Nindu Noorella Saavasam Serial Today September 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పంచె గురించి అమర్ ను అడిగిన రామ్మూర్తి – తనకు తెలియదన్న అమర్
Nindu Noorella Saavasam Today Episode: అమర్ ఇంటికి రాగానే రామ్మూర్తి పంచె గురించి అడుగుతాడు. దీంతో సింపుల్ గా తనకు తెలియదని అమర్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్గిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్ లో అమర్ కోసం ఎదురుచూస్తున్న రామ్మూర్తి దగ్గరకు మిస్సమ్మ వస్తుంది. ఇంతదూరం వచ్చిన వారు లోపలికి రాకుండా పోతారా? మీరు లోపలికి రండి అని పిలుస్తుంది. అల్లుడు గారు వచ్చాకా నేను వస్తాను నువ్వు వెళ్లి తల్లి అని రామ్మూర్తి చెప్పడంతో మిస్సమ్మ వెళ్లిపోతుంది. పైనుంచి చూస్తున్న మనోహరి ఈ ముసలోడు కచ్చితంగా నిజాన్ని బయటపెట్టేవరకు వదిలేలా లేడు అని టెన్షన్ పడుతుంది. రాత్రి అయినా రామ్మూర్తి లోపలికి వెళ్లకుండా అక్కడే ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అమర్ వస్తాడు. అమర్ ను పట్టుకుని రామ్మూర్తి ఏడుస్తుంటాడు.
అమర్: ఏమైందండి.. ఇంతసేపు బయట ఏం చేస్తున్నారు.
రామ్మూర్తి: మీకోసమే ఎదురుచూస్తున్నాను.
మిస్సమ్మ లోపలి నుంచి పరుగెత్తుకొస్తుంది.
మిస్సమ్మ: సాయంత్రం నుంచి మీతో ఏదో మాట్లాడాలని బయటే ఉన్నారు ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు.
ఆరు: ఇదేంటి వీడియో తప్ప ఆడియో వినిపించడం లేదు. ఇప్పుడెలాగా?
మనోహరి: అమర్ ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాడు. అపయిపోయింది అంతా అయిపోయింది.
అమర్: నాతో మాట్లాడాల్సిన అర్జెంట్ ఏంటండి..
రామ్మూర్తి: ఆ పంచ మీకు ఎక్కడిది బాబు.
అని రామ్మూర్తి అడగ్గానే అమర్ షాక్ అవుతాడు. పైనుంచి చూస్తున్న మనోహరి షాక్ అవుతుంది. మంగళ హ్యాపీగా ఫీలవుతుంది. ఆ పంచె గురించి ఎంత అడుగుతున్నా మీరెందుకు ఏం చెప్పడం లేదు అని మిస్సమ్మ అడుగుతుంది. రామ్మూర్తి ఎమోషనల్ గా ఆరు దూరమయిన విషయం గుర్తు చేసుకుంటాడు. మిస్సమ్మ కూడా ఎమోషనల్ అవుతూ మీరు చెప్పేది నిజమా నాన్నా అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి అవునని నిజం చెప్తాడు.
రామ్మూర్తి: చెప్పండి బాబు ఆ పంచె ఎక్కడిది.
అమర్: ఆ పంచె మీదే అంకుల్
ఆరు: అసలు ఏమౌతుంది అక్కడ ఏమీ అర్థం కావడం లేదు.
మిస్సమ్మ: మీరు చెప్తున్నది నిజమా?
అమర్: నిజం మిస్సమ్మ నేను ఆరు పేరెంట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ పంచె దొరికింది.
రామ్మూర్తి: బాబుగారు నా కూతురు ఎక్కడుందో చెప్పండి. నా కూతురు కనిపిస్తే కాళ్లు కడిగి నా పాపం కడేసుకుంటాను.
మిస్సమ్మ: చెప్పండి మా అక్క ఎక్కడుంది. వెంటనే వెళ్లి కలుస్తాను.
అమర్: కుదరదు మిస్సమ్మ..
మిస్సమ్మ: ఎందుకు కుదరదు మిస్సమ్మ..
అమర్: ఎందుకంటే మీ అక్క గురించి నాకే సమాచారం తెలియదు.
అని అమర్ చెప్పగానే రామ్మూర్తి, మిస్సమ్మ ఎమోషనల్ అవుతారు. మరి ఆ పంచె ఎలా వచ్చిందని రామ్మూర్తి అడుగుతాడు. మరోవైపు పై నుంచి చూస్తున్న మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. రామ్మూర్తి ఏడుస్తుంటే.. అమర్ ఓదారుస్తాడు. త్వరలోనే మీ కూతురు గురించి నిజం తెలుస్తుందని చెప్పగానే ఆ పంచె తనకు ఇవ్వమని రామ్మూర్తి అడగ్గానే తన గుర్తు నా దగ్గర ఉన్నది అదొక్కటే అని చెప్పగానే మిస్సమ్మ మా అక్క గుర్తు మీ దగ్గర ఉండటమేంటి అని అడుగుతుంది. అంటే మీ అక్క దొరికే వరకు గుర్తు కోసం ఆ పంచె ఉండాలి కదా అని మాట మారుస్తాడు అమర్. దీంతో రామ్మూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మిస్సమ్మ: మా నాన్న చాలా బాధపడుతున్నారండి.
అమర్: ఇలా జరుగుతుందనే నేను నిజం చెప్పలేదు.
అని అమర్ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు తనకు ఏమీ వినిపించకపోవడంతో ఆరు కన్ఫీజ్ అవుతుంది. తర్వాత మరునాటి ఉదయం ఆరు.. రామ్మూర్తి ఏడుస్తూ వెళ్లిపోయిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఇంతలో గుప్త రావడంతో రాత్రి జరిగిన విషయం గుప్తకు చెప్తుంది. అసలు ఆయన మా ఆయనతో ఏం మాట్లాడారు. మిస్సమ్మ ఉండటంతో నేను వినలేకపోయాను అంటుంది. దీంతో గుప్త వాళ్లు మాట్లాడుకుంది నీ గురించే అని నోర జారి తర్వాత జోక్ చేశానని అంటాడు. ఇంతలో అమర్ బయటి నుంచి రావడంతో ఆరు వెళ్లి పిల్లల్ని పిక్నిక్ కు తీసుకెళ్లండని అని చెప్తుంది. ఏదో వినబడినట్లు అమర్ కొద్దిసేపు ఆగి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: గోల్డ్ స్మగ్లింగ్ లో రాజ్ అరెస్ట్ – హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలిన అపర్ణ