అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ కోసం రంగంలోకి దిగిన అమర్‌ - ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన కానిస్టేబుల్‌

Nindu Noorella Saavasam Today Episode: భాగీ ప్రమాదంలో ఉందని కానిస్టేబుల్ చెప్పగానే అమర్‌ కంగారు పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ కారులో వెళ్లిపోయాక అనామిక హ్యాపీగా గుప్త దగ్గరకు వెళ్లి తన ప్లాన్‌ సక్సెస్‌ అయిందని చెప్తుంది. అమర్‌, భాగీని కలిపానని చెప్తుంది. ఆయనే ఫోన్‌ చేసి భాగీని బయటకు రమ్మని చెప్పేలా చేశానని అంటుంది. దీంతో గుప్త నవ్వుతూ వెళ్లిపోతుంటే.. అనామిక ఆపుతుంది.

అనామిక: గుప్త గారు మాట్లడుతుంటే అలా వెళ్లిపోతున్నారు ఏంటి..?

గుప్త:  సంతోషంగా ఉన్నావు కదా బాలిక. అది చెడగొట్టడం ఇష్టం లేక వెళ్లిపోతున్నాను

అనామిక:  మీరు మాట్లాడితే నా సంతోషం ఎందుకు దూరం అవుతుంది.

గుప్త: నువ్వు నమ్ముతున్నది.. జరుగుతున్నది ఒక్కటి కాదు కాబట్టి. నిజం ఏమిటో మాకు తెలియును కనుక

అనామిక: అయితే నేను చూస్తున్నది నిజం కానప్పుడు మరి నిజం ఏంటో చెప్పండి

గుప్త: నీ పతి దేవుడు ఒంటరిగా బయటకు రమ్మన్నప్పుడు కూడా నీకు అతని మాటల్లోని అంతరార్థం  అవగతం కాలేదా..?   

అనామిక: ఏంటి గుప్తగారు ఆయన భాగీని బయటకు రమ్మని చెప్పింది సరదాగా తిరగడానికి కాదా..?

గుప్త: కాదు బాలిక నీ ప్రాణములు తీసిన వాడిని పట్టుకునేందుకు

అనామిక:  అసలేం జరగుతుంది గుప్త గారు.. అంటే ఇప్పుడు భాగీ సంతోషంగా ప్రమాదం వైపు వెళ్తుందా…? లేదు గుప్త గారు ఆయన అక్కడ అనుకున్నది జరగకపోతే భాగీ ప్రాణాలకే ప్రమాదం. నా చెల్లి ప్రాణాల మీదకు వచ్చే ఏ ప్లాన్‌ నాకు అవసరం లేదు. ఇప్పుడే వెళ్లి నా భాగీని నేను కాపాడుకుంటాను

గుప్త: ఆగుము బాలిక నువ్వు వెళ్లుటకు వీలు లేదు. జరుగునది వీక్షించుట తప్పా మార్చుటకు వీలులేదు. కాదని విధికి ఎదురు వెళ్లినచో ఆ ప్రమాదం నీ కుటుంబానికి వచ్చునని తెలుయును కదా..? కాదని నువ్వు వెళ్లదలుచుకున్నచో వెళ్లుము.. తర్వాత వచ్చే ప్రమాదాలకు నువ్వే బాధపడతావు

అని గుప్త హెచ్చరించి వెళ్లిపోతాడు. అనామిక ఆలోచనలో పడిపోతుంది. ఇక అమర్‌ పోలీసులతో కలిసి రోడ్డు దగ్గర వెయిట్‌ చేస్తుంటాడు.

రాథోడ్‌: సార్‌ నాకు ఎందుకో భయంగా ఉంది. కనీసం మేడంకు దూరంగానైనా మీరు ఫాలో అవ్వండి సార్‌

అమర్‌:  నన్ను చూస్తే బాబ్జీ.. భాగీ దగ్గరకు కూడా రాడు రాథోడ్‌. భాగీకి ఏమీ కాదు. ఇవాళ్టీతో వాడి ఆటలు అంతం చేయాలి.

అని మాట్లాడుకుంటుండగా.. చిత్ర అదే రూట్‌లో వస్తుంది. పోలీసులు చిత్ర కారును ఆపి చెక్ చేస్తుంటే రాథోడ్ చిత్రను చూస్తాడు.

రాథోడ్‌: సార్‌ చిత్ర ఉంది అక్కడ

అమర్‌: అవును తను ఇక్కడేం చేస్తుంది. ( ఇద్దరూ దగ్గరకు వెళ్తారు.) చిత్ర నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. అసలు కొడైకెనాల్ లో ఏం చేస్తున్నావు

చిత్ర: రెండు రోజులు అయింది సార్‌ వచ్చి.. ఊరికే.. ఊరు చూద్దామని వచ్చాను.

పోలీస్:  ఈ అమ్మాయి మీకు తెలుసా..? సార్‌

అమర్‌: తెలుసు తను.. నా వైఫ్, మనోహరి ఒకే ఆశ్రమంలో పెరిగారు

అని అమర్‌ చెప్పాక పోలీస్‌ వెళ్లిపోమ్మని చిత్రకు చెప్తాడు. చిత్ర వెళ్లిపోతుంటే.. మనోహరిని కలిసిన తర్వాత భోజనానికి రమ్మని చెప్తాడు అమర్‌. సరే అంటూ వెళ్లిపోతుంది. తర్వాత తన మీద కూడా తనకు అనుమానం ఉందని అమర్‌ పోలీస్‌ తో చెప్తాడు. ఇంతలో భాగీని ఫాలో అవుతున్న కానిస్టేబుల్‌ అమర్‌కు ఫోన్‌ చేసి ఏదో లారీ మేడం కారును ఫాలో అవుతుందని చెప్తాడు. దీంతో అమర్‌ పోలీసులను తీసుకుని అక్కడి నుంచి భాగీ కోసం వెళ్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని రెచ్చగొట్టి తన్నులు తిన్న సీఐ! అంబిక కుట్రకు విహారి బలైపోతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని రెచ్చగొట్టి తన్నులు తిన్న సీఐ! అంబిక కుట్రకు విహారి బలైపోతాడా!
Godavari Serial Today July 29th: 'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget