Nindu Noorella Saavasam Serial Today January 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఒకే స్కూల్ లో అంజు, బుజ్జమ్మ – ఎమోసనల్ అయిన అమర్
Nindu Noorella Saavasam serial Today Episode January 7th: అంజు వాళ్ల స్కూల్ లోనే బుజ్జమ్మ జాయిన్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: బాధలో ఉన్న పిల్లలకు రాథోడ్ నిజం చెప్పగానే పిల్లుల అందరూ సంతోషంతో డాన్స్ చేస్తుంటారు. మనోహరి మాత్రం భయంగా చూస్తుంటుది. పిల్లుల సంతోషంగా పైకి రూంలోకి వెళ్లిపోతారు. రాథోడ్ బయటకు వెళ్తాడు.
చంభా: మనోహరి నేను చెప్పాను కదా నీకు చెడు రోజులు మొదలవబోతున్నాయని
పైన రూంలో..
అమ్ము: మిస్సమ్మ, బుజ్జమ్మ తిరిగి వస్తున్నారు ఐదేళ్ల తర్వాత హమ్మయ్యా
అంజు: ఇక నువ్వు హాస్టల్ కు నేను కొడైకెనాల్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు అమ్ము
చంభా: ఇప్పటికైనా నా మాట నమ్ముతావా మనోహరి.. నేను చెప్పేది నిజమని ఒప్పుకుంటావా..?
ఆనంద్: మేము కూడా డెహ్రాడూన్ వెళ్లం ఇక్కడే ఉంటాం..
ఆకాష్: అవును బెటర్ మనం వెళ్లక ముందే మిస్సమ్మ, బుజ్జమ్మ వచ్చారని తెలిసింది. మనకు మళ్లీ హ్యాపీడేస్ మొదలయ్యాయి
చంభా: మనోహరి ఆ పిల్ల జన్మించినప్పుడే నీ మృత్యువు ఈ భూమి మీద అడుగుపెట్టిందని నాకు అర్థం అయింది మనోహరి. ఇక నువ్వు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి మనోహరి
మనోహరి: (మనసులో) బిడ్డతో హైదరాబాద్ వచ్చిన భాగీ ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్లినట్టు
అనుకుని అనుమానంగా అమర్ రూం దగ్గరకు వెళ్తుంది. రూంలో అమర్, రాథోడ్ మాట్లాడుతుంటారు.
రాథోడ్: సార్ మీతో చెప్పుకోలేని కారణం అయ్యుంటుంది సార్
అమర్: రాథోడ్ నాతో చెప్పుకోలేని కారణం ఉందంటే.. అది తనకు నాకు మధ్య దూరం ఉందని అర్థం అందుకే తను నన్ను విడిచి దూరంగా వెళ్లిపోయింది.
రాథోడ్: లేదు సార్ మిస్సమ్మకు మీరంటే ఎంతో ప్రేమ గౌరవం.. మీ పెళ్లి అయ్యాక మీకు దగ్గర అవ్వాలని మిస్సమ్మ ఎంతలా ప్రత్నించారో నాకు తెలుసు.. సార్.. అలాంటిది మిస్సమ్మ మిమ్మల్ని దూరం చేసుకుంటుందా..?
అమర్: ఇప్పుడు దూరం చేసుకుందిగా.. ఐదేళ్లుగా దూరంగానే ఉంది కదా..?
రాథోడ్: పోనీ నేను ఒక్కడినే అరకు వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసి వస్తాను సార్
అమర్: నువ్వు కూడా అరకు వెళ్లి ఎంక్వైరీ చేయకు.. రాథోడ్ ఇట్స్ మై ఆర్డర్.. నాకు తెలియకుండా నువ్వు తన గురించి ఎంక్వైరీ చేశావో నా గురించి నీకు బాగా తెలుసు రాథోడ్..
అంతా విన్న చంభా, మనోహరి అక్కడి నుంచి హాల్లోకి వెళ్తారు.
చంభా: మనోహరి, అమరేంద్ర మంచి పని చేశాడు. భాగీ గురించి తను వెతకడమే కాదు రాథోడ్ ను కూడా వెతకొద్దు అంటున్నాడు
మనోహరి: అమర్ వెతక్కపోయినా.. రాథోడ్ వెతక్కపోయినా మనం భాగీని వెతకాలి చంభా
చంభా: ఏ ఎందుకు..?
మనోహరి: మనం పెట్టిన భయంతో అది పారిపోయింది. ఈ అయిదేళ్లు అజ్ఞాతంలో ఉంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఏడేళ్ల గడువులో ఇంకా రెండేళ్లు మిగిలి ఉండగానే అది తిరిగి వచ్చింది. ఏ ధైర్యంతో తిరిగి వచ్చిందో దాన్ని నడిపిస్తున్న ధైర్యం ఏంటో నాకు తెలియాలి. ఆ పిల్లతో నాకు ప్రాణగండం అని చెప్పావు.. దాని అడుగు మళ్లీ ఈ ఇంట్లో పడకూడదు.. భాగీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు.
చంభా: భాగీ ఇంటికి వచ్చేదే అయితే ఈ పాటికి వచ్చేదే కదా..? తను ఎటో వెళ్లిపోయిందని రాథోడ్ చెప్పాడు కదా..? ఒకవేళ భాగీ బిడ్డతో ఇంటికి వచ్చినా అమరేంద్ర రానిచ్చేలా లేడు కదా..?
మనోహరి: పిచ్చి చంభా నువ్వు అమర్‌లో పైకి కనిపించే కఠినత్వమే చూస్తున్నావు.. కానీ తన మనసులో అరుందతిపైన భాగీపైన ఆ బిడ్డపైన ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు..? వాళ్లు రానంత వరకే అమర్ రాయిలా ఉంటాడు.. వాళ్లు వచ్చాక వెన్నలా కరిగిపోతాడు.. అందుకే వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్లను మట్టుబెట్టాలి..
చంభా: అర్థమైంది మనోహరి కానీ ఇంత పెద్ద సిటీలో వాళ్లు ఎక్కడున్నారని వెతకాలి.?
అనగానే.. దానికోదారి ఉంది అదేంటో నేను చెప్తాను పదా అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లిపోతారు. తర్వాత అంజుతో స్కూల్‌కు వెళ్లిన అమర్ అక్కడ బుజ్జమ్మను చూసి ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!




















