అన్వేషించండి

Anshu Reddy: బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Actress Anshureddy: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో నర్మదగా అలరిస్తున్న అన్షురెడ్డి.. గత 15 ఏళ్లుగా బుల్లితెరపై రాణిస్తోంది. సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ అన్షు యాక్టివ్‌గా ఉంటుంది.

Anshu Reddy: స్టార్ మాలో ప్రసారం అయ్యే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో సాగర్ భార్య క్యారెక్టర్ చేస్తున్న నర్మద అసలు పేరు అన్షురెడ్డి. ఆమె కట్టు బొట్టు చూస్తే అబ్బా భార్య అంటే ఇలా ఉండాలని సీరియల్ చూసేవాళ్లకు అనిపిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగిగా, రామరాజు రెండో కోడలిగా.. భాగ్యంకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే నర్మద క్యారెక్టర్‌లో అన్షురెడ్డి నటన మరో లెవల్.  

అన్షురెడ్డి తెలంగాణ సిద్ధిపేట జిల్లా చీర్యాలకు చెందిన వారు. ఆమె పదో తరగతి పూర్తి కాగానే తన తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌కు మకాం మార్చింది. అన్షుకు చిన్నప్పటి నుంచీ నటన అంటే మక్కువ ఎక్కువ. అనుకోకుండా వచ్చిన అవకాశంతో.. ఒకరోజు స్టార్ మహిళ షోలో అన్షు పాల్గొంది. అదే సమయంలోనే  సీరియల్‌లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. ఆ అవకాశాన్ని కరెక్ట్‌గా వాడుకుంటూ.. బుల్లితెరపై రాణిస్తుంది. సోషల్ మీడియాలో అన్షురెడ్డి యాక్టివ్‌గా ఉంటుంది.  

అన్షురెడ్డి కెరీర్, సీరియల్స్  

తెలుగు బుల్లితెరపై అందం, అభినయంతో అలరిస్తున్న నటి అన్షురెడ్డి. 'భార్యామణి' సీరియల్‌‌తో బుల్లితెర కెరీర్ స్టార్ట్ చేసింది. తొలి సీరియల్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  'గోకులంలో సీత',  'ఇద్దరమ్మాయిలు', 'సూర్యవంశం', స్టార్ మా లో వచ్చిన 'కృష్ణవేణి', 'కథలో రాజకుమారి', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' వంటి సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు, ఎమోషనల్ హోమ్లీ క్యారెక్టర్లలలో ఆమె చక్కగా నటించగలదు. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లోనూ అన్షు సత్తా చాటుతోంది.  దాదాపు పదేళ్లుగా 15కి పైగా సీరియల్స్‌లో నటించిన అన్షురెడ్డి నటించింది. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: చితక్కొట్టుకున్న మొగుడుపెళ్లాలు! సారె తీసుకొచ్చిన ప్రసాద్‌రావు! నర్మద రియాక్షన్ ఏంటి?

సోషల్ మీడియాలో యాక్టివ్  

అన్షు‌రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అన్షురెడ్డి(https://www.instagram.com/_anshureddy/)  ఇన్‌స్టాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతుంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తన లేటెస్ట్ ఫొటోషూట్స్, సీరియల్ సెట్స్‌లోని రీల్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు, పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు 993k(9.3 లక్షలు) ఫాలోవర్స్ ఉన్నారు.

చాలా మంది తోటి నటీనటుల లాగే అన్షు కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్స్, షాపింగ్ వ్లాగ్స్, మేకప్ ట్యుటోరియల్స్ వంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో యూట్యూబ్(@_anshureddy*) ఆడియన్స్‌ను అలరిస్తుంటుంది. ఒక్క యూట్యూబ్ ద్వారానే నెలకి నాలుగు లక్షల వరకూ సంపాదించేదట. కానీ ఇప్పుడు వీడియోలు చేయడం కాస్త తగ్గించడంతో ఇన్‌కమ్ తగ్గిపోయిందని టాక్. యూట్యూబ్‌లో ఆమెకు 466k (4.6 లక్షలు) ఫాలోవర్స్ ఉన్నారు. 

Also Read: కార్తీకదీపం సీరియల్: ఎపిసోడ్‌లో అదే హైలెట్..! మాజీ సుందరితో ఆ పని చేయించేశారా! కాశీ కొత్త బిజినెస్ ఐడియా అదుర్స్!

డ్యాన్స్‌లోనూ సూపర్

‌‌అన్షు కేవలం సీరియల్స్ మాత్రమే కాదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే టాలెంటెడ్ డ్యాన్స్ షో ఢీ లో కంటెస్టెంట్‌గా పాల్గొంటుంది. నటనలో మాత్రమే కాదు అద్భుతమైన డ్యాన్స్‌తో కూడా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

 సీరియల్స్ రెమ్యునిరేషన్ 

తెలుగు బుల్లితెరపై లీడ్, క్రేజ్ ఉన్న నటీనటులకు పేమెంట్ 'పర్ డే' చొప్పున ఇస్తారని టాక్. అన్షురెడ్డి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. టెలివిజన్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆమె సీరియల్‌లో తనకున్న ప్రాధాన్యత, క్యారెక్టర్ లెంగ్త్, ఛానల్‌ను బట్టి రోజుకు సుమారు రూ.15,000 నుంచి రూ. 25,000 వరకు (లేదా అంతకంటే కాస్త అటుఇటుగా) ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. సీరియల్స్ మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్, ఓపెనింగ్స్ ద్వారా కూడా ఆమె అడిషనల్ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!

బ్రేకప్ కూడా 

2021లో సౌమిత్ రెడ్డితో ఎంగేజ్మెంట్ అయ్యింది. వీళ్ల నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ చివరి నిషయంలో అన్షురెడ్డి-సౌమిత్ రెడ్డిలకు బ్రేకప్ అయ్యింది.  

(Disclaimer: సెలబ్రిటీల రెమ్యునరేషన్ వివరాలు అధికారికంగా బయటకు రావు. ఇవి కేవలం ఇండస్ట్రీ వర్గాల సమాచారం, ఇంటర్నెట్ అంచనాల ఆధారంగా తెలుసుకున్నవి మాత్రమే). 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today June 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ప్లాన్‌ ప్రకారం కంపెనీని లాగేసుకుంటానన్న రేఖ – కొత్త ప్లాన్‌ చేసిన ఇందు     
‘బ్రహ్మముడి’ సీరియల్: ప్లాన్‌ ప్రకారం కంపెనీని లాగేసుకుంటానన్న రేఖ – కొత్త ప్లాన్‌ చేసిన ఇందు     
Lakshimi Raave Maa Intiki Serial Today June 11th: 24 గంటల్లో బిడ్డను వెతికి తెచ్చివ్వమని ప్రియంవదకు తండ్రి ఆదేశం...లక్ష్మీని బయటకు వెళ్లగొట్టేందుకు ప్రియంవద ప్రయత్నాలు
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: 24 గంటల్లో బిడ్డను వెతికి తెచ్చివ్వమని ప్రియంవదకు తండ్రి ఆదేశం...లక్ష్మీని బయటకు వెళ్లగొట్టేందుకు ప్రియంవద ప్రయత్నాలు
Nindu Manasulu Serial Today June 11th: నిండు మనసులు: నాన్న అన్న పదానికే కలంకం తెచ్చే దరిద్రులు వీళ్లు.. సిద్ధూ ఉగ్రరూపం! దద్దరిల్లిపోయిన డైనింగ్ టేబుల్!
నిండు మనసులు: నాన్న అన్న పదానికే కలంకం తెచ్చే దరిద్రులు వీళ్లు.. సిద్ధూ ఉగ్రరూపం! దద్దరిల్లిపోయిన డైనింగ్ టేబుల్!
Jagadhatri Serial Today June 11th:శ్రీవల్లి వైజయంతి కూతురు కాదని చెప్పేసిన యువరాజు...తల్లిని తప్పుపట్టడంతో నిజం చెప్పిన కొడుకు
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి వైజయంతి కూతురు కాదని చెప్పేసిన యువరాజు...తల్లిని తప్పుపట్టడంతో నిజం చెప్పిన కొడుకు
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: హర్మూజ్ గురించి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌కు తెలియకుండా అంతపని చేశారా!
హర్మూజ్ గురించి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌కు తెలియకుండా అంతపని చేశారా!
AP, Telangana Rain Alert: ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
Pawan Kalyan Interview Highlights: నారా లోకేష్‌తో ఇబ్బంది వల్లే తెలంగాణకు వెళ్తున్నారా? ANI ఇంటర్యూలో పవన్ కల్యాణ్ సంచలన సమాధానం!
నారా లోకేష్‌తో ఇబ్బంది వల్లే తెలంగాణకు వెళ్తున్నారా? ANI ఇంటర్యూలో పవన్ కల్యాణ్ సంచలన సమాధానం!
The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
Hyderabad Crime News: భార్యపై అనుమానం.. గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి మరీ కాల్చి చంపేసిన భర్త- హైదరాబాద్‌లో దారుణం
భార్యపై అనుమానం.. గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి మరీ కాల్చి చంపేసిన భర్త- హైదరాబాద్‌లో దారుణం
Hardik Pandya Ruled Out: నిన్ననే క్లియరెన్స్, మళ్లీ తిర‌గ‌బెట్టిన‌ గాయం.. ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం!
నిన్ననే క్లియరెన్స్, మళ్లీ తిర‌గ‌బెట్టిన‌ గాయం.. ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం!
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
Maruti Suzuki Offers Price Protection: మారుతి కార్లు కొనాలనుకునే వారికి సూపర్ చాన్స్, ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటే పాత ధరలకే సొంతం!
మారుతి కార్లు కొనాలనుకునే వారికి సూపర్ చాన్స్, ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటే పాత ధరలకే సొంతం!
Embed widget