అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌కు ప్లాన్‌ చెప్పిన మను – ఇరకాటంలో పడిపోయిన అమర్‌

Nindu Noorella Saavasam Today Episode: అమర్‌ను ఎలా బ్లాక్‌మెయిల్ చేయాలో రణవీర్‌కు చెప్తుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode: మను చేస్తున్న ఆగడాలను చూస్తూ తట్టుకోలేక కోపంతో అటూ ఇటూ తిరగుతుంది ఆరు. ఆరును గమనిస్తుంటాడు గుప్త.

గుప్త: ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఆలోచిస్తున్నావు బాలిక

ఆరు: ఇంకా ఏం జరగాలి గుప్త గారు మొన్నటికి మొన్న ఫంక్షన్‌లో అంజును కిడ్నాప్‌ చేయాలని చూశారు. ఇవాళ ఇంటి ముందుకు వచ్చి కిడ్నాప్‌ చేయాలని చూస్తున్నారు. ఇలాగే వదిలేస్తే అంజుకు ఏమౌతుందోనని చాలా భయంగా ఉంది.

గుప్త:  నీ బాధ నాకు అర్తం అవుతుంది. కానీ..

ఆరు: కానీ లేదు కాకరకాయ లేదు ఇప్పుడే వెళ్లి దాన్ని చంపి ఈ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్‌గా పులిస్టాప్‌ పెట్టేస్తాను

గుప్త: ఆగుము బాలిక నువ్వు చేయబోతున్నది చాలా పెద్ద తప్పు

ఆరు:  అంటే తనేం తప్పు చేయడం లేదా..? లేకపోతే అవి మీకు కనిపంచం లేదా..? మీతో మాట్లాడటం టైం వేస్ట్‌ పక్కకు తప్పుకోండి గుప్త గారు

గుప్త:  మేము తప్పుకోము

ఆరు: గుప్త గారు ఫ్లీజ్‌ నేను మనోహరిని చంపేస్తే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది

గుప్త: బాలిక నీ ఆవేశంతో వినాశనం జరుగును కానీ సమస్యలు పరిష్కారం కావు. చెడుపై మంచి గెలుచుటకు మంచి ఎన్నడూ మారకూడదు. అయినను నీవు ఈ పని చేసినచో ఆ బాలికకు నీకు ఏమి వ్యత్యాసం ఉండును. మంచి అనునది నీ ఆయుధం దానిని ఎన్నడూ వీడవకు బాలిక

ఆరు: ఆ మంచి నాకు ఎన్నడు మంచి చేసింది గుప్త గారు.. నన్ను నా కుటుంబానికి దూరం చేసింది. నా కుటుంబం కష్టాల్లో పడేలా చేసింది. ప్రమాదం నా ఇంట్లో వచ్చి చేరేలా చేసింది అంతేగా..

గుప్త:  కాదు బాలిక.. నీ మంచి నిన్ను నీ పతిదేవుని దగ్గరకు చేర్చినది. ఒక కుటుంబం ఇచ్చింది. ఆ కుంటుంబానికి కష్టంలో తోడుగా ఉన్నది. నీ సహోదరిని ఈ ఇంటికి చేర్చినది. నీవు ఎంతటి కష్టములు వచ్చినను మంచిని వీడలేదు. అందుకే ఆ జగన్నాథుడు నీకు శక్తులను ఇచ్చాడు. నీ సమయం పూర్తి అయినను నిన్ను ఇంక ఇచ్చటనే ఉంచాడు

ఆరు: మనోహరి నిజస్వరూపం మా ఆయన ముందు బయట పెట్టలేనప్పుడు.. నా కుంటుంబం కష్టాన్ని తీర్చలేనప్పుడు ఇక నాకు శక్తులు ఎందుకు గుప్తగారు. చెప్పండి గుప్తగారు అన్నింటికీ మీ దగ్గర సమాధానం ఉంటుంది కదా.. దీనికి కూడా ఏదో సమాధానం ఉండే ఉంటుంది చెప్పండి గుప్తగారు

గుప్త:  నీ సమస్యకు సమాధానం నీకును తెలియును బాలిక. కానీ నువ్వు  ఆ బాలిక మీద ఉన్న కోపం వల్ల తెలుసుకోలేకపోతున్నావు

ఆరు: మీరు ఏమంటున్నారో తెలియడం లేదు గుప్తగారు

గుప్త:  నీ సమస్యకు పరిష్కారం నీ పతిదేవునికి నువ్వు నిజం చెప్పుటయా..? లేక అతగాడికి నిజం తెలియుటయా..?

ఆరు: ఆయనకు నిజం తెలియడము.. కానీ నేను చెప్పకూడదు ఎవరైనా వచ్చి చెప్పేలా చేయడం తప్పు కాదు అంతే కదా

గుప్త: ఏమో అదియు నీకే తెలియాలి

ఆరు: అంటే తప్పు కాదు.. మను గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుసు…

అనుకుని ఆలోచించగా ఆరుకు వార్డెన్‌ సరస్వతి గుర్తుకు వస్తుంది. వేంటనే తన శక్తులను ఉపయోగించి రేపే వార్డెన్‌, అమర్‌ను కలిసేలా చేస్తాను అనుకుంటుంది. తర్వాత మను రణవీర్‌కు కాల్‌ చేసి అమర్‌ను కిడ్నాప్ ఇష్యూ నుంచి డైవర్ట్‌ చేయాలంటే తన దగ్గర ప్లాన్‌ ఉందని చెప్తుంది. రణవీర్‌ ఏంటో చెప్పమని అడగ్గానే మనోహరి తన ప్లాన్‌ చెప్తుంది. ఇందులో నీకు ఉపయోగం ఏంటో అని రణవీర్‌ అడగ్గానే.. మంచి ప్లాన్‌ ఇస్తే తీసుకోవాలి కానీ కారణాలు అడగకూడదు అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.  మను ప్లాన్‌ ప్రకారం అమర్‌ను జైలుకు పంపించాలి అని రణవీర్‌ అనుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget