగిలిన కోరిక నీ పెళ్లి మాత్రమే అందుకే త్వరగా చేసేస్తే ఆయన కోలుకుంటారు. మేము వెళ్లి పనులు చూస్తాము నువ్వు మీ నాన్న దగ్గర ఉండు అని చెప్పి మిస్సమ్మని ఐసీయూలోకి పంపించేస్తుంది.
మరోవైపు రాథోడ్ అమర్ కి ఫోన్ చేసి పిల్లలు ఏమైనా ఇంటికి వచ్చారా అని అడుగుతాడు.
అమర్ : అదేంటి నువ్వు పిల్లలు తీసుకురావడానికే కదా స్కూల్ కి వెళ్ళావు అని అంటాడు.
రాథోడ్: నిజమే సార్ కానీ పిల్లలు ఇక్కడ లేరు పర్మిషన్ తీసుకుని పొద్దున్నే ఇక్కడ నుంచి వెళ్లారంట అని చెప్తాడు.
కోపంతో రగిలిపోతాడు అమర్ తల్లిదండ్రులను పిలిచి పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నామని మీకు చెప్పారా అని అడుగుతాడు.
అలాంటిదేమీ లేదు అసలు ఏం జరిగింది అని అడుగుతారు వాళ్ళు.
అమర్: జరిగిందంతా చెప్తాడు. వాళ్లకి ఫ్రీడం బాగా ఎక్కువైపోయింది, డిసిప్లిన్ తగ్గిపోయింది. కొడైకెనాల్ లో ఉండేటప్పుడు అసలు ఇలా జరిగేది కాదు. అసలు అబద్ధం చెప్పి స్కూల్ నుంచి బయటికి రావటం ఎవరు అలవాటు చేశారు అంటాడు.
మనోహరి : ఇంకెవరు, ఆ మిస్సమ్మ ఉంది కదా తనే అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తుంది. అలాంటిది తనని చూసి పిల్లలు అదే నేర్చుకుంటారు. ఆ మిస్సమ్మ ట్రైనింగ్ ఇదంతా అని చాడీలు చెప్తుంది.
అమర్ తల్లిదండ్రులు: మనోహరి ని మధ్యలో మిస్సమ్మ ఏం చేసింది నువ్వు అలా మాట్లాడకూడదు అని మందలిస్తారు.
పిల్లలు వస్తే కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్.
తర్వాత రోడ్డు మీదకి వచ్చిన పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో అనుమానం వస్తుంది ఏం చేద్దాం అని అనుకుంటారు.
అమ్ము : మనం ఏం అబద్ధం చెప్పినా డాడీ పట్టేస్తారు. అందుకే నిజం చెప్పేద్దాము పనిష్మెంట్ ఇస్తే అది నేనే తీసుకుంటాను అంటుంది.
అంజు: అందరం కలిసి తప్పు చేసాం కాబట్టి అందరం కలిసి పనిష్మెంట్ తీసుకుందాం అంటుంది. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ మిస్సమ్మ ఎందుకు హాస్పిటల్ లో ఉంది అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది.
అమ్ము : ఆయన మనకి తాతయ్య లెక్క కదా అందుకే డాడీ మిస్సమ్మని కేర్ తీసుకోమని చెప్పి ఉంటారు అంటుంది.
అంజు ఇంకా ఏదో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే ముందు ఇంటికి వెళ్తే డాడీ దగ్గర మన పరిస్థితి ఏంటో ముందు ఆలోచించు అని ఆనంద్ వాళ్ళు మందలిస్తారు.
మరోవైపు రామ్మూర్తిని చూడటానికి మిస్సమ్మ ఫ్రెండ్ వస్తుంది. ఆమెని డోర్ దగ్గరే ఆపేయమని తమ్ముడు కి చెప్తుంది మంగళ.
కాళీ: ఐ సి యు లోకి వెళ్తున్న భాగీ ఫ్రెండ్ ని ఆపే ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లడానికి వీల్లేదు తను నాకు కాబోయే భార్య అని చెప్తాడు.
అయినా ఆమె వినిపించుకోకుండా లోపలికి వెళ్తుంది. భాగిని ఓదారుస్తుంది. తర్వాత నీకు మీ మామయ్యకి పెళ్ళంట కదా, అందుకునువ్వు ఒప్పుకున్నావా అని అడుగుతుంది.
భాగి : అది మా నాన్న కోరిక అంట అందుకే నేను మా నాన్న కోరికని తీరుస్తాను ఆ పెళ్లి చేసుకుంటాను అంటుంది.
భాగీ ఫ్రెండ్ : అలా అని మీ నాన్న నీతో చెప్పారా, నాకు ఎందుకో ఆయన అలా చెప్పి ఉండరు అనిపిస్తుంది అంటుంది. అయినా వాడికి నీకు పెళ్లి ఏంటి అని భాగి ని తిడుతుంది.
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.