డజను రోగాలకు దివ్యౌషధం నేరేడు



కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్స్ సహా ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వుల మిశ్రమం నేరేడు పళ్ళు



వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. అందుకే గుండె సంబంధిత రోగాలు నయం అవ్వాలంటే నేరేడు పళ్లు తీసుకోవడం మంచిది.



విష వాయువులు, వాయు కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను శుభ్రం చేసే శక్తి నేరేడు పళ్ళకు ఉంది



నేరేడు పళ్లలో ఉండే జింక్, విటమిన్ సి ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. ఇందులో సైనైడిన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకుంటాయి.



నేరేడు పళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి ఇవి ఊపయోగపడతాయి



అధిక మూత్ర విసర్జన, అధిక దాహం లాంటి డయాబెటిస్ లక్షణాలను నేరేడు పళ్ళు అదుపులో ఉంచుతాయి



కాలేయానికి , జీర్ణ సమస్యలకు , ఆర్థరైటిస్ నివారణకు కూడా నేరేడు దివ్య ఔషధం. చర్మకాంతిని పెంచటానికి ఇవి దోహదపడతాయి



నేరేడు పళ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.



కాయలను కూడా నీటిలో పంచదార వేసి ఉడికించి నిల్వ చేసుకోవచ్చు . గింజలను ఎండ పెట్టి పొడి చేసి ఆ పొడిని నీటిలో కలిపి తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది .



కేవలం పళ్లే కాకుండా చెట్టు బెరడు , పళ్ళ గింజల్లో కూడా మంచి ఔషధ గుణాలుంటాయి. ఆయుర్వేద వైద్యంలోనూ కొన్ని సాంప్రదాయ వైద్య పద్ధతులకు నేరేడు చెట్టు వివిధ భాగాలను ఎక్కువ వాడుతారు.



Images Credit: Freepik