అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాకు వార్నింగ్‌ ఇచ్చిన గుప్త – ఘోరాను ఫోకస్‌ చేసిన అమర్‌  

Nindu Noorella Saavasam Today Episode:  ఘోర దగ్గరుక వెళ్లిన గుప్త నువ్వు ఎంత చేసినా అమ్మవారి శక్తి ముందు ఓడిపోతావని హెచ్చరించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:   అమర్‌ ఇబ్బంది పడతాడు అనగానే నువ్వన్నది నిజమే మనోహరి కానీ మంచి జరగాలని నేనే దీక్ష చేస్తున్నాను అని అమర్‌ చెప్తాడు. ఇంతలో భాగీ మనోహరిని దీక్ష చేస్తావా? అని అడుగుతుంది. దీంతో నేను చేయనని చెప్తుంది. దేవుడి దగ్గర అలా మాట్లాడొద్దని భక్తితో ఉండాలని నిర్మల చెప్పగానే దేవుడంటే భయం ఉంటేనే కదా అత్తయ్యా భక్తి వచ్చేది అంటుంది భాగీ.  గార్డెన్‌ లో ఘోర హ్యాపీగా ఫీలవుతుంటాడు.

గుప్త: అయ్యో బాలిక ఆత్మను బంధించినచో అంతా అయిపోయిందని సంతోసపడుతున్నారా. ఈ కుటుంబం దీక్ష చేసి ఆ బాలికను కాపాడతారు.

లోపల అందరూ పూజ చేస్తుంటారు. మరోవైపు ఘోర మళ్లీ పూజకు అంతా సిద్దం చేసుకుని ఉంటాడు.

ఘోర: మనోహరి దీక్ష ఆపించిన వెంటనే మనోహరికి సాయం చేసి దేవాను కలిసి మళ్లీ శక్తులు పొందాలి. ఏంటి ఆత్మ దీక్ష నిన్ను  కాపాడుతుందని ఆనంద పడుతున్నావా? నువ్వు నా చేతుల్లోంచి ఎప్పటికీ తప్పించుకోలేవు.

 అని నవ్వుతుంటే అమర్‌ ఇంట్లోంచి అమ్మవారి విగ్రహం నుంచి ఒక శక్తి ఘోర దగ్గరుక వెళ్లి సీసాలో ఉన్న ఆరు ఆత్మను బయటకు పంపిచివేస్తుంది. ఆత్మ నా పర్మిషన్‌ లేకుండా బయటకు ఎందుకు వచ్చింది. అని అరుస్తుంటే..

గుప్త: నీ బంధనం బలహీనపడుతుంది ఘోర.

ఘోర: ఎవరు ఎవరది.. కనిపించండి… ఓహో గుప్తానా..?

ఆరు: గుప్త గారు నేను ఇక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పారిపోలేకపోతున్నాను కాపాడండి.

ఘోర: నిన్నెవ్వరూ విడిపించలేరు. నువ్వు బంధీగా ఉంది ఈ ఘోర దగ్గర. ఏదో నీ అదృష్టం బాగుండి సీసాలోంచి బయటకు వచ్చావు. నీ చుట్టు ఉంది నా బంధనం. నిన్ను ఆడించేది నా తంత్రం. గుప్తగారిని నానుంచి కాపాడి తీసుకెళమను.

ఆరు: గుప్త గారు నీ దగ్గర శక్తులు ఉన్నాయి కదా? నన్ను కాపాడి తీసుకెళ్లండి.

ఘోర: ఏంటి ఆత్మ నీ గుప్తుల వారు ఎప్పుడు తీసుకెళ్తారంట

గుప్త: ఘోర చెప్పింది నిజం బాలిక నేను నిన్ను కాపాడి తీసుకెళ్లలేను. ఎందుకంటే అది నా కర్తవ్యం కాదు కనక. నిన్ను కాపాడుటకు నీ కుంటుంబం మొత్తం కష్టపడుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీ పది దేవుణి దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ దీక్ష చేస్తున్నారు.

ఘోర: లేదు.. ఇది నిజం కాదు.

గుప్త: మాటలకే ఇటులవుతున్నావు. నేను చూపించునది చూస్తే ఏమవుతావో..

అంటూ గుప్త మంత్రించి అమర్‌ ఇంట్లో జరిగే పూజను ఘోర, ఆరుకు చూపిస్తాడు.  ఇంతలో ఘోర మరో మంత్రం చదివి మళ్లీ ఆరును సీసాలో బంధించి తీసుకుని వెళ్తాడు. మరోవైపు పూజ కంప్లీట్‌ చేసిన భాగీ హారతి ఇస్తుంది.

భాగీ: అందరూ సూర్యాస్తమయం అయ్యే వరకు ఏమీ తినకూడదు. సాయంత్రం పూజ అయ్యాక కొంత మందికి అన్నం పెట్టాక అప్పుడు మనం తినాలి.

రామ్మూర్తి: బాబు గారు నా కోసం మీరంతా దీక్ష చేశారు. చాలా సంతోషంగా ఉంది.

అమర్: ఇష్టమైన వాళ్ల కోసం చేసినప్పుడు అది బాధ అనిపించదు అండి.

భాగీ: చెప్పకూడదు అని కాదండి. చెప్పి బాధపెట్టడం ఇష్టం లేక

రామ్మూర్తి: అవును బాబు.. కనిపించని కూతురుకి ఎదో కష్టం వచ్చిందని భయపడి.. బాధపడి ఏదో చెప్పకూడదు అని చెప్పలేదు

భాగీ: నాకు నాన్నకు ఒకటే సారి ఎందుకో భయమూ బాధ వచ్చాయి. కంటి ముందు అందరూ బాగానే ఉన్నారు. కానీ కంటికి కనిపించని అక్కకు ఏమైనా అవుతుందేమోనని ఆ తల్లిని అక్కకు తోడుగా ఉండమని ఈ దీక్ష చేస్తున్నాము.

నిర్మల: మిస్సమ్మ మీ అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. మీరు ఉండగా తనకేమీ కాదు.

అంటూ మాట్లాతుండగా అమర్‌ బయటకు వెళ్తాడు. ఘోర గురించి.. ఆరు గురించి ఆలోచిస్తాడు. రాథోడ్‌ వస్తాడు. చనిపోయిన మేడం కోసం వీళ్లు పడుతున్న బాధ చూసి మీరు బాధపడుతున్నారా? సార్ అని అడుగుతాడు.

అమర్‌: అసలు ప్రాణాలతో లేని ఆరుకు కష్టమొచ్చిందని వీళ్లకు ఎందుకు అనిపించింది రాథోడ్‌. ఆ పకీర్‌ కూడా నిన్న మాట్లాడిని మాటలు గుర్తున్నాయా..? ఇంటికొచ్చిన స్వామి ఆస్తికలు గంగలో కలిపే వరకు ఆత్మ పరమాత్మలో కలవదు అని చెప్తారు. పకీర్‌ చెప్పిన దాని ప్రకారం నాకు ముఖ్యమైనది వాడు తీసుకెళ్లాడు అని చెప్పాడు. నాకు ముఖ్యమైనది ఏంటి..?

రాథోడ్‌: అరుంధతి మేడం సార్‌..

అమర్‌: వాడు తీసుకెళ్లింది ఆరునా..? ఆరు ప్రాణాలతో లేదు..? అంటే వాడు తీసుకెళ్లింది  ఆరు ఆత్మనా..? నిజంగానే ఆరు ఆత్మ ఇక్కడే ఉందా? నిజమా రాథోడ్‌ ఇది సాధ్యమా..?

   అని అమర్‌ ఎమోషనల్‌ గా అడగ్గానే రాథోడ్‌ తనకు బాల్‌ తిరిగి వచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. అమర్‌ కూడా ఆరు తన దగ్గరే ఉన్నట్టు ఫీలయిన సందర్భాలు గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఘోర, అమర్‌ ఇంటికి వస్తాడు. మనోహరి తిడుతుంది. అమర్‌ చూస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది. ఇంట్లో భోజనాలు చేయడానికి ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా చేస్తానని ఘోర చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
China Palm Payment System: చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమనSajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
China Palm Payment System: చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
చెయ్యి ఊపితే అకౌంట్లో డబ్బులు కట్ - ఆశ్చర్యపరుస్తున్న చైనా టెక్నాలజీ!
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Best Selling Royal Enfield Bike: బెస్ట్ సెల్లింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే - ప్రతి నెలా వేలల్లో సేల్స్!
బెస్ట్ సెల్లింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే - ప్రతి నెలా వేలల్లో సేల్స్!
Fire Accident: బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Hyderabad News: రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
Embed widget