News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Trinayani September 6th Episode: నాగయ్య గురించి తెలుసుకున్న నయని, గురువుగారు చెప్పిన పని సుమన చేస్తుందా!

నాగయ్యను బదించారు అని అందరికీ తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

Trinayani September 6th Written Update: సుమన, విక్రాంత్ గదిలో కూర్చుని మాట్లాడుతూ ఉండగా పైనుంచి కుబుసం సుమన కూతురు మీద పడుతుంది. దాన్ని అక్కడ నుంచి కిందకు విసిరేస్తుంది సుమన.

సుమన: ఛి ఛి చెత్తంతా ఇక్కడే ఉంది ఎందుకు దీన్ని ఇక్కడికి తెచ్చారు?

విక్రాంత్: నేను తేవడం ఏంటి? మొన్నటి వరకు వీటన్నిటిని పట్టుకుని నువ్వే తిరిగావు కదా?

సుమన: నేను వీటిని పట్టుకొని తిరగడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు?

విక్రాంత్: మొన్నటి వరకు పచ్చి గుడ్లను తినేయడం వీటిని పట్టుకొని ఉండడం, కాన్పు అయిపోయిన తర్వాత అన్ని మర్చిపోయావా?

సుమన: నేను అసలు గుడ్లనే తినను. అలాంటివి పచ్చి గుడ్ల? మీరు ఇలా చెప్తుంటే నాకు కంపరంగా ఉంది.

విక్రాంత్: నువ్వేం చేసావో నీకే గుర్తుండడం లేదు అయినా కాన్పు అయిపోయింది కదా ఇంక మళ్ళీ అలాంటివి చేయవులే వదిలేయ్.

నిజంగా ఇవన్నీ నేను చేసుంటానా అని మనసులో అనుకుంటుంది సుమన. ఆ తర్వాత సీన్లో విశాల్ తన పిల్లలను ఆడిస్తూ ఉంటాడు. అప్పుడు తనకి గతంలో తన పిల్లలతో ఆడుకున్న సంఘటనలు అన్ని గుర్తొస్తాయి. తర్వాత నయని తనకి భోజనం తినిపిస్తూ ఉండగా గతంలో తను తినిపించిన సంఘటనలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు విశాల్. ఆ తర్వాత సీన్లో గురువుగారు వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడే ఉన్న ఎద్దులయ్య, డమ్మక్క గురువుగారిని పలకరిస్తారు. ఇంతలో కుటుంబ సభ్యులందరూ వచ్చి అక్కడికి చేరుతారు.

Also Read: స్కూల్ ని కాపాడిన ఆర్య - భయంతో పారిపోయిన ఛాయాదేవి, మాన్సీ!

వల్లభ: ఏంటి గురువుగారు ఈమధ్య తరచుగా దర్శనమిస్తున్నారు?

గురువుగారు: కొందరు కనిపించినపుడు నేను అవుపించాలి కదా వల్లభ.

తిలోత్తమ: వాడి మాటలు పట్టించుకోకండి గురువుగారు. వీడికి ఏం మాట్లాడాలో తెలీదు.

హాసిని: తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి అత్తయ్య. ఏది వస్తే అది మాట్లాడితే శపించేగలరు.

తిలోత్తమ: శాపం వచ్చింది నయని మొగుడికి, నా కొడుకు కాదు.

హాసిని: కాకి కొడుకు కాకి కి ముద్దు అని అంటూ తన పెళ్లి కష్టాలు అని చెప్పుకొని వస్తుంది హాసిని. ఇంక మాట మాట పెరగడంతో ఇప్పుడు గతం గురించి తలుచుకొని బాధపడడం అనవసరం. గురువుగారు వచ్చిన కార్యం ఏంటో చూద్దాం అని అంటుంది దురంధర.

ఎద్దులయ్య: గురువుగారు దారి చూపించడానికి వచ్చారు

దురంధర: ఏ దారి?

డమ్మక్క: నయని భర్తకి శాప విమోచనం అయ్యే దారి.

నయని: మంచిది స్వామి మిమ్మల్ని అడుగుదామనుకున్నాను, మీరే సాయం చేస్తున్నారు

గురువుగారు: అంతా విశాలాక్షి అమ్మవారి దయ.

వల్లభ: ఇప్పుడు ఏడు సముద్రాలు దాటి, అక్కడ ఒక చెట్టు ఉంది దాని దగ్గర ఒక గుడ్డు ఉంది అది తేవాలి అని అనరు కదా

గురువుగారు: మూర్ఖుడా!! అబద్ధాలు చెప్పి జీవనం సాగించే నువ్వు నాకు సూచనలు ఇస్తావా?

నయని: గురువుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. దయచేసి ఎవరు ఆయన్ని విసిగించొద్దు. మీరు చెప్పండి గురువుగారు.

ఎద్దులయ్య: చెప్పడం కాదు వినవలసిన వాళ్లు మాట వినాలి.

గురువుగారు: ముందు నీ భార్య మాట వినాలి విక్రాంత్.

సుమన: నా మటుకు నేను ఉంటే మధ్యలో నన్ను ఎందుకు అంటారు

గురువుగారు: ఈ శాపానికి పరిష్కారం మానవుడి వల్ల కాని పని. అది నాగయ్య వలన మాత్రమే అవుతుంది

సుమన: ఇంకెక్కడి నాగయ్య ఆనాడేనాడో నయిని అక్క పిలిచింది అప్పటినుంచి ఇప్పటివరకు తన జాడే లేదు.

వల్లభ: అందుకే నాగయ్య అని అంటున్నారు. ఇలాంటి అబద్ధాలు అని చెప్పుకొస్తున్నారు

గురువుగారు: మూర్ఖుడా అదే పాము చేత నీకు కాటు వేయబడుగాక

Also Read: సీరియల్ ని మలుపుతిప్పనున్న రిషి సమాధానం, మరింత విజృంభించిన శైలేంద్ర!

హాసిని: అలాగే చెప్పండి గురువుగారు. కావాలంటే వెళ్లి నీళ్లు తెస్తాను, కొంచెం నీళ్లు మా అత్తగారి మీద పడినా పరవాలేదు శాపం వేసేయండి. పోతే ఒక పీడ వదిలిపోతుంది. హాయిగా చితి పెర్చామా, ఒక పువ్వు పెట్టామ, శ్రద్ధాంజలి చేసామా అన్నట్టే అయిపోతుంది.

తిరుత్తమ: భర్త అంటే గౌరవం లేదా నీకు

డమ్మక్క: భర్త మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారా అని అంటాడు ఎద్దులయ్య

తిలోత్తమ: నా ఇంట్లో తింటూ నన్నే ప్రశ్నిస్తున్నారా?

విక్రాంత్: మీరందరూ ఆగండి వల్లభ ఇంకా షాక్ లో నుంచి బయటికి రాలేదు. అయినా గురువుగారు నాగయ్య కనిపించడం లేదు కదా ఎందుకు?

గురువుగారు: తెలుసుకోవాలి విక్రాంత. బంధించేస్తే నాగయ్య బయటికి ఎలా వస్తాడు?

నయని: నాగయ్యని బంధించారా నిజమా గురువుగారు?

హాసిని: వాళ్ళు ఎవరో చెప్పండి గురువుగారు తోలు తీసి డప్పు కొట్టిస్తాను.

నయని: నాగయ్యని ఎవరు బంధించారు? అసలు తన జోలికి, తన వాళ్ళ జోలికి రానంతవరకు నాగయ్య ఎవరిని ఏమీ అనడు. నాగయ్య బయటకు వస్తే కాని బాబు గారి శాపానికి విముక్తి దొరకదు

గురువుగారు: నాగయ్య ఎక్కడున్నాడో తెలియాలంటే సుమనే నీకు సహాయం చేయాలి.

సుమన: నేనేం చేయాలి?

గురువుగారు: ఎంగిలి అంటని ఆకులో నీ పాలు పట్టివాలి.

దురంధర: ప్రసవం తర్వాత సుమీకి సరిగ్గా పాలు రావడం లేదన్నది స్వామి.

గురువుగారు: ప్రసవం జరిగిన తర్వాత పాలు కచ్చితంగా వస్తాయి అబద్ధాలు ఆడకుండా ఆ పాలను ఇస్తే అవి మనల్ని నాగయ్య దగ్గరకు తీసుకొని వెళ్తాయి.

సుమన: ఆహా నేను ఇవ్వను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

గురువుగారు: వేరే మార్గం ఇంకేమీ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు గురువుగారు. ఏం చేయలేక నయిని ఏడుచుకుంటూ ఉండిపోతుంది. ఆ తర్వాత సీన్లో వల్లభ మంచం మీద కూర్చుని వణుకుతూ ఉంటాడు.

తిలోత్తమ: ఏం చూసి వణుకుతున్నావురా?

వల్లభ: గురువుగారు శాపం పెట్టినప్పుడు నుంచి ఎక్కడ పాము వచ్చి కాటేస్తుందో అని భయంగా ఉందమ్మా.

తిలోత్తమ: ఇంకెక్కడి పామురా మనం బుట్టలో పెట్టి బంధించేసాం కదా ఏం కాదులే.

ఇంతలో హాసిని ఒక బొమ్మ పాముని పట్టుకొని వచ్చి మంచం మీద ఉన్న వల్లభ వైపు వేస్తుంది. దానికి వల్లభ ఉలిక్కిపడి భయపడిపోతాడు.

దురంధర: ఇదెక్కడి పోయే కాలమే భర్త చచ్చిపోతాడు అంటే ఇంత సంతోషంగా ఉన్నావు.

హాసిని: పనికిరాని భర్త, ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు పోతే మెడ మీద ఉన్న భారమైన దిగుతాది.

అప్పుడు తిలోత్తమ హాసినిని కొట్టగా హాసిని మంచం మీద వచ్చి పడుతుంది.

హాసిని: థాంక్స్ అత్తయ్య మంచం మీద పడుకోపెట్టారు అలాగే దుప్పటి కూడా ఇస్తే హాయిగా పడుకుంటాను.

దురంధర: కొట్టిన సిగ్గు రాదు ఏంటి నీకు?

హాసిని: మరి నేను అన్న మాటలకి కొట్టరా? అయినా లైఫ్ లో ఫన్ ఉండాలి పిన్ని. లేకపోతే త్వరగా చచ్చిపోతాము అని చెప్పి ఆ బొమ్మపాముని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

దురంధర: దీన్ని గాని కెలికితే నిజంగా పామును తెచ్చి కరిపించేసేలాగే ఉన్నాది.

ఆ తర్వాత సీన్లో సుమన పాప ఏడుస్తూ ఉండగా విక్రాంత్ అక్కడికి వస్తాడు.

విక్రాంత్: పాప ఏడుస్తుంది ఒకటి కూడా కాదు రెండు కాన్పులు అయ్యాయి అసలు నువ్వు ఆడదానివేనా? పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదా?

సుమన: మొదటి కాన్పు కడుపులోనే పుటుక్కుమన్నది లేకపోతే నయని అక్క లాగా నేను కూడా ఇద్దరినీ బ్రహ్మాండంగా చూసుకునే దాన్ని.

విక్రాంత్: అవునవును. గాయని నీ కూతురు అని చెప్పినప్పుడు కూడా ఆస్తి కోసమే పెంచావు కానీ ఏనాడు పాలిచ్చి పెంచలేదు. ఇప్పటికైనా పాలిచ్చి ఓదార్చు ఏడుపాపడం లేదు.

సుమన: బాబాయిని ఆవు పాలు తెమ్మన్నాను అని విక్రాంత్ కు చెప్తుంది.. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: Priyanka Jain - shivakumar: అమ్మాయిగా మారి షాక్ ఇచ్చిన సీరియల్ హీరో - 'జానకి కలగనలేదు' హీరోయిన్‌పై ప్రాంక్, చివరికి?

Published at : 06 Sep 2023 11:18 AM (IST) Tags: Trinayani serial Trinayani telugu serial Trinayani zee telugu serial Trinayani September 6th

ఇవి కూడా చూడండి

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!

Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద-  కృష్ణ ఉగ్రరూపం!

Nindu Noorella Saavasam October 4th: మేజర్ ను చూసి షాకైన మిస్సమ్మ - మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అరుంధతి!

Nindu Noorella Saavasam October 4th: మేజర్ ను చూసి షాకైన మిస్సమ్మ - మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అరుంధతి!

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్