అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  పిల్లలను కిడ్నాప్‌ చేసేందుకు అరవింద్‌ కొత్త ప్లాన్‌ – పంతం నెగ్గించుకున్న మనోహరి

Nindu Noorella Saavasam Today Episode:   తన ప్లాన్ ప్రకారం మనోహరి పిల్లలను ఎక్స్‌ కర్షన్‌ కు పంపేలా చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:   మనోహరి అమ్ము చేత ప్రిన్సిపాల్ కు ఫోన్‌ చేసి ఎక్స్‌ కర్షన్‌కు వస్తున్నామని చెప్పమంటుంది. అమ్ము ఫోన్‌ చేసి చెప్పగానే ప్రిన్సిపాల్‌ షాక్‌ అవుతుంది. ఇంత సడెన్‌ గా చెప్తే ఎలా.. బంటి ఏర్పాట్లు చేశాడు కదా అంటుంది. దీంతో బంటి ఏర్పాట్లు చేయలేదని నేనే ఫాలోఅప్‌ చేశానని అమ్ము చెప్తుంది. అయితే సరే మీరు ముగ్గురు మాత్రమే రావాలని అంజలి రావొద్దని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. అంజలి బాధపడుతుంది. మనోహరి ఎలాగైనా నిన్ను పంపిస్తానని అంజలికి భరోసా ఇస్తుంది.  మరోవైపు అరవింద్‌ ఏదో ఆలోచిస్తుంటే అనుచరుడు వస్తాడు.

అనుచరుడు:  అన్నా ఇప్పుడే స్కూల్‌ నుంచి సమాచారం వచ్చింది. రేపు ఎక్స్‌ కర్షన్‌కు అమరేంద్ర పిల్లలు కూడా వెళ్తున్నారట.

అరవింద్: అమర్‌ నా ట్రాప్‌లో పడ్డాడురా..? పిల్లలు స్కూల్ నుంచి స్టార్ట్‌ అయ్యాక 50 కిలోమీటర్లు హైవేలో వెళ్తారు.  ఆ తర్వాత లెఫ్ట్‌ తీసుకుని 20 కిలోమీటర్ల తర్వాత ఫారెస్ట్‌ చెక్‌ ఫోస్ట్‌ దాటుకుని ఫారెస్ట్‌ లోకి వెళ్తారు.

అనుచరుడు: అయితే బస్సును మన వాళ్లతో మన రూట్‌లోకి వెళ్లేలా చేద్దాం అన్నా.. కానీ అమరేంద్ర ఆఫీసర్లను పెట్టి ఉంటాడు అన్న.

అరవింద్‌: అవును అమరేంద్ర ఆలోచించి ఉంటాడు. కానీ పిల్లల్ని కిడ్నాప్‌ చేయకపోతే ప్లాన్‌ అంతా ఫెయిల్‌ అవుతుంది. బస్సు ఫారెస్ట్‌ లోకి వెళ్లాలి. బస్సులో జరిగే ప్రతి విషయం మనకు తెలియాలి. అంటే నేను ఆ బస్సులో ఉండాలి.

  అని అరవింద్‌ చెప్పగానే అన్నా నువ్వు ఆ బస్సులో ఉన్నట్లు అమరేంద్రకు తెలిస్తే ఈ సారి నువ్వు జైలు నుంచి బయటకు రాలేవు అన్నా అంటాడు. కానీ ఎలాగైనా ప్లాన్‌ చేయాలని అరవింద్‌ చెప్తాడు. ఆరు గుమ్మం దగ్గర నిలబడి ఇంట్లోకి తొంగి చూస్తుంది.

గుప్త: ఇక్కడ ఏమీ చేయుచున్నావు బాలిక.

ఆరు: గుప్త గారు పొద్దుట్నుంచి మిస్సమ్మ బయటకు రాలేదు. అందుకే చూస్తున్నాను. అయినా గుప్తగారు మీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదండి.

అని తిడుతుంది. పైన రూంలో  పిల్లలు ఎక్స్‌ కర్షన్‌ కు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. మిస్సమ్మ హెల్ప్‌ చేస్తుంది.

అంజు:  ఏం చేస్తున్నావు మిస్సమ్మ.. నిన్నంతా వద్దన్నావు ఇవాళ హెల్ప్‌ చేస్తున్నట్టు నటిస్తున్నావు.

భాగీ: ఇప్పటికైనా నన్ను అడిగితే వద్దనే చెప్తాను. కానీ మీరు వెళ్లాక ఇబ్బంది పడకూడదని హెల్ప్‌ చేస్తున్నాను.

మనోహరి:  పిల్లల్ని ఎందుకు డిస్టర్బ్‌ చేస్తున్నావు. నువ్వు కనిపిస్తేనే పిల్లలకు నచ్చడం లేదు.

అంజు: మరీ ఫేస్‌ చూస్తేనే కోపం వచ్చేంత కోపం లేదులే ఆంటి.

మనోహరి: మీకు దాని మీద పీకల దాకా కోపం రావాలంటే ఇంకా ఏం చేయాలే (అని మనసులో అనుకుంటుంది మనోహరి)

భాగీ: అంజు ఎక్స్‌ కర్షన్‌కు వాళ్లు ముగ్గురు వెళ్తుంటే నువ్వెందుకు సర్దుకున్నావు

అని భాగీ అడగ్గానే మనోహరి కోపంగా అవన్నీ నీకెందుకు అయినా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు మిస్సమ్మ అంటుంది. భాగీ అక్కడి నుంచి కిందకు వెళ్లిపోతుంది. తర్వాత పిల్లలను తీసుకుని మనోహరి కిందకు వస్తుంది. అమర్‌ పిల్లలు ఇక వెళ్దాం పదండి అంటాడు. మనోహరి నేను వెళ్లి బస్‌ ఎక్కిస్తాను అంటుంది. వద్దని అమర్‌ పిల్లలను తీసుకుని వెళ్తాడు. పిల్లలు ఎక్స్‌ కర్షన్‌ కు వెళ్లే బస్సు డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేసిన అరవింద్ తన మనిషిని డ్రైవర్‌గా పంపిస్తాడు. మరోవైపు ఇంట్లో కూర్చుని భాగీ పిల్లల గురించే ఆలోచిస్తుంది. నిర్మల వచ్చి ఎంత పిలిచినా పలకదు. శివరాం వచ్చి గద్దించగానే ఉలిక్కిపడుతుంది. ఏమైందని నిర్మల అడగ్గానే పిల్లల గురించే ఆలోచిస్తున్నాను అత్తయ్యా వాళ్లను ఎక్స్‌ కర్షన్‌ కు పంపించడం నాకు ఇష్టం లేదని చెప్తుంది భాగీ.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Embed widget