Nindu Noorella Saavasam Serial Today August 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆత్మ కోసం చంభా కొత్త ప్లాన్ - రంగంలోకి దిగిన చిత్ర
Nindu Noorella Saavasam serial Today Episode August 26th: ఆరును బంధంచేందుకు చంభా కొత్త ప్లాన్ చేస్తుంది. అందుకోసం చిత్రను రంగంలోకి దించుతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: పుట్‌బాల్ ఆడుతూ ఆరు ఆత్మను టార్చర్ చేస్తుంది మనోహరి. అయితే బాల్ ఆత్మకు తగలకుండా పిల్లలు ఆపేస్తుంటారు. మనోహరి ఎంత ప్రయత్నించినా బాల్ తగలదు.
ఆరు: థాంక్యూ అంజూ.. మిస్టర్ గుప్త ఫ్లీజ్ నన్ను కాపాడండి.
చిత్రగుప్త: మాతో పైకి రమ్మని నిన్ను పలుమార్లు హెచ్చరించినా నువ్వు ఆలకించితివా బాలిక మా మాటను పెడచెవిన పెట్టి నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటివి
ఇంతలో పై నుంచి ఎమోషనల్ అవుతూ తూనీగ రూపంలో వస్తాడు గుప్త. చంభా బంధంలోంచి ఆరును కాపాడి తన మీద కూర్చోబెట్టుకుని మొత్తం తిరుగతాడు. చిత్ర గుప్త మాత్రం ఆరు ఎక్కడకు పోయిందని కంగారుగా వెతుకుతుంటాడు. మరోవైపు రణవీర్ ఇంట్లో పూజ చేస్తున్న చంభా కోపంతో రగిలిపోతుంది. ఆరు తప్పించుకుంది అన్న విషయం తెలుసుకుంటుంది.
చంభా: ఆ ఆత్మ తప్పించుకుంది రణవీర్
రణవీర్: అదెలా సాధ్యం. నువ్వేసిన మంత్రాల దాటికి ఆ ఆత్మ బయటకు వెళ్లలేదని చెప్పావు కదా..? మరుగుజ్జుగా మారిని ఆత్మకు తన శక్తులేవీ పని చేయవని చెప్పావు కదా..?
చంభా: నన్ను మించిన శక్తి ఏదో ఆ ఆత్మను కాపాడింది. నా పంజరంలో బంధీ కావాల్సిన ఆ చిలుక ఎగిరిపోయింది. ఇందుకే నేను చెప్పాను. ఈరోజే దాని కథ ముగించాలని మరోసారి అది తప్పించుకుంది.
అని చంభా మంత్రాలు చదువుకుంటూ వెళ్లిపోతుంది. ఇక గార్డెన్‌లో పిలలతో పుట్‌బాల్ ఆడుతూనే ఉంటుంది మనోహరి. ఇంతలో రాథోడ్ ఎవరో పంతులును తీసుకుని వస్తాడు. మను వెంటనే రాథోడ్ దగ్గరకు వెళ్తుంది.
మను: రాథోడ్ ఏంటి పంతులు గారిని తీసుకొస్తున్నావు
రాథోడ్: సార్ తీసుకురమ్మన్నారు
మను: సడెన్‌గా అమరేంటి స్వామిజీని తీసుకురమ్మన్నారు
అని మనసులో అనుకుంటుంటే రణవీర్ ఫోన్ చేస్తాడు.
మను: చెప్పు రణవీర్
రణవీర్: అక్కడ ఏం జరుగుతుంది మనోహరి
మను: ఆరు పిల్లలతో బంతాట ఆడిస్తున్నాను. ఆరు ఆత్మకు నరకం చూపిస్తున్నాను.
రణవీర్: అంత లేదు ఆత్మ ఇప్పుడు అక్కడ లేదు..
మను: ఏం మాట్లాడుతున్నావు రణవీర్.. ఎలా తప్పించుకుంది
రణవీర్: చంభాను మించిన శక్తి ఏదో ఆ ఆత్మను కాపాడిందట
మను: ఏం మాట్లాడుతున్నావు రణవీర్ చంభాకు మించిన శక్తి ఎవరై ఉంటారు చెప్పు
రణవీర్: అది తెలుసుకోవడానికే నేను నీకు ఫోన్ చేశాను. అక్కడ ఎవరున్నారు..?
మను: ఇక్కడ నేను పిల్లలు తప్ప ఎవ్వరూ లేరు
రణవీర్: సరిగ్గా చూడు అక్కడ ఎవ్వరూ లేకుండా ఆత్మ తప్పించుకోలేదు. ఎవరైనా కనిపించారా..? చెప్పు
మను: అబ్బా రణవీర్ నాకైతే ఎవ్వరూ కనిపించలేదు ఎవ్వరూ లేరు.. ఆ రణవీర్ ఒక్క నిమిషం ఇప్పుడే పంతులు గారు ఇంటికి వచ్చారు.. తన వల్ల ఏమైనా.. సరే సరే మళ్లీ చేస్తాను
అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్తుంది మనోహరి. లోపలికి వెళ్లిన పంతులుతో జరిగిన విషయం చెప్తాడు అమర్. అత్మకు దుష్టశక్తులతోనే ప్రమాదం పొంచి ఉంటుందని అందుకోసం ఒక పూజ చేయాలని చెప్తాడు. అమర్ సరే అని చెప్తాడు. రేపు ఉదయమే ఆ పూజ చేద్దామని చెప్తాడు పంతులు. ఇంట్లో జరిగిందంతా మనోహరి రణవీర్‌కు ఫోన్ చేసి చెప్తుంది. అంతా తెలుసుకున్న చంభా ఆ పూజను ఎలాగైనా ఆపాలని లేకపోతే మరుగుజ్జుగా మారిన ఆత్మ మామూలుగా మారిపోతుందని.. ఆత్మకు మళ్లీ శక్తులు వస్తాయని చెప్తుంది. దీంతో చిత్ర పూజ జరగకుండా ప్లాన్ చేస్తుంది కింద పూజ జరుగుతుంటే పైకి వెళ్తుంది చిత్ర. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















