Nindu Noorella Saavasam Serial Today October 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఫోటో చూడబోయిన భాగీ – ఇంట్లో కరెంట్ పోయేలా చేసిన గుప్త
Nindu Noorella Saavasam Today Episode: అంజు చేతిలో ఉన్న ఆరు ఫోటో తీసుకుని భాగీ చూస్తుందని పసిగట్టిన గుప్త ఇంట్లో కరెంట్ పోయేలా చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today October 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఫోటో చూడబోయిన భాగీ – ఇంట్లో కరెంట్ పోయేలా చేసిన గుప్త nindu Noorella Saavasam serial today episode October 21st written update Nindu Noorella Saavasam Serial Today October 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఫోటో చూడబోయిన భాగీ – ఇంట్లో కరెంట్ పోయేలా చేసిన గుప్త](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/20/1bbd2f71ca59f035cf2642e08e85477c1729437293428879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ పైకి రూంలోకి వెళ్లగానే పిల్లలు ముగ్గురు పడుకుని ఉంటారు. అమ్ము ఒక్కతే మెలుకువగా ఉంటుంది. అంజు పడుకుందా? అని అడుగితే అవునని.. చెప్తుంది అమ్ము. మరి ఆరు అక్క ఫోటో అని అడగ్గానే అంజు పట్టుకునే పడుకుందని చెప్తుంది. నాది అనుమానమో కాదో తెలసుకుంటే ఆ గిఫ్ట్ ఇచ్చింది ఆరు అక్కనో కాదో తెలుస్తుంది అని మనసులో అనుకుని అమ్మును కూడా పడుకోమని చెప్తుంది. అమ్ము పడుకుంటుంది. మరోవైపు అమర్ రూంలోకి వెళ్లిన మనోహరి పిల్లలక ఆరు ఫోటో ఇచ్చి బాధపెట్టడం కరెక్టేనా అని అడుగుతుంది. ఫోటో ఎవరిచ్చారు అని అడిగి హల్లోకి వెళ్తాడు అమర్.
అమర్: అమ్మా నాన్నా ఆరు ఫోటో మీరు పిల్లలకు ఇచ్చారా?
శివరాం: అది అంజు బాధపడుతుంటే కొంచెం ..
అమర్: కొంచెం కాదు నాన్నా.. చాలా బాధపడతారు. రాత్రంతా ఏడుస్తుంటారు. హెల్త్ పాడు చేసుకుంటారు.అందుకే ఆరు ఫోటోను నేను వాళ్లకు ఇవ్వలేదు. ఒక్కమాట నాకు చెప్పి ఉండాలి.
అంటూ అమర్ పైకి వెళ్తాడు. పైన పిల్లల దగ్గర మెలుకువగా ఉన్న భాగీ అంజు దగ్గర ఫోటో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బయట గుప్త ఉలిక్కి పడి లేస్తాడు.
గుప్త: బాలిక చిత్రపటమును ఇప్పుడు మిస్సమ్మ చూసినచో బాలిక ఉనికి అందిరకీ తెలియును. అటు పిమ్మట బాలికకు ఇప్పుడు పొంచి ఉన్న ప్రమాదం కంటే ఎక్కువ ప్రమాదం గోచరించు సూచనలు కనిపిస్తున్నాయి. ఏమీ చేయవలే..
అని ఇంట్లో కరెంట్ పోయేటట్లు చేస్తాడు గుప్త. ఇంతలో అమర్ వచ్చి భాగీని రూంలోంచి బయటకు లాకొస్తాడు. భాగీ చేతిలో ఫోటో లాగేసుకుంటాడు. ఇంతలో కరెంట్ వస్తుంది.
భాగీ: ఏవండి అక్క ఫోటో
అమర్: పిల్లలకు ఇవ్వొద్దని చెప్పాను కద మిస్సమ్మ.. ఆరు ఫోటో చూస్తే పిల్లలు ఏడుస్తారని తెలుసు కదా?
భాగీ: అది కాదండి ఒక్కసారి..
అమర్: ఎందుకు మళ్లీ పిల్లలు ఏడ్వడానికా? చూశావు కదా ఎలా డల్ అయిపోయారో..
భాగీ: అది కాదండి ఒక్కసారి..
అమర్: ఇంకేం మాట్లాడకు మిస్సమ్మ వెళ్లి పడుకో..
అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు.
భాగీ: ఎందుకు అక్క ఫోటో నేను చూడకుండా ఎప్పుడూ ఇలా అయిపోతుంది. ఎవరో కావాలనే అపుతున్నట్లు అవుతుంది.
అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది భాగీ. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. ఆరు బాధపడుతుంది.
ఆరు: ఘోర నన్ను వదిలేయ్.. నేను వెళ్లి నా పిల్లలను కాపాడుకోవాలి.
ఘోర: నీ పని కాపాడటం కాదు ఆత్మ.. నాశనం చేయడం. ఇకనుంచి దేన్ని కాపాడలేవు. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను నిన్ను ఈ లోక వినాశనానికి వాడతా..? నీ స్థానం ఆ మనోహరికి ఇస్తాను. నీ భర్తకు మనోహరిని భార్యను చేస్తాను.
ఆరు: వద్దు ఫ్లీజ్.. వద్దు అది నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. రాక్షసి అది. నీకు దండం పెడతాను.
ఘోర: నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది ఆత్మ.. కన్నవాళ్లు వదిలేశారు. కట్టుకున్నోడితో నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు నమ్మిన స్నేహం నిన్ను కాటికి పంపింది. ఆ భగవంతుడు నీ మీద జాలి పడి నిన్ను భూలోకంలో ఉంచితే నువ్వు నా కంటపడ్డావు. ఇప్పడు నా లక్ష్యాన్నికి బలి కాబోతున్నావు.
అంటూ పూజ చేస్తుంటాడు. తర్వాత రోజు భాగా ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. కరుణ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎలాగైనా ఆరు ఫోటో చూడాలనుకుంటుంది. మనోహరి దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలి అని చెప్తుంది.
మనోహరి: నీతో నాకు మాటలేంటి..? అయినా నేను బయటకు వెళ్తున్నాను నాకు టైం లేదు.
భాగీ: ఒక్కనిమిషం. నేను మాట్లాడాలి అనుకుంటుంది అమరేంద్ర గారి గురించి ఆరు అక్క గురించి.. నువ్వు ఈ ఇంటికి చెడు చేయాలని చూసి ఉండొచ్చు. కానీ మనఃస్పూర్తిగా ఆయన మంచి కోరతావని నాకు తెలుసు. అందుకే నీ దగ్గరకు వచ్చాను.
మనోహరి: సరే దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు.
అని అడగ్గానే నేను చూస్తున్న అక్క.. నేను చూడలేకపోయిన ఆరు అక్కా ఒక్కతే అన్న అనుమానం వస్తుంది. పక్కింటి అక్క ఆరు అక్కా ఒక్కరే అవడం అంటూ చెప్తుంది. నేను చూసింది.. నాతో మాట్లాడింది ఆత్మ అయి ఉండాలి అని చెప్తుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. నేను అర్జెట్ గా ఆరు అక్క ఫోటో చూడాలి అని భాగీ చెప్తుంది. భాగీకి వేరే ఫోటో చూపిస్తుంది. ఈవిడ ఆరు అక్కనేనా? అని భాగీ అడగ్గానే అవునని చెప్తుంది మనోహరి. భాగీ వెళ్లిపోతుంది. మరోవైపు రామ్మూర్తి స్కూల్ లో లంచ్ చేస్తుంటే పిల్లలు వచ్చి మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? అని అడుగుతారు. దీంతో రామ్మూర్తి మీరు ఎవ్వరికీ చెప్పొద్దంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)