Nindu Noorella Saavasam Serial Today June 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఇంట్లోకి ఆరు వచ్చిందన్న అమర్ - షాకైన కుటుంబం
Nindu Noorella Saavasam Today Episode: పిల్లలు బుక్స్ చూసిన అమర్ ఆరు ఇంట్లోనే తిరుగుతుందని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రూంలో ఆరు వచ్చి బుక్స్ సర్దడం చూస్తారు ఆకాష్, అంజు వెంటనే వెళ్లి మిస్సమ్మను తీసుకురావాలని కిందకు వెళ్తారు. పిల్లలను చూసిన గుప్త కోపంగా ఆరును తిడుతూ అందరూ పైకి వస్తున్నారు వెళ్దాం పద బాలిక అంటాడు. ఇంతలో కిందకు వెళ్లిన అంజు, ఆకాష్ ఇద్దరూ కలిసి భాగీ, పిల్లలను బలవంతంగా పైకి గదిలోకి తీసుకొస్తారు. బెడ్ మీద అని బుక్స్ రాపర్స్ వేసి పద్దతిగా సర్దుకుని ఉంటాయి. భాగీ వాళ్లు పైకి వస్తున్నప్పుడే ఆరు, గుప్త ఆ రూంలోంచి బయటకు వెళ్లిపోయి ఉంటారు. బుక్స్ చూసి భాగా షాక్ అవుతుంది.
భాగీ: రాపర్ ని ఇంత చక్కగా వేశారని నాకు చెప్పడానికి నన్నే హెల్ప్ అడిగి తీసుకొచ్చారా..?
అంజు: అది కాదు మిస్సమ్మ
కింద నుంచి శివరాం, భాగీని పిలుస్తాడు భాగీ వెళ్లిపోతుంది.
అమ్ము: అంజు ఇన్ని రోజులు నీకు టాలెంట్ ఉందంటే ఏమో అనుకున్న కానీ మరీ ఇంత ఉంది అనుకోలేదు
ఆనంద్: మేము మిస్సమ్మ దగ్గరకు వెళ్లి వచ్చే లోపు ఇన్ని బుక్స్ రాపింగ్ ఎలా చేశారు
అమ్ము: అంత స్పీడుగా ఎలా వేశావే
అంజు: రాపింగ్ మేము చేయలేదు
ఆకాష్: బ్రౌన్ షీట్స్ వాటంతట అవే రాపింగ్ అయిపోయాయి
అమ్ము: ఫ్రాంక్ అంటే అలా కాదురా అమ్మే వచ్చి రాపింగ్ చేసింది అని చెప్పండి అప్పుడు నమ్ముతాం
అని చెప్పి వెళ్లిపోతుంది.
అంజు: అమ్ము మేము చెప్తుంది నిజం
ఆకాష్: కావాలంటే ఈ బుక్‌లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూడు
ఆ మాటలకు ఆరు షాక్ అవుతుంది.
ఆరు: అదేంటి గుప్త గారు నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు అనుకుంటే కన్పీజన్ అవుతున్నారు.
అనుకుంటూ వెళ్లిపోతుంది. వినోద్, చిత్ర ఫీ వెడ్డింగ్ షూట్‌లో ఉంటారు. పక్కనే మనోహరి చూస్తుంది.
చిత్ర: నీ ఫేస్‌లో ఆ జలసీ చూడాలనే మను నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది.
మను: ఇది దీని ఓవరాక్షన్ పెళ్లి జరగడమే ఎక్కువ అనుకుంటే మళ్లీ ఫోటో షూట్ అని ఎక్కువ చేస్తుంది.
చిత్ర: మను కొంచెం వాటర్ తీసుకుని రావా..?
వాటర్ తీసుకుని చిత్ర దగ్గరకు వెళ్తుంది మను
మను: ఏంటే నీ పెళ్లి జరిగిపోతుంది. నా పెళ్లి ఇంకా జరగలేదని చెప్పడానికి ఇదంతా చేస్తున్నావా..?
చిత్ర: చీచీ నేను అలా ఎందుకు చేస్తాను మను.
మను: మరి నీ ఫోటో షూట్‌కు నన్ను ఎందుకు రమ్మన్నావు
చిత్ర: తోడుకు మను .. రేపు నీకు అమర్ గారి ఫోటోషూట్‌కు నేను రానా ఏంటి..?
మను: అసలు నీ పెళ్లి తర్వాత నాకు హెల్ప్ చేస్తావని నమ్మకం ఏంటే.. నీ స్వార్థం మోసం అబద్దాల గురించి తెలిసిన నేను ఎందుకు నీకు హెల్ప్ చేస్తున్నాను.
చిత్ర: ఎందుకంటే భాగీ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేను కాబట్టి. భాగీని ఆ ఇంటికి అమర్ గారికి దూరం చేయడం నాకే కాదు నీకు కూడా అవసరమే కాబట్టి.. ఆ విషయం నీకు కూడా తెలుసు కాబట్టి నాకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు మను
మను: ఆశ్రమంలో చిల్లర దొంగతనాలు చేసే నువ్వు ఇంత దూరం వస్తావని అనుకోలేదు
చిత్ర: అంతా దేవుడి దయ మను
అంటూ నవ్వుతూ వెళ్లిపోతుంది చిత్ర. తర్వాత పిల్లలు రెడీ అయి కిందకు రాగానే అమర్ వచ్చి వెళ్దామా పిల్లలు అంటాడు. ఇంతలో అంజు బ్యాగ్‌లోంచి బుక్ తీసి అమర్ ఇస్తుంది. బుక్ చూసిన అమర్ చాలా నీట్‌గా వేశారు. ఎవరు వేశారు అని అడుగుతాడు. ఆకాష్ ఎమోషనల్ గా అమ్మ వేసింది డాడ్ అని చెప్తాడు. దీంతో బుక్‌లో రాసిన రైటింగ్ చూసి అమర్ ఎమోషనల్ అవుతాడు. ఇది ఆరు రాసిందే అంటాడు. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!






















