Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి సారీ చెప్పిన అమర్ - మనును హగ్ చేసుకున్న అంజు
Nindu Noorella Saavasam serial Today Episode September 22nd: రాత్రి వర్షంలో జరిగిన రొమాన్స్ గుర్తు చేసుకుని ఇంటికి వచ్చాక భాగీకి సారీ చెప్తాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ, అమర్ ఇంకా ఇంటికి రాలేదు.. నాగాకు ఫోన్ చేస్తే కలవడం లేదని మనోహరి టెన్షన్ పడుతూ హల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. డోర్ దగ్గర నిలబడి మనోహరిని చూసిన ఆరు అనుమానంగా ఇందేంటి ఇలా తిరుగుతుంది అని గుప్తను అడుగుతుంది. అది సృష్టి రహస్యం చెప్పకూడదు అంటాడు. ఇంతలో పిల్లలు అందరూ కిందకు వస్తారు.
ఆరు: గుప్తగారు ఆరు నడుస్తుందేంటి..?
గుప్త: ఇప్పుడు నడవడం ఏంటి.. ఎప్పటి నుంచో నడుస్తుంది కదా బాలిక
ఆరు: జోక్ చేస్తున్నారా.. గుప్తగారు.. ఆరు ఇప్పుడు నడుస్తుంది ఏంటా అని
గుప్త: గాయం నయం అయింది అందుకే నడుస్తుంది.
అంజు మనోహరి దగ్గరకు వెళ్తుంది.
అంజు: థాంక్స్ ఆంటీ… మా అమ్మ నాకు బర్తు ఇస్తే మీరు నా రీబర్తు ఇచ్చారు ఆంటీ నాకు మీరు మరో అమ్మ లాంటి వారు
ఆరు: అమ్మ లాంటిది కాదు నాన్న తను నీకు అమ్మే
అంజు: మీరు చేసిన సాయానికి థాంక్స్ చెప్తే సరిపోదు ఆంటీ మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా..?
మను: అదేం అవసరం లేదు అంజు నువ్వు పైకి వెళ్లి రెస్ట్ తీసుకో వెళ్లు
ఆరు: ఓసేయ్ రాక్షసి కన్న కూతురు కౌగిలి అడిగితే అసహ్యించుకుంటున్నావేంటే..? నువ్వు అసలు అమ్మవేనా..?
గుప్త: తనలోని అమ్మ తనం తన బిడ్డను వదిలేసినప్పుడే కనుమరుగు అయింది బాలిక
అంజు: ఫ్లీజ్ ఆంటీ మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవాలని ఉంది ఆంటీ
ఆరు: ప్రపంచంలో ఏ పసిబిడ్డకు ఈ దుస్థితి రాకూడదు గుప్త గారు.. పిల్లలకు అమ్మ ఒడే ఊయల.. అమ్మ ముద్దే గోరు ముద్ద.. అమ్మ మాటే తొలి మాట. అమ్మ కౌగిలే ఆనంద లోగిలి.. ఆ విషయం ఈ దుర్మార్గురాలికి ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో..
అంజు: ఫ్లీజ్ ఆంటీ ఒక్కసారి హగ్ చేసుకోనివ్వండి నన్ను
మను సరే అంటూ అంజును హగ్ చేసుకుంటుంది.
మను: ( మనసులో) అబ్బా ఎంత సేపే జలగలా నా రక్తం పూల్చింది చాలక మళ్లీ ఇలా హత్తుకున్నావేంటే..?
అంజు: మిమ్మల్ని హగ్ చేసుకుంటే అచ్చం మా అమ్మను హగ్ చేసుకున్నట్టే ఉంది ఆంటీ
మను: ( మనసులో) మీ అమ్మను చంపినట్టే నిన్ను కూడా చంపేయాలనుకున్నానే.. కానీ బతికిపోయావు
అంజు: మా అమ్మ లేనందుకు బాధగా ఉన్నా మీరు ఉన్నందుకు హ్యపీగా ఉంది ఆంటీ
మను: ( మనసులో) మీ అమ్మను చంపి దాని జీవితం తీసుకుందామనుకున్నాను. అది చచ్చింది కానీ నేను కోరుకున్నది ఏదీ ఇంకా నాకు దక్కలేదు. కనీసం నిన్ను చంపైనా భాగీని సైడ్ చేద్దామనుకున్నాను. కానీ నేనే రక్తం ఇచ్చి నిన్ను బతికించుకోవాల్సి వచ్చింది.
అంజు: థాంక్యూ సోమచ్ ఆంటీ ఐలవ్ యూ
అని అంజు కిస్ ఇవ్వగానే.. మనోహరి కోపంగా అంఏపే అసహ్యంగా చూస్తుంది.
ఆరు: కన్న బిడ్డ స్పర్శను గుర్తు పట్టలేని తల్లి ఉంటుందా గుప్తగారు. ఆ బిడ్డ కౌగిలికి ముద్దుకు స్పందించని తల్లి ఉంటుందా గుప్తగారు..
గుప్త: ఉంటారు బాలిక నువ్వు నీ కళ్లారా చూస్తున్నావు కదా..? దీనినే విధి అంటారు.
ఆరు: ఇదేం విధి గుప్తగారు.. మనుషుల ఎమోషన్స్ తో ఆడుకోవడమేనా..? విధి అంటే.. అసలు రాత్రి అనగా మా ఆయన భాగీ బయటకు వెళ్లారు. ఇంత వరకు రాలేదు
గుప్త: కంగారు పడకు బాలిక వచ్చేస్తారులే
ఆరు: వచ్చేస్తారా..? అంటే వాళ్లు ఎక్కడున్నది మీకు తెలుసా గుప్త గారు చెప్పండి.. ఎక్కడున్నారు..
గుప్త: అది సృష్టి రహస్యం బాలిక చెప్పకూడదు
అంటూ గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత అమర్, భాగీ ఇంటికి వస్తారు. భాగీ సిగ్గు పడుతూ బెడ్ రూంలోకి వెళ్తుంది. వెనకే అమర్ వస్తాడు. వాళ్లకు తెలియకుండా మనోహరి వచ్చి తలుపు చాటు నుంచి గమనిస్తుంది.
అమర్: భాగీ ఐయామ్ సారీ
మను: అమర్ ఎందుకు సారీ చెప్తున్నాడు.. అసలు సారీ చెప్పాల్సిన తప్పు అమర్ ఏం చేశాడు
భాగీ: సారీ ఎందుకండి నేను ఇప్పుడే మీకు పరిపూర్ణంగా భార్యను అయ్యాను.
మను: ఇక ఇద్దరి మధ్య పిజికల్ రిలేషన్ కూడా మొదలైందా..? నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయాను.. ఇవాళ నేనే వాళ్లిద్దరూ కలిసేలా చేశానా..? అనవరసంగా ఆ నాగు గాణ్ని పంపించానా..? అసలు ఎందుకు నా ప్లాన్స్ అన్ని బెడిసికొడుతున్నాయి
బాగీ: మనసా వాచ కర్మణా త్రికరణ శుధ్దిగా ఇప్పుడు నేను మీ సహధర్మచారిణిని. నన్ను ప్రేమతో పూర్తి హక్కుతో మీ భార్యను చేసుకున్నారు
అంటూ భాగీ చెప్తూ అమర్‌ను హగ్ చేసుకుంటుంది. అది చూసి మనోహరి చిరాకుతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















