Nindu Noorella Saavasam Serial Today November 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అడవిలో చిక్కుకుపోయిన అమర్ ఫ్యామిలీ – అయోమయంలో రాథోడ్
Nindu Noorella Saavasam serial Today Episode November 30th: రామ్మూర్తి వాళ్ల ఊరికి వెళ్తూ రౌడీల వల్ల దారి తప్పి అడవిలోకి వెళ్లిపోతారు భాగీ వాళ్లు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: డైవర్షన్ బోర్డు చూసి అడవిలోకి వెళ్లిపోతారు భాగీ వాళ్లు. చాలా దూరం వెల్లాక రోడ్డుకు అడ్డంగా రాళ్లు ఉంటాయి. అవి చూసిన రాథోడ్ కారు ఆపేస్తాడు. డీప్ ఫారెస్ట్ కావడంతో ఎవరు కిందకు దిగొద్దని రాథోడ్ చెప్పి తాను ఒక్కడే కారు దిగి ముందుకు వెళ్తాడు. వెనక వస్తున్న మనోహరి కారు ఆపేస్తుంది.
రామ్మూర్తి: ఏమైందని మనోహరి కారు ఎందుకు ఆపేశావు..
మను: ముందు రాథోడ్ కారు అపేశాడు..
రామ్మూర్తి: ఎందుకు ఆపాడబ్బా…?
అంటూ రామ్మూర్తి కారు దిగి రాథోడ్ దగ్గరకు వెళ్తాడు. రామ్మూర్తిని చూసి అందరూ కారు దిగుతారు.
రామ్మూర్తి: ఏంటి రాథోడ్ కారు ఆపావు..? ఏమైంది..?
రాథోడ్: సార్ రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు సార్ అటు వైపేమో డేవర్షన్ బోర్డు పెట్టారు
అందరూ రాళ్లను చూసి భయపడుతుంటారు.
చంభా: ఇది నీ పనేనా మనోహరి
మను: కాదు నేను ఇక్కడ ఏలా చేస్తాను
చంభా: మరి ఎవరు చేసి ఉంటారు
మను: రణవీర్ చేసి ఉంటాడు
చంభా: రణవీరా..? అక్కడ ఇంట్లో ఉన్న రణవీర్ ఇక్కడకు వచ్చి ఇలా రాళ్లు ఎలా పెట్టగలడు
మను: రణవీర్ ఇక్కడకు రాలేదు.. రౌడీలను పురమాయించి ఇక్కడ ఈ పని చేయించి ఉంటాడు
చంభా: ఎందుకు చేయించి ఉంటాడు
మను: వీళ్లను అడవి దారి పట్టించి దారి మర్చిపోయేలా చేస్తే చంపేయడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకే చేసి ఉంటాడు
చంభా: మరి ఈ విషయం రణవీర్ నీతో చెప్పాడా..?
మను: లేదు.. కానీ రణవీర్ ప్లాన్ ఇదే.. అని నాకు అర్థం అయింది
రామ్మూర్తి: ఇప్పుడు ఎలా రాథోడ్.. ఏం చేద్దాం..
రాథోడ్: ఏముంది సార్ రాళ్లు తీసేసి ముందుకు వెళ్లడమే..
భాగీ: రాథోడ్ రోడ్డు రిపేరులో ఉందని బోర్డు పెట్టారు కదా..? ఒకవేల ముందుకు వెళ్లినా కూడా వెనక్కి రావాలి కదా
రాథోడ్: మిస్సమ్మ నాకు ఈ రాళ్ల మీద ఆ బోర్డు మీద ఎందుకో డౌటుగా ఉంది
మను: రాథోడ్ నీకెందుకు డౌటు అది గవర్నమెంట్ వాళ్లు పెట్టిన బోర్డే కదా..?
రాథోడ్: ఎక్కడుంది మేడం.. గవర్నమెంట్ వాళ్లు అయితే రోడ్డుకు అడ్డుగా ఇలా రాళ్లు పెట్టరు..బారీ కేడ్స్ పెడతారు. పైగా ఫారెస్ట్ వాళ్ల ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు అక్కడ
మను: ఇదేమైనా సిటీనా..? బారికేడ్స్ పెట్టడానికి ఇటు సైడు వెళ్లమని బోర్డు పెట్టారు కదా..?
రాథోడ్: అందుకే నాకు డౌటు వస్తుంది. ఆ బోర్డు పెట్టిన వాళ్లు బారికేడ్స్ ఎందుకు పెట్టలేదు.. పైగా ఆ రోడ్డు ఫారెస్ట్ లోకి వెళ్తుంది
రామ్మూర్తి: మా ఊరి రోడ్డు గురించి అయితే నాకు తెలుసు కానీ ఈ రోడ్డు గురించి నాకు తెలియదు.. ఈ రోడ్డు గుండా వెళితే మెయిన్ రోడ్డుకు వెళ్తామా రాథోడ్
మను: ఎందుకు కలవదు.. కచ్చితంగా కలుస్తుంది అనుకుంటా..?
రాథోడ్: ఏంటి మేడం మీరు ఇంతకు ముందే వెళ్లి చూశారా..? అంత కచ్చితంగా చెప్తున్నారు..?
మను: రాతోడ్ జనరల్‌గా రోడ్లు రిపేరు చేస్తున్నప్పుడు కొద్ది దూరమే వర్క్ నడుస్తుంది. తర్వాత నార్మల్ గానే ఉంటుంది కదా..?
భాగీ: ఈ డిష్‌కర్షన్ అంతా ఎందుకు రాథోడ్ ఒకసారి ఆయనకు కాల్ చేయ్
అని చెప్పగానే.. రాథోడ్ సెల్ ఫోన్ తీసి చూస్తాడు. అందులో సిగ్నల్ ఉండదు. దీంతో రాథోడ్ సిగ్నల్ లేదు మిస్సమ్మ అని చెబితే.. మనం సిటీ దాటి చాలా దూరం వచ్చాం ఇక్కడ సిగ్నల్ ఉడదు అని మనోహరి చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















