అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వర్జినల్‌ నగలు కొట్టేసిన మంగళ – నగలు తీసుకుని ఇంటికి రమ్మని మనోహరికి చెప్పిన అమర్‌

Nindu Noorella Saavasam Today Episode: నగలు తీసుకుని ఇంటికి రమ్మని అమర్, మనోహరికి చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: తమిళ డ్రైవర్‌ మనోహరికి ఫోన్‌ చేసి.. డూప్లికేట్‌ నగలు ఇస్తావా? అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లి నగలు చెక్‌ చేస్తుంది. నా దగ్గర ఉన్నవి కూడా డూప్లికేట్‌ నగలేనని చెప్పడంతో నాతోనే నాటకాలు ఆడుతున్నావా? అంటూ రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నా లేదంటే అమర్‌కు నిజం చెప్తానని ఫోన్‌ కట్‌ చేస్తాడు డ్రైవర్‌. మరోవైపు రాథోడ్‌, మిస్సమ్మ నగల బ్యాగ్‌ గురించి మాట్లాడుకుంటుంటే నిర్మల వస్తుంది. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు. అంటూ అడగ్గానే అమర్‌ సార్‌ బ్యాగ్‌ ఇచ్చారని చెప్పడంతో అవి అరుంధతి నగలు నీకిచ్చాడా? అయితే నగలు సేఫ్‌గానే ఉంటాయి అని నిర్మల అనడంతో రాథోడ్‌, మిస్సమ్మ షాక్‌ అవుతారు. వెంటనే బయటకు వెళ్లిపోతారు.

మిస్సమ్మ: రాథోడ్‌ గారు మనం ఇంటికి వెళ్లేసరికి లేట్‌ అవుతుంది. ముందు నాన్నకు ఫోన్‌ చేసి మనోహరికి బ్యాగ్‌ ఇవ్వొద్దని చెబితే సరిపోతుంది.

అంటూ మిస్సమ్మ వాళ్ల నాన్నకు ఫోన్‌ చేస్తుంది.

మూర్తి: హలో బాగీ..

మిస్సమ్మ: హలో నాన్న నేను నీకిచ్చిన బ్యాగ్‌ మనోహరికి ఇవ్వకండి. నేను ఇప్పుడే వస్తున్నా..

మూర్తి: ఇప్పుడే వచ్చి బ్యాగ్‌ తీసుకెళ్లిపోయిందమ్మా!

మిస్సమ్మ: బ్యాగ్‌ మనోహరికి ఇచ్చేశారా?

మూర్తి: ఏమ్మా ఏదైనా సమస్యా?

మిస్సమ్మ: ఏం లేదు నాన్న మనోహరి ఇంట్లోనే ఉందా? బ్యాగ్‌ దగ్గరలోనే ఉందా?

మూర్తి: లేదమ్మా తీసుకెళ్లి చాలాసేపు అయ్యింది.

అనగానే మనోహరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్పు నాన్న అంటూ మిస్సమ్మ అడగ్గానే జరిగింది మొత్తం చెప్పగానే సరే నాన్న మళ్లీ చేస్తాను అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు మనోహరి జువ్వెల్లరీ షాప్‌కు వెళ్తుంది. మనోహరిని ఫాలో అవుతూ మిస్సమ్మ, రాథోడ్‌ షాపుకు వస్తారు. మనోహరి కోపంగా షాపు ఓనరును రెండూ డూప్లికేట్‌ నగలు ఇచ్చావేంటి అంటూ నిలదీయగానే మూడో సెట్టు చెక్‌ చేసుకోవాల్సింది అంటూ ఓనరు చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. మూడో సెట్టు ఎంటి అని మనోహరి అడగ్గానే నిన్న ఒకావిడ వచ్చిందని మీరు చెప్పారని మూడో సెట్టు చేయమని చెప్పిందని ఓనరు అనగానే మనోహరి తన ఫోన్‌లో నీల, మిస్సమ్మ  ఫోటో చూపించి వీళ్లేనా అని అడుగుతుంది. కాదని ఓనరు చెప్తాడు. మరోవైపు మంగళ నగలు వేసుకుని నేనే అది నేనే అంటూ పాట పాడుతుంది. ఇంతలో మూర్తి వస్తాడు.

మూర్తి: మంగళ.. మంగళ డోర్‌ కూడా తెరచి ఉంది. ఇది ఎక్కడుందబ్బా?

మంగళ: ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను.

మూర్తి: ఎక్కడున్నావే మాట వినిపిస్తుంది మనిషివి కనిపిస్తలేవు?

మంగళ: ఇక్కడున్నానండి.. ఇక్కడ

మూర్తి: అక్కడేం చేస్తున్నావే? బయటకు రా?

అనగానే మంగళ రాలేనని చెప్పగానే సరేలే రోడ్డు మీద వస్తుంటే ఉంగరం ఒకటి దొరికింది. నువ్వు రావడం లేదుగా భాగీకి ఇస్తానులే అనగానే మంగళ పరుగెత్తుకొస్తుంది. దీంతో మంగళ ఒంటిమీద నగలు చూసి మూర్తి ఎక్కడివి అని నిలదీస్తాడు. ఇంతలో గిల్టీ నగలు వేసుకుని ఏం ఫోజుకొడుతున్నావు అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు రాథోడ్‌, మిస్సమ్మ ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటారు.

రాథోడ్‌: ఇప్పుడు ఆ వర్జినల్‌ నగలు ఎవరు తీసుకెళ్లినట్లు మిస్సమ్మ. మనోహరి అమ్మగారు ఆ నగలు ఎవరికి  ఇస్తుంది. అసలేం జరుగుతుందో ఎవరేం చేస్తున్నారో?

మిస్సమ్మ: ఒక్కటి మాత్రం క్లారిటీగా ఉంది. మనోహరి ప్లాన్‌ ఎవరికో తెలుసు? వాళ్లు మనోహరికి కూడా తెలియకుండా నగలు తీసేసుకున్నారు. మనం ముందు ఆ నగలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి.

అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అమర్‌ వస్తాడు. నిర్మల రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్లావు అంటూ అడగ్గానే తాను మనఃస్ఫూర్తిగా చేసుకోవడం లేదని ఏదో పెళ్లి తంతులాగా ముగిస్తే సరిపోతుంది అంటూ అమర్‌ చెప్పగానే నిర్మల నీకైతే రెండో సారి పెళ్లి కానీ మనోహరికి ఇదే మొదటి పెళ్లి కదా గ్రాండ్ గా చేస్తే బాగుంటుంది. అని చెప్పగానే మిస్సమ్మ కూడా అదీ నిజమేనని చెప్పి మేడం నగలు తాళిబొట్టు తీసుకొచ్చి ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పగానే అమర్‌ సరేనంటాడు. మనోహరికి ఫోన్‌ చేసి నగలు తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు. దీంతో భయంగా మనోహరి సరే అంటుంది. తర్వాత మూర్తి ఇంటికి వెళ్తుంది మనోహరి.  అసలు నీ పెళ్లి రేపు అవుతుందా? అని మూర్తి అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్న స్టార్ ప్రొడ్యూసర్.. ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటే బెటరేమో!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 15th: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
నువ్వులేక నేను లేను: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
Illu Illalu Pillalu Serial Today August 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget