అన్వేషించండి

Nindu Manasulu Serial Today June 4th: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?

Nindu ManasuluSerial Today Episode June 4th: సాహితి పెళ్లిచూపుల నెపంతో ప్రేరణను ఇంట్లో నుంచి పంపించేందుకు విజయానంద్‌ ఎత్తువేయగా....నేను కూడా వెళ్లిపోతానంటూ సిద్ధూ చిత్తు చేస్తాడు.

Nindu Manasulu Serial Today Episode: అందమైన ప్రేమకథకు కుటుంబ బంధాలు తోడవ్వడంతో స్టార్‌మా ఛానెల్‌లో ప్రసారమవుుతన్న నిండు మనసులు సీరియల్‌ బుల్లితెర అభిమానులకు ఎంతో దగ్గరైంది. ఇవాల్టి ఏపిసోడ్‌లో సాహితి పెళ్లిచూపులకు మినిస్టర్‌గారు వస్తున్నారని ప్రేరణను ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని విజయానంద్‌ చెప్పగా...ఆమెతోపాటు నేను వెళ్తానని సిద్ధూ కౌంటర్‌ ఇస్తాడు.అలాగే లేట్‌నైట్‌ పార్టీకి సాహితి వెళ్తుండగా సిద్ధూ అడ్డుపడతాడు. నా కూతురికి నీ పర్మిషన్ అవసరం లేదని విజయానంద్ అనడంతో ఇవాల్టి ఏపీసోడ్ రసవత్తరంగా మారుతుంది.

సాహితీకి పెళ్లిచూపులు

సాహితీని పెళ్లిచేసుకోవడానికి సంబంధం మాట్లాడేందుకు మినిష్టర్‌ కొడుకు వస్తున్నాడని విజయానంద్‌కు ఫోన్‌ వస్తుంది.దీంతో ఆనందంతో పొంగిపోయిన విజయానంద్ అందరినీ పిలిచి ఈ విషయం చెబుతాడు.రేపే మినిష్టర్‌ వాళ్లు వస్తున్నారని చెపపడంతో అందరూ సంతోషిస్తారు.ఈ సంబంధం చాలా మంచిదని చెప్పడంతో సాహితి కూడా పొంగిపోతుంది. ఈ సంబంధం కుదిరితే నా కూతురు జీవితం ఎంతో బాగుంటుందని విజయానంద్ అంటాడు.

ప్రేరణను వెళ్లిపోవాలని మెలిక

రేపు మినిస్టర్‌గారు పెళ్లిచూపులకు వస్తున్నారని కాబట్టి ప్రేరణను రెండురోజులపాటు వాళ్ల ఇంటికి పంపించేయమని విజయానంద్ అంటాడు.అదేంటి వాళ్లు పెళ్లిచూపులకు వస్తే ప్రేరణ పుట్టింటికి వెళ్లడం ఏంటని సిద్ధూ అడుగుతాడు.తను ఇక్కడే ఉంటే ఆ అమ్మాయి ఎవరని...తనుకు నీకు ఉన్న సంబంధం ఏంటని వాళ్లు అడుగుతారని అంటాడు.అడిగితే చెప్పండని ఆమె ఈ ఇంటికోడలని, నా భార్య అని చెప్పండని అంటాడు. ఈ ఒక్కమాటతో వాళ్లు ఆగరని ఎందుకంటే పెళ్లంటే అటు ఏడుతరాలు,ఇటు ఏడు తరాల గురించి విచారిస్తారు కాబట్టి ప్రేరణ పుట్టుపూర్వోత్తరాలు గురించి కూడా ఆరా తీస్తారని అంటాడు. వాళ్ల అమ్మ ఎవరు అంటే చెప్పొచ్చు గానీ...మరి వాళ్ల నాన్న ఎవరంటే ఏం చెబుతామని విజయానంద్ ప్రేరణను అవమానిస్తాడు. దీంతో సిద్ధూ,ప్రేరణకు కోపం వస్తుంది.అలాగే మీ పెళ్లి ఎలా జరిగిందంటే ఏం చెబుతామని అంటాడు.రోడ్డుపై దిక్కుమొక్కులేకుండా తాళికట్టి తీసుకొచ్చావని చెప్పలేం కదా అని అంటాడు.

స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సిద్ధూ

ఇంతలో మంజుల కల్పించుకుని ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది.ఇవాళ కాకపోయినా రేపు అయినా  నిజంవాళ్లకు తెలిసితీరాలి కదా అని అంటుంది.నిజాలు దాచిపెట్టి పెళ్లిళ్లు చేయడం మంచిది కాదని అంటుంది. దీంతో విజయానంద్ కల్పించుకుని వాళ్లు ఈ సంగతి తెలిసి సంబంధం వద్దంటే బాగుండదు కదా అని అంటుంది. ప్రేరణ వల్ల సాహితి జీవితం నాశనమవ్వడం మంచిది కాదుకదా అని అంటుంది.అయితే ప్రేరణ ఇంటి నుంచి వెళ్లిపోతుందని సిద్ధూ అంటాడు. వెళ్లి బట్టలు సర్దుకోమని చెబుతాడు. అలాగే నా బట్టలు కూడా సర్దమని అంటాడు. నా భార్యకు చోటులేని ఇంట్లో నేను ఉండనని అంటాడు.దీంతో సాహితి అన్నయ్య లేకుండా నేను అసలు పెళ్లిచూపులలకు రానని  మారాం చేస్తుంది.అంతగా వాళ్లకు ఇష్టం లేకపోతే మనం వేరే సంబంధంచూసుకుందామని అంటుంది. దీంతో తప్పనిసరిపరిస్థితుల్లో విజయానంద్ ప్రేరణ కూడా ఉండటానికి ఒప్పుకుంటాడు.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3 బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4 గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

సాహితిని అడ్డుకున్న సిద్ధూ

రేపు మినిస్టర్‌ వాళ్లు వస్తున్నారని తెలిసి సిద్దూ, ప్రేరణ ఇద్దరూ ఇంట్లో బూజు దులుపుుతుండగా రాత్రివేళ సాహితి బయటకు వెళ్లడం గమనించి సిద్ధూ వెనక్కి రమ్మని పిలుస్తాడు.ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు.నాకు పెళ్లిచూపులని మా ప్రెండ్స్‌కు పార్టీ ఇస్తున్నానని అందుకే వెళ్తున్నానని చెబుతుంది.రేపు పెళ్లిచూపులు పెట్టుకుని ఈ టైంలో ఎక్కడికి అని నిలదీస్తాడు. దీంతో విజయానంద్ కల్పించుకుని నన్ను అడిగే వెళ్తుందని అంటాడు. నువ్వు పంపించినా నా చెల్లిని ఈటైంలో బయటకు నేను పంపించనని అంటాడు. పెళ్లైపోతే ఆ తర్వాత బయటకు వెళ్లడం కుదరదని...అందుకు ఈ కొన్నిరోజులు నాకు నచ్చినట్లు ఉంటానని సాహితి అంటుంది. దీంతో విజయానంద్‌ నా కూతురిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసునని అనడంతో ప్రేరణ సిద్ధూను వదిలేయమని చెబుతుంది. ఆయన కూతురు గురించి ఆయన చూసుకుంటానన్నప్పుడు నీకు ఎందుకని చెప్పి లోపలికి తీసుకెళ్లిపోతుంది..

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
Karthika Deepam 2 Serial Today August 17th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget