Nindu Noorella Saavasam Serial Today April 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అనామికను ప్రశ్నించిన సదాశివం – నిర్మల మాటలకు షాకైన అనామిక
Nindu Noorella Saavasam Today Episode: అనామిక మాటలు చేష్టలు అచ్చం అరుంధతిలా ఉన్నాయని నిర్మల, సదాశివం అనుమానించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ కోర్టుకు రావడం చూసిన చిత్ర వెనక నుంచి మనోహరిని డోర్ చాటుకు లాగేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్, రణవీర్‌ను చూసి పలకరిస్తాడు. నువ్వేంటి ఇక్కడున్నావని అడుగుతాడు. అసలు హైదరాబాద్ ఎప్పడొచ్చావు అంటాడు. అమర్ ను చూసిన షాక్‌లో రణవీర్ కొద్ది సేపు అలాగే ఉండిపోతాడు. షాక్‌లోంచి తేరుకుని ఉదయమే హైదరాబాద్ వచ్చానని చెప్తాడు.
రాథోడ్: ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సార్‌కు ఫోన్ చేసేవారు. ఇప్పుడు చేయలేదు.
రణవీర్: అది కోర్టులో చిన్న పని ఉంది అది అయ్యాక చేద్దామనుకున్నాను.
అమర్: నువ్వు ఉండేది కోల్‌కతాలో అయితే హైదరాబాద్ కోర్టులో ఏం పని నీకు ఏదైనా ప్రాబ్లమా రణవీర్ చెప్పు
రణవీర్: ప్రాబ్లమ్ ఏం లేదు అమరేంద్ర గారు ఫ్రెండు కేసు పని మీద వచ్చాను. ఫ్రెండు డివోర్స్ తీసుకుంటున్నాడు మోరల్ సపోర్టు కోసం వచ్చాను.. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు. అంజు పాప ఎలా ఉంది.
అమర్: అందరూ బాగున్నారు నేను వేరే పని మీద వచ్చాను రణవీర్ తర్వాత కలుద్దాము
అని అమర్ వెళ్లిపోతాడు. మనోహరి కంగారు పడుతుంది. పక్కనే ఉన్న చిత్రను చూసి షాక్ అవుతుంది.
చిత్ర: హాయ్ మనోహరి
మనోహరి: నువ్వు ఇక్కడేం చేస్తున్నావు
చిత్ర: ఏంటి మను కాపాడినందుకు థాంక్స్ లేదు. తప్పించినందుకు అప్రిసియేషన్ లేదు
మనోహరి: థాంక్స్ నువ్వు నన్ను పక్కకు లాగకుండా ఉండి ఉంటే..?
చిత్ర: అమరేంద్ర గారిని పెళ్లి చేసుకోవాలనుకున్న నీ కల కలగానే మిగిలిపోయేది అంతే కదా..? అయినా నువ్వు దొరికిపోతే నాకు వచ్చే లాభం ఏంటో చెప్పు.. అదే నిన్ను తప్పిస్తే.. నాకు కావాల్సినప్పుడు నాకు కావాల్సినంత డబ్బు ఇస్తావు కదా..?
మనోహరి: అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు
చిత్ర: అసలు ఎందుకో తెలియనట్టు అడుగుతావు ఏంటి..? ఆశ్రమం నుంచి వెళ్లినప్పుడు కొంచెం టచ్‌లో ఉండమని చెప్పాను కదా.. కానీ నువ్వు లేవు. అందుకే నేను ఉందామని మీ ఇంటికి వస్తే.. నువ్వు కంగారు పడుతూ బయటకు వెళ్తూ కనిపించావు. ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చాను. కలిసి వెళ్దాం అనుకుంటే నాకు కలిసి వచ్చే విషయం ఒకటి తెలిసింది.
రణవీర్: తనను పక్కకు తీసుకొచ్చింది మీరేనా
చిత్ర: అవును నేను పక్కకు లాగాను.
అని చెప్పగానే రణవీర్ చిత్రకు థాంక్స్ చెప్తాడు. చిత్ర తనను రణవీర్‌కు పరిచయం చేసుకుంటుంది. ఇంతలో మనోహరి డివోర్స్ ఫ్రోగ్రాం ఈరోజు వద్దని కోర్టు నుంచి వెళ్లిపోతుంటే రణవీర్ కోపంగా నేను నేరుగా అమరేంద్ర దగ్గరకు వెళ్తాను అంటూ బెదిరిస్తాడు. మనోహరి షాక్ అవుతుంది. మరోవైపు పిల్లలు చెస్ ఆడుతుంటే అనామిక వెళ్లి అంజును గెలిపిస్తుంది. ఆరులాగే గేమ్ ఓవర్ యువర్ ఫినిష్ అంటుంది. దీంతో సదాశివం, నిర్మల అనామికను అనుమానిస్తారు. తర్వాత అనామిక దగ్గరకు వెళ్తారు.
సదాశివం: అమ్మా అనామిక నువ్వు ఎవరు..? నీకు మా కోడలు అరుంధతికి సంబంధం ఏంటి..? చెప్పమ్మా మా కోడలు నీకు తెలుసా..? పరిచయం ఉందా నీకు
అనామిక: మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంకుల్
సదాశివం: ఇందాకా చెస్ గేమ్‌లో అంజును గెలిపించాక నువ్వు ఏమన్నావో గుర్తు ఉందా అమ్మా
అని సదాశివం అడగ్గానే.. అనామిక గుర్తు తెచ్చుకుంటుంది. నిర్మల, సదాశివం ఎంత అడిగినా అనామిక మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!




















