Brahmamudi Serial Today September 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: గోల్డ్ స్మగ్లింగ్ లో రాజ్ అరెస్ట్ – హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలిన అపర్ణ
Brahmamudi Today Episode: గోల్డ్ స్మగ్లింగ్ లో రాజ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు దుగ్గిరాల ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: మేము ఇక్కడికే రావాలని నీకెలా తెలుసు అని కావ్య అడుగుతుంది. దీంతో కళ్యాణ్ కర్చీప్ తీయడంతో.. కావ్య షాక్ అవుతుంది. తర్వాత కళ్యాణ్‌ను మోటివేట్ చేస్తుంది. బతకడం మంచిదే, కానీ, నచ్చినట్లు బతకడం కూడా ముఖ్యమే. మీరు వ్యక్తిగతంగా ఎదగండి. అప్పుడే ఇంట్లో వాళ్లు నమ్ముతారు. అని ఆటో డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. తర్వాత అపర్ణకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. రాజ్ వెంటనే డాక్టర్‌కు కాల్ చేయమని సుభాష్‌కు చెప్పడంతో సుభాష్ కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి అపర్ణను చెక్ చేస్తాడు.
డాక్టర్: మెడిసిన్ కరెక్ట్ గా వేసుకుంటున్నారా..?
అపర్ణ: లేదు డాక్టర్ బాగానే ఉందని ఆపేసాను.
డాక్టర్: సరే మెడిసిన్ రాసిస్తాను క్రమం తప్పకుండా వేసుకోండి.
మరోవైపు హాల్ లో రాహుల్ పోయిందంటావా? మామ్ అంటాడు. రాహుల్‌ను రుద్రాణి వారిస్తుంది. ఇంతలో డాక్టర్ బయటకు వస్తారు.
రాజ్: ఎలా ఉంది డాక్టర్.. డేంజర్ ఏం లేదుగా
డాక్టర్: మీరంత చదువుకున్నవాళ్లే కదా. ఇంత కేర్ లెస్ గా ఉంటే ఎలా? ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. మీకు మీరుగా నిర్ణయం తీసుకుని ట్యాబ్లెట్స్ మానేస్తే ఎలా?
అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
రుద్రాణి: పేరుకు దుగ్గిరాల కుటుంబం. ఇంట్లో ఇంతమంది ఉన్నాం. కానీ, మా వదిన ట్యాబ్లెట్స్ వేసుకుంటుందో కూడా చూసుకోవడం లేదు. ఏం కావ్య నువ్వు కూడా మీ అత్తను పట్టించుకోవట్లేదా?
ఇందిరాదేవి: నువ్వు కూడా ఇంటి సభ్యురాలివే కదా. నీకు బాధ్యత ఉంది కదా
రుద్రాణి: ఎప్పుడు పక్కనే ఉన్న అన్నయ్యకే తెలియదు. కోడలు కావ్యకు తెలియదు. ఇక నాకెలా తెలుస్తుంది అమ్మా..
ఇందిరాదేవి: అపర్ణకు ఇలా అయిందని జాలి పడకుండా ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా నీకు.
కావ్య: ఊరుకోండి అమ్మమ్మ. ఏమైనా గానీ రుద్రాణి గారు అన్నది కరెక్టే. నేనే అత్తయ్యగారిని చూసుకోవాల్సింది. మొదటి సారి తప్పు చేశాను. అత్తయ్యను చూసుకోవాల్సిన బాధ్యత నాది.
రాజ్: ప్రతి రెండు గంటలకు ఒక ట్యాబ్లెట్స్ వేయాలి. నీకు కుదరనప్పుడు నాకు చెప్పు. మమ్మీ ఆరోగ్య విషయంలో నెగ్లెట్ చేయకు
అని రాజ్ సీరియస్ గా కావ్యకు చెప్తాడు. మరోవైపు కళ్యాణ్ సంతోసంగా రూమ్ వస్తాడు. ఏంటి హ్యాపీగా ఉన్నావని అప్పు అడగ్గానే కళ్లు మూసుకో అని చెప్పి అప్పు చేతిలో 500 నోటు పెడతాడు కళ్యాణ్. మీ శ్రీవారి మొదటి సంపాదన అని కల్యాణ్ చెప్పగానే జాబ్ ఏంటని అడుగుతుంది. దీంతో డేటా ఎంట్రీ అని అబద్దం చెప్తాడు కళ్యాణ్. మరోవైపు రుద్రాణి ఎడమ కన్ను అదురుతుందని రాహుల్ కు చెప్తుండగానే పోలీసులు వస్తారు. ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు.
రాజ్: ఇన్‌స్పెక్టర్ గారు ఏం జరిగింది. ఎందుకు మా ఇంటికి వచ్చారు.
పోలీస్: ఇవాళ ఉదయం మా వాళ్లు దొంగ బంగారాన్ని పట్టుకున్నారు. అది స్వరాజ్ గ్రూప్ కంపెనీకే సప్లై అవుతుందని తేలింది.
సీతారామయ్య: ఎస్సై గారు మీరు పొడబడి ఉంటారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా కంపెనీలో అలాంటి పని ఎవరు చేయలేదు.
పోలీస్: సారీ సార్ మీ ఇంటికి అరెస్ట్ వారెంట్‌తో రావాల్సి వచ్చింది. పూర్తి ఆధారాలతోనే వచ్చాం. దీనికి పూర్తి బాధ్యత కంపెనీ ఛైర్మన్ అయినా స్వరాజ్‌దే కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తున్నాం.
అని ఎస్సై చెప్పడంతో రుద్రాణి, రాహుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అపర్ణ వచ్చి రాజ్ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకోవడం లేదని చెప్తుంది. ఇందిరాదేవి రాహుల్ ను నిలదీస్తుంది. కంపెనీ బాధ్యతలు నువ్వు కదా చూసుకుంటున్నావు అని అడుగుతుంది. అందరూ రాహుల్ ను ప్రశ్నిస్తారు. దీంతో ఈ నేరాన్ని బలవంతంగా నా కొడుకుపై మోపడానికి నేను ఒప్పుకోను అని రుద్రాణి అంటుంది. నేను రెండు రోజుల నుంచి మాత్రమే కంపెనీని చూసుకుంటున్నాను. ఇంతలో నేను ఇలాంటి ఫ్రాడ్ ఎలా చేస్తాను అని రాహుల్ అంటాడు. అయితే నేనే నైతిక బాధ్యత వహించి పోలీసులకు కోపరేట్ చేస్తాను అని రాజ్ అనడంతో ఇవాళ్టీ ఎసిసోడ్ అయిపోతుంది.