Nindu Noorella Saavasam Serial Today August 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రామ్మూర్తిని ఇంటికి రమ్మన్న అమర్ – అమర్ చేతిలో తన చిన్నప్పటి పంచెను చూసిన ఆరు
Nindu Noorella Saavasam Today Episode: రామ్మూర్తికి ఆరుందతియే తన కూతురు అన్న నిజం తెలుస్తుందేమోనని అమర్ కంగారుపడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మంగళ, కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ రామ్మూర్తి కోసం ఎదరుచూస్తుంది. నిజం తెలుసుకుని గుండె పగిలి అక్కడే చనిపోయాడా ఏంటి అని భయపడి ఫోన్ చేసి నిజం తెలిసిదా? అని అడుగుతుంది. తెలియలేదని రామ్మూర్తి చెప్పడంతో మంగళ డిస్సపాయింట్ అవుతుంది. అమర్ నిజం చెప్పొద్దని వార్డెన్ కు చెప్పి ఉండొచ్చని అనుకుంటుంది మంగళ. మరోవైపు గార్డెన్ లో ఉన్న మిస్సమ్మ దగ్గరకు అమర్ వస్తాడు. అమర్ కు వాటర్ పడేటట్లు చేస్తుంది మిస్సమ్మ.
మిస్సమ్మ: అయ్యో సారీ సారీ అండి..
అమర్: మీ నాన్నగారు డిశ్చార్జ్ అయ్యారు కదా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండమని చెప్పు.
మిస్సమ్మ: ఆయన రారండి. ఇప్పటికే మీకు చాలా ఖర్చు అయ్యుంటుందని ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారని ఆయన బాధపడుతూ ఉంటారు.
అమర్: నా వాళ్లను చూసుకోవడం నాకెప్పుడు ఇబ్బంది అనిపించదు మిస్సమ్మ. నువ్వు ఫోన్ చేసి రమ్మని కన్వీన్స్ చేయ్.
రామ్మూర్తికి మిస్సమ్మ ఫోన్ చేస్తుంది.
రామ్మూర్తి: బాబు గారు..
మిస్సమ్మ: నాన్నా నేను
రామ్మూర్తి: అమ్మ భాగీ బాగున్నావా?
మిస్సమ్మ: బాగున్నాను నాన్నా.. మీరెలా ఉన్నారు. ఏంటి ఏదో సౌండ్ వస్తుంది. బయట ఉన్నారా? కొన్ని రోజులు బయటికి వెళ్లొద్దని చెప్పాను కదా నాన్నా
రామ్మూర్తి: అంటే అక్క గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఆశ్రమానికి వచ్చాను అమ్మా..
అని అడగ్గానే రామ్మూర్తి తెలియలేదని చెప్తాడు. దీంతో భాగీ ఎమోషనల్ గా ఫీలవుతుంది. రామ్మూర్తి ఎమోషనల్ ఫీలవుతాడు. ఇంతలో తేరుకున్న మిస్సమ్మ నువ్వేం బాధపడకు నాన్నా అంటూ రామ్మూర్తిని అమర్ ఇంటికి రమ్మన్నాడని చెప్తుంది. దీంతో ఇప్పటికే నేను చాలా భారం అయిపోయానని రాలేనని అంటాడు. దీంతో అమర్ ఫోన్ తీసుకుని నాకోసం మీరు ఇంటికి రండి అని పిలుస్తాడు. రామ్మూర్తి సరే అంటాడు.
మరోవైపు ఆరు, గుప్త చేయి పట్టుకుని ఇవాళ నాకేదో నిజం తెలుస్తుందన్నారు ఏ నిజమో చెప్పండి గుప్త గారు అని అడుగుతుంది. గుప్త తప్పించుకుని వెళ్తుంటే ఆరు కిటికి దగ్గరకు వస్తుంది. రూంలో అమర్ అల్మారా దగ్గర నిలబడి ఆరు చిన్నప్పటి వస్తువులు చూస్తూ ఉంటాడు. ఆ వస్తువులు ఆరు చూస్తే నిజం తెలిసిపోతుందని గుప్త అనుకుంటాడు. ఇంతలో అమర్ పంచెను బయటకు తీస్తాడు. అది ఆరు చూస్తుంది.
ఆరు: అది నన్ను అనాథ శరణాలయం ముందు పడేసినప్పుడు కట్టిన పంచె కదా? అది ఈయన చేతికి ఎలా వచ్చింది. నా కన్నవాళ్లు ఎవరో తెలిసే దాకా పుట్టినప్పటి గుర్తులు ఎవ్వరికీ ఇవ్వరు గుప్తగారు. అంటే ఆయనకు నా కన్నవాళ్లు ఎవరో తెలిసిపోయిందా? తెలిసి కూడా చెప్పడం లేదా? చెప్పండి గుప్త గారు.
అమర్: నీ నుంచి నిజాన్ని దాచాను.. ఇప్పుడు నిజం నుంచి మిమ్మల్ని దాస్తున్నాను. మీ అక్క ఈ లోకంలో లేదనే నిజాన్ని తెలుసుకుని నువ్వు తట్టుకోలేవు మిస్సమ్మ.
అంటూ అమర్ మనసులో అనుకుంటూ పంచెను గుండెలకు హత్తుకుని ఎమోషనల్ గా ఫీలవుతుంటాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు.
రాథోడ్: వంద గ్రాముల బరువు కూడా లేని ఈ పంచె మీ మనసులో ఎంత భారాన్ని పెంచుతుందో నాకు అర్థం అవుతుంది. సార్. ఇప్పటికైనా ఇంట్లో వాళ్లకు నిజాన్ని చెప్పి ఆ భారాన్ని దించేయండి సార్.
అమర్: ఇది భారం కాదు రాథోడ్. బాధ్యత. నా ఆరు నాకిచ్చిన బాధ్యత. ఇది ఆరు పుట్టింటి నుంచి వచ్చిన సారే.
రాథోడ్: ఎంత కాలమని మోస్తారు సార్ ఈ భారాన్ని
అమర్: కుదిరితే నా కట్టే కాలే వరకు దాస్తాను రాథోడ్. నాకు తెలిసిన ఆ నిజం నాలోనే దాచుకుంటాను.
ఆరు: అసలు నా కన్నవాళ్ల గురించి తెలిస్తే ఎవరు బాధపడతారు.? ఆయన్ని అంతలా కుమిలిపోయేలా చేస్తున్న నిజమేంటి?
అని ఆరు అడగ్గానే గుప్త అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇంతలో వెనక నుంచి మిస్సమ్మ వచ్చి అమర్ కు ఫోన్ ఇస్తుంది. మిస్సమ్మను చూసిన అమర్ షాక్ అవుతాడు. ఇంతలో అమర్ కు ఫోన్ రావడంతో వస్తున్నానని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. మరోవైపు గుప్తను పట్టుకున్న ఆరు ఆయన ఎందుకు నిజాన్ని దాస్తున్నారు అంటూ ప్రశ్నించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.